ఏపీని ఏలిన ఆ ముగ్గురు కాంగ్రెస్‌ సీఎంల ఫ్యామ్లీలు తొలిసారి టీడీపీ తరపున ఎన్నికల బరిలోకి! జగన్‌ ఓటుబ్యాంకుకు బొక్కే!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చీఫ్‌ మినిస్టర్స్‌గా పని చేసిన ఆ మూడు కుటుంబాలు కాంగ్రెస్‌ పార్టీలో చారిత్రాత్మకమైన పాత్రను పోషించాయి. రాష్ట్రంలో వారి పేర్లు తెలియని వాళ్లు ఉండరు. చరిత్ర పుటల్లో వారు నిలిచిపోయారు. తొలిసారిగా 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం తరపున పోటీ చేయబోతున్న ఆ మాజీ సీఎం కుటుంబాలు ఎవరంటే మాజీ సీఎం కోట్ల విజయ భాస్కరరెడ్డి తనయుడు కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి తనయుడు కాసు కృష్ణారెడ్డి కుమారుడు కాసు మహేష్‌రెడ్డి,

నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్ కుమార్‌ రెడ్డి. వీరు ముగ్గురు కాంగ్రెస్‌లో ఘనత వహించిన కుటుంబాలే. వీరు ముగ్గురు రాష్ట్రాన్ని ప్రభావితం చేయగల రెడ్డి సామాజిక వర్గం నేతలే. వీరంతా తొలిసారిగా తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. కాంగ్రెస్ అంశతో పుట్టి అవినీతి, నేరమయ రాజకీయంలో కూరుకుపోయిన వైసీపీలో చేరటం కంటే, రాజకీయ అజ్ఞాని జగన్‌ పంచన చేరే కంటే ప్రత్యర్థి అయినా రాష్ట్రం పట్ల విజన్ ఉన్న చంద్రబాబు నాయకత్వంలో పనిచేయటమే ఉత్తమం అని వారు భావించారు. తమ సామాజిక వర్గం వాడని జగన్ వద్దకు వెళ్లటం అంటే అంతకంటే ఆత్మద్రోహం ఇంకోటి ఉండదని, తమ సామాజిక వర్గం కాకపోయినా చంద్రబాబుతో కలిసి పనిచేస్తే తమకీ తగిన గౌరవం ఉంటుందని వారు విశ్వసిస్తున్నారు. చంద్రబాబు’ తనకు అవసరమైన చోట బలమైన నాయకులనుకున్న వారిని పార్టీలోకి తీసుకుంటూ రాజకీయాలను రసవత్తరం చేస్తున్నారు.

చిత్తూరు జిల్లా టీడీపీ వర్గాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం రాజంపేట తెలుగుదేశం ఎంపీ అభ్యర్థిగా నల్లారి కిషోర్ కుమార్‌ రెడ్డి లేదా ఆయన తనయుడు అమర్‌నాథ్‌రెడ్డిలలో ఒకరు పోటీ చేయటం ఖాయం అని సమాచారం. వారు ఇద్దరిలో ఒకరిని రాజంపేట ఎంపీ సీటుకు, ఇంకొకరు పీలేరు ఎంపీ సీటుకు టీడీపీ గుర్తుపై పోటీ చేస్తారని తాజా సమాచారం. ‘కాసు’ కుటుంబం టిడిపిలోకి వస్తే…వారికి ‘నర్సరావుపేట’ అసెంబ్లీ సీటు ఇస్తారని తెలుస్తోంది. ‘కోడెల శివప్రసాద్‌’ మళ్లీ ‘సత్తెనపల్లి’ నుంచే పోటీ చేస్తారు. నర్సరావుపేటలో ‘కోడెల, కాసు’ బలం కలిస్తే సులువుగా టిడిపి విజయం సాధించగలుగుతుంది. కోట్ల విజయ భాస్కర రెడ్డి రాజకీయాల్లో మహోన్నత శిఖరం. డిగ్నిటీ, స్థాయి గల రాజకీయాలకి కేరాఫ్. విలువలు పాటించడం, విలువలకి కట్టుబడటం, నిజాయితీ లాంటివి ఆయనకి ముందు నుంచి చివరాఖరి వరకూ ఉన్నాయ్. ఆయన వారసుడు సూర్యప్రకాష్‌రెడ్డిని కర్నులు ఎంపీగా పోటీ చేయించాలని సీఎం భావిస్తున్నారు. ఈ మూడు కుటుంబాల ప్రభావం రెడ్డి సామాజికవర్గంపై ఉంటుందని జగన్ ఆందోళన చెందుతున్నారు

Copy Protected by Chetan's WP-Copyprotect.