ఇదే వర్మ “ఎన్టీఆర్ ది లెజెండ్‌” స్టోరీ లైన్

బాలకృష్ణ హీరోగా సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ ఎన్టీఆర్‌ జీవిత చరిత్రను తీస్తున్నట్టు ప‌్రకటించారు. సాధరణ రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి సినీరంగాన్ని ఎలా ఏలారు? అందుకు ఎటువంటి శ్రమ చేస్తారు? పౌరాణిక, జానపద, చారిత్రక చిత్రాల్లో ప్రత్యేక పాత్రల పోషణ వెనుక ఎంతటి సాధన ఉంది అనేవి సినిమా ఫస్టాఫ్‌లో ఉంటాయి.

సెకండాఫ్‌లో ఆరోజు సినిమాటోగ్రఫీ మినిస్టర్‌గా ఉన్న చంద్రబాబునాయుడితో ఎన్‌టీఆర్‌ కుమారుడు, సినిమా డిస్ట్రిబ్యూటర్ జయకృష్ణల పరిచయం, ఎన్‌టీఆర్‌ వద్దకు చంద్రబాబును ఆయన తీసుకువెళ్లడం, రాజకీయాల్లోకి రావాలని చంద్రబాబు ఎన్‌టీఆర్‌ను ఆహ్వానించడం చూపిస్తారట. చాలామందికి ఆ విషయం తెలియదు. ఎన్‌టీఆర్‌ రాజకీయ ప్రవేశానికి కీలక వ్యక్తి చంద్రబాబే అని బయట ప్రపంచానికి పెద్దగా తెలియదు. ఆ నేపథ్యంతో పాటు తన కుమార్తెతో వివాహ ప్రతిపాదనను జయకృష్ణ ద్వారా చంద్రబాబుకు పంపటం వంటి సన్నివేశాలు ఉన్నాయని తెలిసింది.

నాదెండ్ల భాస్కరరావును నమ్మిన ఎన్‌టీఆర్‌కు వెన్నుపోటు ఎలా పొడిచారు, దానిని చంద్రబాబు ఎంత సమర్థంగా ఎదుర్కొన్నారు, ప్రజల్లోకి దానిని తీసుకువెళ్లడం, ఎమ్మెల్యేల క్యాంపు నిర్వహణ, నెలరోజుల ఉద్యమం ప్లానింగ్‌ అవన్నీ బాబు ఎలా ఆర్గనైజ్‌ చేశారో చూపిస్తారట. బాబు సమర్థతపై నమ్మకం పెరిగి ఆ తర్వాత పార్టీలో ఎన్‌టీఆర్‌ పెద్దపీఠ వేసిన ఘట్టాలు ఉంటాయి.

ఆమె ఎన్‌టీఆర్‌కు దగ్గరయి, ఆయనను తప్పుదోవ పట్టించి తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా పురిగొల్పిన ఘట్టాలు, తెలియక ఆయన తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, ఆయన మంచి కోసం, ఆయన స్థాపించిన పార్టీ భవిష్యత్తు కోసం కుటుంబం, పార్టీ ఎలా గట్టిగా నిలబడ్డాయి, ప్రజలు కూడా ఆ పరిణామాలను ఎలా సమర్థించారు అనేది ఎఫెక్టీవ్‌గా పతాక సన్నివేశాలు పేపర్‌పై వర్కవుట్‌ చేస్తున్నారని వర్మ స్కూల్‌ సమాచారం.

Copy Protected by Chetan's WP-Copyprotect.