బాబాయ్‌ అబ్బాయ్‌ కలిసిపోతున్నారా?

మహానటుడు ఎన్‌టీఆర్‌ పేరు పెట్టుకుని నవరసాలు పండించటంలో వర్తమాన యువనటుల్లో ఎన్‌టీఆర్‌కి సాటిరాగల వారు ఎవరూ లేరు. జూనియర్‌ను ఆల్‌రౌండర్‌ యాక్టర్‌ అని అంటారు. అక్కినేని నాగార్జున కూడా ఒకసారి మీలో ఎవరు కోటీశ్వరుడులో చెప్పాడు. ప్రస్తుత యువ హీరోల్లో తనకు జూనియర్‌ ఎన్‌టీఆర్‌ అంటే ఇష్టమని. పౌరాణిక, జానపద, సాంఘీక చిత్రాల్లో ఏ పాత్రనైనా అవలీలగా పోషించగలడు. తాజాగా లవకుశ చిత్రం ఎన్‌టీఆర్‌ను నటనలో నాలుగు మెట్లు పైకి ఎక్కించింది. అయినా ఇంతకాలం జూనియర్‌ ఎన్‌టీఆర్‌కు ఉత్తమ నటుడిగా ఒక్క నంది పురస్కారం కూడా రాలేదు.

యమదొంగ చిత్రంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ యముడిగా చేసిన అభినయం చూసి ఈసారి ఉత్తమ నటుడిగా నంది పురస్కారం ఖాయం అనుకున్నారు. కానీ ఆనాటి ప్రభుత్వాల్లో రాజకీయాలు నడిచి ఆ అవార్డు రాలేదు. ఇన్నాళ్లకు జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటనకు నంది గుర్తింపు లభించింది. జనం గుర్తింపు ప్రధానం. అదెప్పుడో ఉంది. కాకపోతే నంది పురస్కారం అనేది సినిమా వాళ్లకు ప్రత్యేకం. అదో గౌరవంగా చిన్నాపెద్దా అందరూ భావిస్తారు. అన్ని తరాల వారూ ఆ నంది పురస్కారాలను గౌరవిస్తారు. రావాలని కోరుకుంటారు. ఉత్తమ నటుడిగా ఈసారి జూనియర్‌కి ఈ గుర్తింపు దక్కడానికి బాబాయ్ బాలకృష్ణ కారణం అంటున్నారు. జనవరి 25-31మధ్యలో పవిత్ర సంగమం వద్ద ఈ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం జరగనుంది. బాబాయ్‌-అబ్బాయ్‌ మధ్య ఇకనుంచి సత్సంబంధాలు నెలకొంటాయాని. వచ్చే ఎన్నికలు నాటికి అందరూ ఒక్కటయిపోతారని బలంగా కొన్నాళ్ల నుంచి ప్రచారం సాగుతోంది. దానిని ఇది బలపరిచింది.

Copy Protected by Chetan's WP-Copyprotect.