బిగ్ బాస్-3 వైల్డ్ కార్డ్ ఎంట్రీ! ఈ 10 మందిలో నుంచేనా?

బిగ్‌ బాస్‌లో డల్‌గా ఉన్న కంటెస్టెంట్‌లను వదిలించుకుని కొత్త వాళ్లను రంగంలోకి దింపాలని బిగ్ బాస్ ఆలోచన. అందుకు సరైనోళ్ల కసం అన్వేషిస్తున్నారు. బిగ్ బాస్ తెలుగు మూడవ సీజన్ గత రెండు సీజన్లతో పోల్చుకుంటే కాస్త నెమ్మెదిగా సాగుతుంది. కంటెస్టెంట్ల అలకలు.. కోపాలు.. గొడవలు.. బుజ్జగింపులు మధ్య నెల రోజులైతే గడిచి పోయాయి. ఇప్పటికే హౌస్ నుంచి ఐదుగురు సభ్యులు అవుట్ అయ్యారు. గత వారం హిమజ రెడ్డి,

అషూ రెడ్డి, పునర్నవి ఈ ముగ్గురికీ తక్కువ ఓట్లు పడగా.. చివరకు అషూ రెడ్డి బయటకు వచ్చేశారు. ఆదివారం (25 ఆగస్ట్ 2019) ఎలిమినేషన్‌కు సంబంధించి షో ప్రసారం అయింది. అయితే ఈ వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మరో సెలబ్రిటీ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే వైల్డ్ కార్ట్ ఎంట్రీ ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తమన్నా సింహద్రి ఎలిమినేట్ కూడా అయ్యారు. అయితే ఈసారి షోలో ఇంట్రెంస్ట్ క్రియేట్ చేసే వ్యక్తిని ఎంటర్ చేయాలని నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీలో హీరోయిన్ శ్రద్ధాదాస్, ఈషా రెబ్బా, హైపర్ ఆది, ఇంకా పలువురి పేర్లు ప్రముఖంగా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్న ఆ 10 మంది వివరాలు చూస్తే: 1. కే.ఎ.పాల్ 2. ఈషా రెబ్బా 3. మనీషా ఎర్రబత్తిని

4. హైపర్ ఆది 5. వైవా హర్ష 6. యాంకర్ రవి 7. శ్రద్ధా దాస్ 8. జబర్దస్త్ వేణు 9. హెబ్బా పటేల్ 10. కమల్ కామరాజు. ఈ 10 మందిలో ఒకరు ఈ వారం కానీ వచ్చే వారం కానీ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. బిగ్ బాస్ హౌస్‌లోని 37వ రోజు ప్రారంభంతో మంగళవారం నాటి ఎపిసోడ్ మొదలైంది. ఉదయం 8 గంటలకు ‘ఇస్మార్ట్ శంకర్’లోని ‘జిల్లేలమ్మ జిట్టా పిల్లా పాలపిట్ట’ పాటతో ఇంటి సభ్యులంతా నిద్రలేచారు. శ్రీముఖి, హిమజ, పునర్నవి, రితికా షెరు, బాబా భాస్కర్ గార్డెన్ ఏరియాలో స్టెప్పులేశారు. ఈవారం నామినేట్ అయిన ఆరుగురు సభ్యులు రాహుల్, రవికృష్ణ, వరుణ్ సందేశ్, మహేష్ విట్టా, పునర్నవి, హిమజలను యాక్టివిటీ ఏరియాలోకి రావాలని బిగ్ బాస్ కోరారు. ఈ ఆరుగురిలో ముగ్గురు ఈవారం ఇంటి నుంచి బయటికి వెళ్లకుండా ఉండటానికి బిగ్ బాస్ ఒక డీల్‌ ఇచ్చారు. అందులో విన్‌ అయిన రాహుల్, రవికృష్ణ, వరుణ్‌ ఈవారం ఎలిమినేషన్‌ నుంచి సేవ్ అయ్యారు.

Copy Protected by Chetan's WP-Copyprotect.