ఆ ఛానెల్ సర్వేలో టీడీపీదే గెలుపు! సర్వే తర్వాత సంక్షేమ నిధులు ఖాతాల్లో పడటంతో మరో 10 సీట్లు పెరిగాయట!

రాష్ట్రం ఏదైనా…ఎన్నికలు ఎక్కడైనా సర్వేలతో ఫలితాలను ముందుగానే అంచనా వేయటంలో టీవీ5 ఎప్పటికప్పుడు ఖచ్చితత్వాన్ని చాటుకుంటోంది. వాస్తవాలకు ప్రతిరూపమైన టీవీ5 గతంలో కర్నాటక ఎన్నికల్లో 98 శాతం ఖచ్చితమైన ఫలితాలను ముందుగానే అంచనా వేసి చెప్పింది . ఆ తర్వాత జరిగిన తెలంగాణ ఎన్నికల్లోనూ టీవీ5 చెప్పిన సర్వే ఫలితం అక్షర సత్యమైంది. నూటికి నూరు శాతం టీవీ 5 అంచనా నిజమైంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలపైనా సర్వే నిర్వహించింది టీవీ5.

మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ స్థానాల్లో గెలిచేది ఎవరు? ఓడేది ఎవరు? ఏ పార్టీకి జనంలో ఆదరణ ఉంది? గెలుపోటముల వ్యత్యాసం ఎంతమేర ఉండొచ్చనే అంశాలపై శాస్త్రీయంగా, సీక్రెట్ బ్యాలెట్ పద్దతిలో టీవీ5 సర్వే జరిగింది. ఏపీలోని మొత్తం 13 జిల్లాల్లో భారీ ఎత్తున లక్షా ఐదు వేల శాంపిల్స్ సేకరించి ఓటర్ల నాడిపట్టే ప్రయత్నం జరిగింది. మార్చి 15 నుంచి ఏప్రిల్ 3 వరకు జిల్లాల్లో సేకరణ కొనసాగింది. ఓటర్లలో ప్రతీ వర్గాన్ని అంచనా వేశాం. ఇందుకోసం పట్టణ, గ్రామీణ ప్రాంతాల కలయికగా శాంపిల్స్ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాం. అలాగే ఓటర్లలో యువత, వృద్ధులు, మహిళలు ఎటువైపు మొగ్గు చూపుతున్నారో తెలుసుకున్నాం. శాస్త్రీయ పద్దతిలో ఉద్యోగులు, కార్మికులు, రైతులతో పాటు మధ్యతరగతి, దిగువమధ్య తరగతి వర్గాల నుంచి సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో శాంపిల్స్ తీసుకున్నాం. జనరల్ సీట్లతో పాటు రాండమ్‌గా రిజర్వ్‌డ్‌ స్థానాలనూ ఎంపిక చేసుకుని టీవీ5 సర్వే నిర్వహించింది. ఆయా ప్రాంతాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఓటర్ల నుంచి కూడా శాంపిల్స్‌ సేకరించాం.

ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, ప్రతిపక్ష పార్టీలు ఇస్తున్న హామీలు ఏ మేరకు ఓటర్లలోకి వెళ్లాయి.. ఏయే ప్రాంతాల్లో అవి ప్రభావం చూపబోతున్నాయనే అంశాలతో ఫలితాలను నిఖార్సుగా అంచనా వేశాం. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల యుద్ధంలో విజయం ఎవరిది? అమరావతి పాలకులుగా ప్రజలు ఏ పార్టీకి పట్టం గట్టబోతున్నారు? సంక్షేమ పథకాలు టీడీపీని గట్టెక్కిస్తాయా? నవరత్నాలు వైసీపీకి ఓ అవకాశాన్ని కల్పిస్తాయా? జనసేనాని మార్పు సూత్రం సక్సెస్ అవుతుందా? ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారు? ఇలాంటి శాస్త్రీయమైన ప్రశ్నలతో సర్వే నిర్వహించాం. తద్వారా ఓటర్స్ పల్స్ తెలుసుకున్నాం. టీడీపీకీ 105 పైగా సీట్లు రావొచ్చని మా సర్వేలో తేలింది. ఇది మార్చి 15 నుంచి ఏప్రిల్ 3 మధ్య నిర్వహించిన సర్వే. ఈ సర్వే తర్వాత ప్రభుత్వం అన్నదాత సుఖీభవ, రుణమాఫీ, పసుపు- కుంకుమ చివరి విడత చెక్కులు ఇచ్చింది. దీంతో వాటి ప్రభావం ఓటర్లపై ఎలా ఉంటుందనేది అంచనా వేయాల్సి ఉంది. తాజా అంచనాల ప్రకారం వీటి ప్రభావంతో మరో పది సీట్లు టీడీపీకి రాబోతున్నాయట. అంటే 115 పైగా సీట్లు వస్తాయని అంటున్నారు. ఆ మేరకు వైకాపా ఆ పది తగ్గుతాయి.

Copy Protected by Chetan's WP-Copyprotect.