పీకే అంటే ప్రశాంత్ కిషోర్ కాదు! పవన్ కళ్యాన్‌ కూడా కానే కాదు! కానీ ఆ పీకే తమ ఓటమికి కారణం అవుతుందని భయంతో వైకాపా!

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోలింగ్‌ జరిగి ఆరు రోజులు గడుస్తున్నా.. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇంకా జయాపజయాలపై ఓట్ల కూడికలు, తీసివేతల్లోనే మునిగి తేలుతున్నారు. మే 23న ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో ఆయా పార్టీల అభ్యర్థులు, ముఖ్యనేతలు, శ్రేణులు గెలుపు అంచనాల్లోనే నిమగ్నమయ్యా రు. పోలింగ్‌ శాతం పెరిగిన నేపథ్యంలో విజయవకాశాలపై తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తుండగా.. వైసీపీ అభ్యర్థులు, ఆ పార్టీ ముఖ్య నేతల్లో మాత్రం.. పీకే (పసుపు – కుంకుమ, పవన్‌ కల్యాణ్‌) గుబులు పట్టుకుంది.

పోలింగ్‌కు ముందే మహిళాసంఘాలకు ఇచ్చిన మాట మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మూడు దఫాలుగా రూ.10 వేలు అందజేసి మహిళా ఓటర్లలో కృతజ్ఞతాభావం పెంచారనే అభిప్రాయం ఆ వర్గాల నుంచే వ్యక్తమవుతోంది. దీనికి తోడు పోలింగ్‌కు ముందురోజు ఒక్కో మహిళ పసుపు-కుంకుమ ప థకం కింద ఆఖరి చెక్కు రూ.4 వేలు బ్యాంకుల ద్వారా డ్రా చే సుకున్నారు. ఆ మరుసటి రోజే పోలింగ్‌ జరగడం, ఈవీఎంల మొరాయింపుతో ఇంటికి వెళ్లినా.. చంద్రబాబు పిలుపుతో తిరిగి పోలింగ్‌ కేంద్రాలకు చేరుకుని అర్ధరాత్రి వరకు క్యూలైన్లలో నిలబడి ఓటు వేయడం వైసీపీ అభ్యర్థుల్లో ఆందోళన, అనుమానాలు మరింత పెంచుతోందనే చర్చ జరుగుతోంది. అదే జరిగితే.. గెలుపు అసాధ్యమనే అభధ్రతాభావం ఆ పార్టీ అభ్యర్థులను వెంటాడుతోందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఆ పార్టీ ముఖ్య నాయకుల అంతర్గత సమావేశాల్లోనూ ఈ అంశంపైనే తీవ్రంగా చర్చ జరుగుతున్నట్లు ఆ వర్గాల విశ్వసనీయ సమాచారం. జిల్లాలో 32,39,517 మంది ఓటర్లుండగా.. 26,54,257 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరి లో పురుషులు 13,43,176 మంది, మహిళలు 13,11,031 మంది ఉన్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడంలో ఇంచుమించు పురుష ఓటర్లతో మహిళా ఓటర్లు పోటీ పడడం వైసీపీ అభ్యర్థులను మరింత కలవరపరుస్తోంది. 65 శాతం మంది మహిళా ఓటర్లు అటు వైపేనా…? ఉదాహరణఖు అనంతపురం జిల్లాలో 82.22 శాతం పోలింగ్‌ నమోదైంది. పోలైన ఓట్లలో పురుషుల శాతం 82.93 కాగా.. మహిళల శాతం 81.52గా న మోదైంది. పురుషుల ఓట్లను ప్రధానంగా ఇరు పార్టీలూ పంచుకున్నప్పటికీ.. మహిళా ఓటర్ల విషయంలోనే వైసీపీ అభ్యర్థులు సందిగ్ధంలో పడ్డారనే వాదన వినిపిస్తోంది. పుసుపు-కుంకుమ లబ్ధి నేపథ్యంలో కృతజ్ఞత చాటుకుని ఉంటే సుమారు 65 శాతం మంది మహిళలు టీడీపీకే ఓట్లు వేసి ఉంటారనే అనుమానం ఆ పార్టీ అభ్యర్థులను వెంటాడుతోందనే చర్చ జోరుగా సాగుతోంది. ఆ అనుమానమే వైసీపీలో గెలుపుపై సందేహం కలిగిస్తోంది. మరోవైపు జనసేన అభ్యర్థులకు పడిన ఓట్లు వైసీపీ నుంచి చీలినవేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ ప డుతున్నారు.

