లైంగిక వేధింపులపై షాకింగ్ కామెంట్స్‌!

‘హిందీలో (ముంబై)లో సీరియళ్లు, పంజాబీలో సినిమాలు చేసినప్పుడు… తెలుగులో ‘ఆర్‌ఎక్స్‌ 100’ విడుదల తర్వాత క్యాస్టింగ్‌ కౌచ్‌ ఎదుర్కొన్నా. అవకాశాల పేరుతో లైంగిక అవసరాలు తీర్చమని ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అడిగేవారు. భవిష్యత్తులోనూ క్యాస్టింగ్‌ కౌచ్‌ ఎదురవుతుందేమో? వాస్తవం ఏంటంటే… ‘మీటూ’ ఉద్యమం జరిగినప్పటికీ, క్యాస్టింగ్‌ కౌచ్‌ నశించలేదు. ఇంకా ఉంది’’ అని పాయల్‌ రాజ్‌పుత్‌ అన్నారు. ‘ఆర్‌ఎక్స్‌ 100’ చిత్రంతో ఒక్కసారిగా ప్రేక్షకులు, పరిశ్రమ ప్రముఖుల దృష్టిని ఆకర్షించిన ఆమె,

ప్రస్తుతం తెలుగులో వెంకటేశ్‌ ‘వెంకీమామ’, రవితేజ ‘డిస్కో రాజా’, తేజాస్‌ ‘ఆర్‌డిఎక్స్‌ లవ్‌’లో కథానాయికగా నటిస్తున్నారు. ఇంకా టైటిల్‌ ఖరారు చేయని ఓ సినిమాలో పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. చేతి నిండా సినిమాలతో తీరిక లేకుండా ఉన్న పాయల్‌ రాజ్‌పుత్‌, ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్యాస్టింగ్‌ కౌచ్‌ గురించి మాట్లాడారు. ‘‘నేను ‘ఆర్‌ఎక్స్‌ 100’లో బోల్డ్‌ సన్నివేశాల్లో నటించడానికి అంగీకరించానని… బయటా అలాగే ఉంటానని అనుకుంటున్నారు. సినిమా అవకాశాల కోసం నిజ జీవితంలో నేను ఏమైనా చేస్తానని అనుకుంటే ఎలా? ప్రజలు అలా ఆలోచించకూడదు. అవకాశాలు ఇస్తే లైంగిక వాంఛలు తీర్చే ధోరణికి నేను వ్యతిరేకం. వాటి కోసం నేను కాంప్రమైజ్‌ కాదలచుకోలేదు. సినిమా రంగంలోనే కాదు, ఇతర రంగాల్లోనూ లైంగిక వేధింపులు ఉన్నాయి. నేనిలా ధైర్యంగా మాట్లాడటం వల్ల కొందరు నాతో పని చేయాలనుకోవడం లేదు. కొందరు ద్వేషిస్తున్నారు కూడా! దీనికి పరిష్కారం ఒక్కటే…

వాళ్లు చేసే పని మానేయాలి. లేదంటే నేను మానేస్తా. నాకు నచ్చిన సినిమాల్లోనే నటిస్తా’’ అని పాయల్‌ రాజ్‌పుత్‌ అన్నారు. ప్రస్తుతం నటిస్తున్న సినిమాల గురించి ఆమె మాట్లాడుతూ ‘‘కోపం వస్తే హిందీ మాట్లాడే అమ్మాయిగా ‘వెంకీమామ’లో వెంకటేశ్‌గారికి జోడీగా నటిస్తున్నా. అందులో నాది టీచర్‌ పాత్ర. ‘డిస్కో రాజా’లో రవితేజ మాజీ ప్రియురాలిగా మూగ, చెవిటి అమ్మాయి పాత్ర పోషిస్తున్నా. ‘ఆర్‌డిఎక్స్‌ లవ్‌’లో గ్రామాన్ని దత్తత తీసుకుని, ప్రజల సమస్యలు పరిష్కరించే యువతిగా కనిపిస్తా’’ అన్నారు. క్యాస్టింగ్ కౌచ్ ఈ మాట విని చాలా రోజులైంది. హాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు ఆ తరువాత ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మీటు ఉద్యమం ఊపందుకున్నాక క్యాస్టింగ్ కౌచ్ అనే మాట వినిపించడం మానేసింది. అంతా ప్రొఫెషనల్ గా పనులు జరిగిపోతున్నాయి. టాలెంట్ ఉన్న వాళ్లకు అవకాశాలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఈ క్రేజీ హీరోయిన్ హఠాత్తుగా క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడే సరికి అంతా షాక్ అయ్యారు.

Copy Protected by Chetan's WP-Copyprotect.