తారక్‌ సాహసోపేత నిర్ణయం?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం`RRR` సినిమా చిత్రీక‌ర‌ణ‌లో బిజీ బిజీగా ఉన్నారు. తార‌క్ ఈ చిత్రంలో తెలంగాణ పోరాట యోధుడు కొమురం భీమ్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఇందులో మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ఆంధ్ర ప్రాంతానికి చెందిన విప్ల‌వ నాయ‌కుడు అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. `బాహుబ‌లి` త‌ర్వాత రాజ‌మౌళి డైరెక్ట్ చేస్తోన్న చిత్ర‌మిది. భారీ అంచ‌నాల న‌డుమ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధిచిన వార్తొక‌టి సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

అదేంటంటే..ఈ సినిమా కోసం తార‌క్ తెలుగుతో పాటు హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో డ‌బ్బింగ్ చెప్ప‌బోతున్నార‌ట‌. నాలుగు భాష‌ల్లో డ‌బ్బింగ్ చెప్ప‌డమంటే మామూలు విష‌యం కాదు.. మ‌రి తార‌క్ ఎలా మేనేజ్ చేస్తారో చూడాలి మ‌రి. మరో పక్క మరో చారిత్రక పాత్రతో చిరంజీవి కూడా జనం ముందుకు రాబోతున్నారు. బాహుబలి హిట్ అనేక చారిత్రక పాత్రలకు ప్రోత్సాహం ఇచ్చింది. అవే సాంకేతిక విలువలు సైరాకు కూడా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. చారిత్రక చిత్రాలకు వీఎఫ్‌ఎక్స్‌ ఎంతో కీలకం. భారీ సెట్టింగులతో కొంతవరకూ ఒకప్పటి వాతావరణాన్ని సృష్టించి, మిగతా పనిని వీఎఫ్‌ఎక్స్‌లో పూర్తి చేస్తున్నారు. ఆ గ్రాఫిక్స్‌ అత్యంత సహజంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ‘సైరా నరసింహారెడ్డి’ బృందం అదే పనిలో ఉందని సమాచారం.

చిరంజీవి కథానాయకుడిగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో శ్రీమతి సురేఖ సమర్పణలో రామ్‌చరణ్‌ నిర్మిస్తున్న ఈ సినిమా నిర్మాణానంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వీఎఫ్‌ఎక్స్‌ అవసరమయ్యే సన్నివేశాలను ఎప్పుడో చిత్రీకరించారు. ఇప్పుడు వీఎఫ్‌ఎక్స్‌ చేశాక… ఆ సన్నివేశాల్లో ఏమాత్రం తప్పులు దొర్లకుండా జాగ్రత్తగా ఒకటికి రెండుసార్లు సరి చూసుకుంటున్నారట! ఇప్పటికే విడుదలైన టీజర్‌కు వస్తోన్న స్పందన పట్ల చిత్రబృందం సంతోషం వ్యక్తం చేస్తోంది. సినిమా కూడా అదే స్థాయిలో గ్రాండ్‌గా ఉంటుందని చెబుతోంది. చిరంజీవి గురువు పాత్రలో అమితాబ్‌ బచ్చన్‌, కథానాయికలుగా నయనతార, తమన్నా, కీలక పాత్రల్లో జగపతిబాబు, సుదీప్‌, విజయ్‌ సేతుపతి, బ్రహ్మాజీ తదితరులు నటిస్తున్న ఈ సినిమా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్‌ 2న విడుదల కానుంది.

Copy Protected by Chetan's WP-Copyprotect.