ఆది నుంచి బాలకృష్ణ అభిమానులు టీడీపీ వైపు.. మెగా అభిమానులు ఆ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారనే అ భిప్రాయం ఉంది. ఈ అంశం వైసీపీ అభ్యర్థులను మరింత ఆం దోళనకు గురి చేస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు. రా జకీయ విశ్లేషకులు, మేధావి వర్గాలు ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తూండడం గమనార్హం. టీడీపీ అభ్యర్థుల్లో ధీమా నింపుతున్న అధినేత మాటలు. పోలింగ్‌ ముగిసిన తరువాత ఇరు పార్టీల అభ్యర్థుల్లో స్తబ్ధత నెలకొంది. ఎవరికి వారు తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేసిన సందర్భాలు దాదాపుగా కనిపించలేదు. రాష్ట్రంలో ఎవరికి అధికారం దక్కనుంది..? ఎవరికి ప్రతిపక్ష హోదా లభించనుంది..? జిల్లాలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనే చర్చ ఇరు పార్టీల్లోను పూర్తిస్థాయిలో జరగలేదు. అభ్యర్థులు ఒక అభిప్రాయానికి రాలేని పరిస్థితికి చేరుకున్నారంటే… గతంలో ఈ తరహాలో పోలింగ్‌ ఎప్పుడూ జరగకపోవడమే ప్రధాన కారణం. ఈ క్రమంలో కర్ణాటక ఎన్నికల ప్రచారంలోనూ, ఢిల్లీ పర్యటనలోనూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తమ పార్టీకి 130 నుంచి 150 వరకు సీట్లు వస్తాయని చెప్పడంతో ఆ పార్టీ అభ్యర్థుల్లో ధీమా పెరిగింది. అధినేత మాటలు వారిలో మరింత ఉత్సాహం నింపాయనడంలో ఎలాంటి సందేహం లేదు. వైసీపీలో మాత్రం ఆ జోష్‌ కనిపించడం లేదు. పెరిగిన మహిళల ఓటింగ్‌ ఆ పార్టీ అభ్యర్థులను ఎన్నికల ఫలితాల వరకు సందిగ్ధంలోకి నెట్టిందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతూండడం గమనార్హం. సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఫలితాల కోసం అటు నాయకులు ఇటు ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఎవరు రాష్ట్రంలో అధికారంలోకి వస్తారు, దేశంలో ఏ కూటమి పగ్గాలు చేపడుతుందన్న అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. ఫలితాలకు ఏకంగా 40 రోజుల సమయం ఉండటంతో ఎక్కడ ఇద్దరు కలిసినా ఎన్నికలకు సంబంధించిన చర్చే ఎక్కువగా కనిపిస్తోంది. ఈ చర్చల్లో ప్రధానంగా ‘పీకే’ ప్రస్తావన రావడం గమనార్హం. అధికారం కోసం పోటీ పడుతున్న మూడు ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ, జనసేనపార్టీలు ఒక్కో పార్టీ ఒక్కో పీకేను నమ్ముకున్నాయని విశే్లషకులు వ్యాఖ్యానిస్తున్నారు. వైసీపీ తరఫున ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్న ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు కృషి చేశారు. ఇక జనసేనపార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు, సినీనటుడు పవన్ కల్యాణ్ (పీకే) శక్తివంచన లేకుండా ప్రయత్నించారు. ఇక అధికార పార్టీ టీడీపీకి పసుపు-కుంకుమ (పీకే) పథకం మరోమారు అధికారంలోకి తీసుకువస్తుందన్న ధీమాతో ఉన్నారు.

Copy Protected by Chetan's WP-Copyprotect.