అ అంటే అవంతి,ఆ అంటే ఆమంచి పీ అంటే పీడా పోయింది! ఇంకా చెత్త వదిలించండి! సత్తా ఉన్న వాళ్లు పార్టీలోకి వచ్చేందుకు సిద్దంగా ఉన్నారు!

అ అంటే అవంతి శ్రీనివాస్, ఆ అంటే ఆమంచి కృష్ణమోహన్. పీ అంటే పీడా పోయింది అంటున్నారు తెలుగుదేశం కార్యకర్తలు. టీడీపీలో ఇలాంటి చెత్త సరుకు పోతే బయటకు పార్టీకి చాలా మందిదని వారు అభిప్రాయ పడుతున్నారు. వాళ్లంతట వాళ్లే పార్టీని వీడినందుకు సంతోషంతో చిందులేస్తూ రోడ్లపై మిఠాయిలు పంచుతున్నారు. ఉదాహరణకు చీరాలలో ఆమంచి పోగానే జనం రోడ్లపై ర్యాలీలు తీశారు సంబరాలతో. తెలుగుదేశం క్యాడర్ మిఠాయిలు పంచారు.

వైసీపీ అసమ్మతి రాజీనామాలు చేశారు. ప్రకాశం జిల్లాలో ముఖ్య నేత అయిన కరణం బలరాంకు సీటు ఎక్కడ ఇవ్వాలా అని తలనొప్పితో ఉన్న చంద్రబాబుకు ఉపశమనం కలిగించాడు ఆమంచి. తను పార్టీ నుంచి పోవటం ద్వారా టీడీపీకి ఎంతో మేలు చేశాడు. అలాగే అవంతి శ్రీనివాస్‌ అనకాపల్లి సీటుకు రాజీనామా చేసి వైసీపీలో చేరుతున్నట్టు తెలియగానే టీడీపీ ఆయన స్థానంలో స్ట్రాంగ్ ఇమేజ్ ఉన్న లీడర్ సబ్బంహరిని రంగంలోకి దించుతోంది. ఇవన్నీ పార్టీకి మంచి కలిగించే పరిణామాలే అని కార్యకర్తలు, విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. చీరాలలో అయితే రోడ్లపై ఆమంచికి వ్యతిరేకంగా జనం సంబరాలు చేశారు. చీరాలలో టీడీపీ శ్రేణులు, పార్టీ అధిష్ఠానం ఆమంచి వ్యవహారంపై తీవ్రంగా స్పందించాయి. ఎమ్మెల్యే ఆమంచి జగన్‌ను కలిశారని తెలియగానే టీడీపీలోని కొందరు రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. టీడీపీ జిందాబాద్‌ అంటూ నినాదాలు చేస్తూ బాణ సంచా కాల్చారు. మరికొందరు సీనియర్‌ నేత కరణం బలరాం రాకను ఆహ్వానిస్తూ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. పార్టీకే అంకితమైన కిందిస్థాయి నాయకులు, శ్రేణులు టీడీపీ వైపే ఉండేందుకు సిద్ధమయ్యారు. అయితే గత మూడున్నరేళ్లలో ఆమంచికి మరింత దగ్గరైన నాయకుల విషయంలోనే స్పష్టత రాలేదు. ద్వితీయ స్థాయి నేతల్లో కొందరు మాకు పార్టీనే ముఖ్యం అంటుండగా మరికొందరు కిమ్మనడం లేదు.

ఒకరిద్దరు మాత్రం మా వెనుక ఎవరు వస్తారన్న విషయం పక్కన పెడితే మేం మాత్రం ఆమంచితోనే పయనిస్తామని చెప్తున్నారు. 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయి గత ఎన్నికల్లో ఆమంచికి మద్దతు ఇచ్చి ప్రస్తుతం ఏఎంసీ చైర్మన్‌గా ఉన్న జంజనం శ్రీనివాసరావు మున్సిపల్‌ చైర్మన్‌ రమేష్‌ తదితర కొందరు ముఖ్యుల పోకడ ఎలా ఉండబోతుందన్న విషయం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఆ స్థాయి, ఆ కింది స్థాయి నాయకుల్లో కూడా కొందరు టీడీపీ వైపు నిలిస్తే, కొందరు ఆమంచితోపాటు వైసీపీలోకి వెళ్లే అవకాశం ఉంది.

Copy Protected by Chetan's WP-Copyprotect.