అక్కడ మైనస్‌ అనుకున్నది ఇప్పుడు టీడీపీకి ప్లస్ అయింది!

తెలుగుదేశం రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో దూసుకు పోతోంది. ఇప్పటికే 11 అసెంబ్లీ స్థానాల్లో గెలుపు గుర్రా లను రంగంలోకి దింపింది. ప్రత్యర్థి పార్టీలకు సరికొత్త సవాల్‌ విసిరింది. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో టీడీ పీ అభ్యర్థులంతా ప్రచారాస్త్రాలను సంధిస్తున్నారు. ఇంటిం టికీ వెళ్లి ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. కేడర్‌ను వెంట పెటు ్టకుని వీధి వీధి తిరుగుతున్నారు. వాస్తవానికి అభ్యర్థుల ఎంపికలో ఈసారి టీడీపీ చురుకైన పాత్ర పోషించింది. గత ఎన్నికలతో పోలిస్తే అన్నింటా స్పష్టత ఇచ్చింది.

పార్టీ ఆవిర్భావం నుంచి సిటింగ్‌లకు ఈ స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వడం దాదాపు ఇదే తొలిసారి. క్షేత్రస్థాయి నుంచి ప్రజా భిప్రాయం, పార్టీ వర్గాలు ఏమనుకుంటున్నాయి, అభ్యర్థి పనితీరు, గుణగణాల ఆధారంగా అభ్యర్థులను ప్రకటించారు. జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాలుండగా, 11 స్థానాల్లో ఇప్పటికే ప్రచారం ఆరంభించారు. విచిత్రం ఏమిటంటే నాలుగు నెలలుగా కొన్ని స్థానాల్లో తమ్ముళ్లు ఇప్పుడు తెలుగు సైనికులుగా మారి పార్టీ అభ్యర్థుల విజయానికి ఏకతాటి మీదకు వచ్చారు. కేవలం వ్యక్తిగత ప్రతిష్టకు పోయిహడావుడి చేసి విపరీత ప్రచారానికి అవకాశం ఇచ్చారు. ప్రజల్లో పలుచనైన విధానంపై అధిష్టానం మొదటి నుంచి కేడర్‌ను హెచ్చరిస్తూనే ఉంది. తాజాగా కొవ్వూరు నియోజకవర్గంలోనూ కేడర్‌ యావత్తు ఒక తాటిమీదకు వచ్చింది. పరస్పర సవాళ్లు విసురుకుని, రెండు వర్గాలుగా చీలిపోయి క్రమశిక్షణ గీత దాటే ప్రయ త్నం జరిగింది. టిక్కెట్ల ఖరారుతో సమసిపోయింది. పాయకరావుపేట సిట్టింగ్‌ ఎమ్మెల్యేకు కొవ్వూరు నుంచి పోటీ చేసే అవకాశం కల్పించారు. దీనిని స్థానిక కేడర్‌ స్వాగతించడమే కాదు.. ఏకంగా గెలిపించి తీరు తామంటూ శపథాలు చేసింది.

‘కొవ్వూరు నుంచి పోటీ చేసే అభ్య ర్థి అనిత నా సొంత చెల్లెలు లాంటివారు. ఆమె గెలవాలి. గెలిపించే బాధ్యత మీదే. జరిగిందేదో జరిగింది. అంతా మరిచిపోండి. సీఎం చంద్రబాబు నాయకత్వాన్ని బలపరిచే కేడర్‌గా అందరం ఐక్యంగా ఉండాలి’ అని పార్టీ కేడర్‌కు మంత్రి జవహర్‌ దిశా నిర్దేశం చేశారు. కొవ్వూరు టిక్కెట్‌ దక్కని మంత్రి జవహర్‌ ఏదైనా సీరియస్‌ నిర్ణయం తీసుకోబోతారా అని ఎదురుచూసిన ప్రత్యర్థి పార్టీలకు నిరాశే మిగిలింది. దీనికి మరింత చెక్‌ పెడుతూ కేడర్‌ యావత్తు ఒక తాటిపైకి వచ్చేలా చేయడంలో జవహర్‌ కీలకపాత్ర పోషించారు. చింతలపూడి నియోజకవర్గం లోనూ టిక్కెట్లు ఆశించిన వారందరి మద్దతు కూడగటు ్టకునేందుకు డాక్టర్‌ రాజారావు రంగంలోకి దిగారు. ‘అంద రం కలిసి మెలిసి పని చేద్దాం. నా సహకారం ఉంటుంది. మీ వంతు సాయం అందించండి’ అంటూ నేతలను అభ్య ర్థించి వారి కోపతా పాలు కరిగిపోయేలా డాక్టర్‌ రాజా రావు ప్రయత్నిస్తున్నారు. నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీ ప్రచార వ్యూహాన్ని ఖరారు చేశారు. మిగతా కేడర్‌ను కలుపుకోవాలని నిర్ణయించారు. మాజీ మంత్రి పీతల సుజాత ఇదే కోణంలో కేడర్‌ను సమాయత్తం చేస్తున్నారు. గోపాలపురంలో ఒకింత రెచ్చి పోయిన వారు ఇప్పుడు సిటింగ్‌ ఎమ్మెల్యే ముప్పిడి వెంక టేశ్వరరావుకు మద్ధతుగా నిలుస్తున్నారు. పరిస్థితులను బేరీజు వేసుకుని, గ్రామగ్రా మాన మరింత బలం పుంజు కునేలా పార్టీ సీనియర్లు జాగ్రత్త పడుతున్నారు.

Copy Protected by Chetan's WP-Copyprotect.