బిగ్‌బాస్‌కు చుక్కలు చూపిస్తున్న పునర్నవి! బిగ్‌బాస్‌ను ఏకిపారేసింది!

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-3లో పునర్నవి కొరకరాని కొయ్యలా మారింది. బిగ్‌బాస్‌ ఆదేశాలను ఏకిపారేస్తోంది. మీరు చెప్పిన చెత్త అంతా నేను చేయను ఏం చేసుకుంటారో చేసుకోండని తిరుగుబాటు బావుటా ఎగుర వేసింది. ఈరోజు బుధవారం జరగబోయే ఎపిసోడ్‌లో దెయ్యాలుగా మారిన పునర్నవి, శ్రీముఖి, మహేష్‌లను శిక్షిస్తున్నారు బిగ్ బాస్. అయితే నన్ను గేమ్‌లో హింస పెట్టి ఇప్పుడు నేను శిక్ష అనుభవించాలా? నేను చేయను ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ కుండబద్దలు కొట్టేసింది పునర్నవి.

ఇక మహేష్ సైతం.. చెప్పులు కడిగేది ఏంది? బూట్లు కడిగేది? నేను చెయ్యా అంటూ బిగ్ బాస్‌పై ఫైర్ అవుతున్నారు. మొత్తానికి నేటి ఎపిసోడ్‌లో బిగ్ బాస్‌కి చుక్కలు చూపించింది పునర్నవి. మరి రేపటి ఎపిసోడ్‌లో ఎవరిది పైచేయి అవుతుందో.. బిగ్ బాస్ ఎలాంటి ట్విస్ట్ ఇస్తాడో.. తోకముడుస్తాడో చూడాలి. ఇక మంగళవారం జరిగిన 52వ ఎపిసోడ్ హైలైట్స్ విషయానికి వస్తే.. ఎపిసోడ్ ప్రారంభంలో శ్రీముఖి తనను నామినేషన్ నుండి సేవ్ చేయకపోవడంపై బాబా భాస్కర్‌తో డిస్కషన్ పెట్టింది. ‘మీరు రవిని ఎలిమినేషన్ నుండి సేవ్ చేయడం నాకు షాక్‌గా అనిపించలేదు.. సర్ ప్రైజ్‌గా అనిపించింది.. దాని వల్ల నాకు బాధగా లేదు కాని.. మీరు వచ్చి నన్ను బాధపడుతున్నావా? అంటేనే ఫీల్ అవ్వాల్సి వస్తుందని ఎమోషన్ అయ్యింది శ్రీముఖి.ఇక ఈవారం లగ్జరీ బడ్జెట్‌లో భాగంగా కంటెస్టెంట్స్‌కి ‘ ఇంట్లో దెయ్యం నాకేం భయం’ అనే టాస్క్ ఇచ్చారు. ఇందులో ఐదు దెయ్యాలుగా బాబా భాస్కర్, హిమజ, రాహుల్, శిల్ప, వితికాలు ఉంటారు. వీరు ఇంట్లో మిగిలిన వరుణ్, శ్రీముఖి, పునర్నవి, రాహుల్, రవి, మహేష్‌లకు విసుగుతెప్పించాలి. దెయ్యపు చేష్టలతో వాళ్లు రియాక్ట్ అయ్యేట్టు చేయాలి. మనుషులకు విసుగు తెప్పించి.. వాళ్లను చంపాలి. దీనిలో భాగంగా తొలిరోజు ముగ్గుర్ని చంపాల్సి ఉంటుంది. ఇలా చేస్తే చనిపోయిన వాళ్లు దెయ్యాలుగా.. చంపిన వాళ్లు మనుషులుగా మారతారు. మొదటిగా వరుణ్‌కి వితికా మూడు ముద్దులు పెట్టి బాత్రూం మిర్రర్‌పై వరుణ్ గోస్ట్ అని రాయాలని.. శ్రీముఖి తలపై కోడిగుడ్డు కొట్టాలని.. పునర్నవిని పూల్‌లోకి తోసేయాలని.. రవిని డాన్స్ వేసేట్టు చేయాలని.. మహేష్‌ని ఐదు సార్లు బట్టలు మార్చుకునేలా చేయాలని దెయ్యాలకు చిల్లర టాస్క్‌లు ఇచ్చారు బిగ్ బాస్.

ఇక ఆటను మొదలు పెట్టిన దెయ్యాలు ఒక్కో టాస్క్‌ను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశారు. మొదట వితికా.. వరుణ్‌కి ముద్దుల వర్షం కురిపించి మిర్రర్ ‌పై వరుణ్ ఘోస్ట్ అని రాసింది. దీంతో వితికా మనిషిగా మారి.. వరుణ్ దెయ్యంగా మారాడు. ఇక శ్రీముఖి తలపై హిమజ గుడ్డు పగలగొట్టడంతో హిమజ మనిషిగా మారి శ్రీముఖి దెయ్యం అయ్యింది. ఫైనల్‌గా పునర్నవిని స్విమ్మింగ్ పూల్‌తో తోసేయడంతో రచ్చ రచ్చ అయ్యింది. మొదట పునర్నవిని దెయ్యాలు ఈడ్చికెళ్లి స్విమ్మింగ్ పూల్‌తో పడేశాయి. అప్పటి వరకూ శాంతంగా ఉన్న పునర్నవి ఒక్కసారిగా ఎమోషన్ అయ్యింది. చాలా సేపు స్విమ్మింగ్ పూల్‌లో ఉండిపోయిన తిరిగి పైకి ఎక్కే సందర్భంగా శిల్పా వచ్చి మళ్లీ స్విమ్మింగ్ పూల్‌లోకి తోసేయడంతో కన్నీళ్లు పెట్టుకుంది. మొదట నాకు స్విమ్మింగ్ అంటే ఇష్టం అని మొదట కన్నీళ్లను ఆపుకుంది పునర్నవి. దెయ్యం అయిన శిల్ప చేతిలో పునర్నవి ప్రాణాలను కోల్పోయిందని.. శిల్ప మనిషిగా, పునర్నవి దెయ్యంగా మారతారని బిగ్ బాస్ అనౌన్స్‌మెంట్ రావడంతో అప్పటి వరకూ శాంతంగా ఉన్న పునర్నవి బ్లాస్ట్ అయ్యింది. శిల్ప తనను దారుణంగా లాగి పడేస్తుంటే రియాక్ట్ కాకుండా ఎలా ఉంటారు. ఇది హారిబుల్ టాస్క్.. ఇష్టం వచ్చినట్టు ఈడ్చేస్తుంటే నాకు ఎక్కడెక్కడ తగిలిందో తెలుసా? వాళ్లు అలా చేస్తున్నా గేమ్ అయ్యే వరకూ నేను రియాక్ట్ కాలేదు ఇప్పుడు రియాక్ట్ అవుతున్నా.. నేను బిగ్ బాస్‌తో మాట్లాడటం కోసం ఎదురుచూస్తున్నా. బిగ్ బాస్ ఇది బుల్ షిట్ టాస్క్. మీ ఆటను మీరే ఆడుకోండి. మాకు చెప్పింది ఏంటి ఇక్కడ చేస్తుంది ఏమిటి? నన్ను రెండు సార్లు తోస్తుంటే ఏం చేస్తున్నారు. నన్ను ఈడ్చుకుంటూ పోతుంటే బాధ ఉండదా? అంటూ బిగ్ బాస్‌ను ఏకిపారేసింది పునర్నవి.

Copy Protected by Chetan's WP-Copyprotect.