ట్విస్ట్‌ల సినిమాలు తీసే అడవి శేష్‌కే అది అతి పెద్ద ట్విస్ట్ అంట!

క్రియేటీవ్‌ డైరెక్టర్, క్రియేటీవ్ స్టోరీ రైటర్, క్రియేటీవ్ యాక్టర్‌ అడవి శేష్‌. బాహుబలిలో భళ్లాలదేవుడి కుమారుడిగా నటించిన ఆ కుర్రోడు “ఎవరు” అనుకున్నారు అంతా. మరల “ఎవరు”తో ఎవరో బాగా తెలిసి వచ్చింది. మంచి స్టఫ్‌ ఉన్నోడని అర్థం అయింది. ఆయన నటించిన “క్షణం” సూపర్ సస్పెన్స్ మూవీ. ఆ తర్వాత వచ్చిన “గూఢఛారి” అనేక ట్విస్టులతో అలరించాడు. లేటెస్ట్‌ “ఎవరు” మూవీతో ట్విస్ట్‌లను పీక్స్‌ లో ఆడియన్స్‌కి చూపించాడు.

శేష్‌కు నిజ జీవితంలో ఎదురైన ట్విస్ట్ ఏంటంటే.. “కిస్” సినిమా అనేది నా కెరీర్‌లో అతిపెద్ద డిజాస్టర్. ఆ సినిమా పరాజయంతో పాటు నాకో విలువైన పాఠాన్ని నేర్పింది. ఈ సినిమా పోస్టర్లకు వాడిన మైదా పిండి ఖర్చు కూడా రాలేక పోవటం కంటే ట్విస్ట్ ఇంకేముంటుంది?. సాధారణ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన నేను కిస్ సినిమాతో రెండు కోట్లు గొట్టుకున్నాను. ఆ సినిమా ఇచ్చిన షాక్‌తో హడలిపోయాను. ఆ సమయంలో నేను ఉంటున్న ఫ్లాట్‌కి పదివేలు అద్దె కట్టడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి. ఆ సమయంలో షేక్‌పేట్ నుంచి మెహదీపట్నం నడుచుకుంటూ వెళ్లాను. ఓ కార్ల షోరూమ్ దగ్గర ఆగాను. నాకు ఆ షోరూమ్‌లోని ఓ కారు నచ్చింది. నన్ను గమనించిన షోరూమ్ మేనేజర్ మీరు పంజాలో నటించారు కదా రండి సార్ లోపలికి అన్నాడు. కానీ నా దగ్గర ఆ కార్ బుక్ చేయడానికి అడ్వాన్స్ డబ్బులు లేవు.

అయినా ఈ కార్‌ని బుక్ చేయోచ్చా అన్నాను. తను ఓకే అనగానే అప్పుడు అనిపించింది. నాలో ఏదో వుంది దాన్ని కరెక్ట్‌గా బయటికి తీయాలి అనుకున్నాను. అలా సినిమాల విషయంలో నా ఆలోచనా విధానాన్ని మార్చుకున్నాను. “క్షణం” తరువాత 55 కథలు విన్నాను. అందులో ఏ కథ నన్ను సంతృప్తిపరచలేదు. ఓ సగటు ప్రేక్షకుడిగా నాకు నచ్చిన చిత్రాలు చేస్తున్నాను. థియేటర్‌లో పాప్‌కార్న్ తింటూ సినిమాను ఎంజాయ్ చేయాలన్నదే నా ప్రధాన ఉద్దేశం అన్నారు అడివి శేష్. “ఎవరు” ఓ డీసెంట్ ఫిల్మ్. సినిమా నాణ్యత పరంగా ఉన్నతంగా వుంటుంది. అలా అని సినిమాలో ఎలాంటి అసభ్యకరమైన సన్నివేశాలు లేవు. 70 శాతం చిత్రీకరణ పూర్తయిన దగ్గరి నుంచి మళ్లీ మళ్లీ చూసుకుంటూ రీషూట్‌లు చేస్తూ వచ్చాం. ఈ విధానాన్ని క్షణం, గూఢచారి చిత్రాలకు అనుసరించాం. మంచి ఫలితాల్ని సాధించాం. అందుకే ఈ చిత్రానికి కూడా అదే పంథాను అనుసరించి సినిమా సంతృప్తికరంగా వచ్చే వరకు రీషూట్‌లు చేశాం అని చెప్పారు.

Copy Protected by Chetan's WP-Copyprotect.