ఆమంచిని ఎందుకు తీసుకున్నాను రా దేవుడా అని ఏడుస్తున్న జగన్! ఎందుకో ఇది చదవండి!

ఎమ్మెల్యే ఆమంచి జగన్‌ను కలిసిన విషయాన్ని తెలుసుకున్న వైసీపీ శ్రేణుల్లోని ముఖ్యులు ఆయన రాకను వ్యతిరేకిస్తూ నియోజకవర్గంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఆమంచి వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటికీ నియోజకవర్గ సమన్వయకర్త యడం బాలాజీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పార్టీలోని ఆయన అనుచరగణం ఆమంచికి వ్యతిరేకంగా బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆ పార్టీకి చెందిన మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ సురేష్‌ పార్టీకి, పదవికి రాజీనామా చేశారు.

ఇంకోవైపు ఆ పార్టీలోని కొందరు ఆమంచి రాకను స్వాగతిస్తూ కూడా కార్యక్రమాలు చేపట్టారు. ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే అధిష్ఠానం జోక్యం కానీ, ఆమంచి రంగంలోకి వచ్చి సరిచేసుకోవడం ద్వారా కానీ చేస్తే వైసీపీ శ్రేణుల్లో ఎక్కువ మంది ఆయనతో ఉండే అవకాశం ఉంది. అయితే ఆయా స్థాయిల్లో నాయకత్వ శ్రేణుల్లో ఉన్న చాలా మంది ఆమంచికి దూరంగా ఉండే అవకాశం కన్పిస్తోంది. ముఖ్యంగా బలహీనవర్గాలకు చెందిన వైసీపీ శ్రేణుల్లో కొందరు వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇదే జిల్లాలో దగ్గుపాటిని తీసుకున్నందుకు తలబొప్పి కట్టింది అని వైసీపీ జిల్లా నేతలు వాపోతున్నారు. వైసీపీలో దగ్గుబాటి కుటుంబం చిచ్చు పెడుతోంది. దగ్గబాటి వైసీపీలో చేరడం ఆ పార్టీ నేతల్లో తీవ్ర అసంతృప్తి రగిలిస్తోంది. అంతే కాదు దగ్గుబాటి కుటుంబానికి వ్యతిరేకంగా పర్చూరు వైసీపీ నేతలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. దగ్గుబాటి చేరికకు వ్యతిరేకంగా పర్చూరులో వైసీపీ కార్యకర్తలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి వైసీపీ మండల కన్వీనర్లు, నేతలు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుమారుడు హితేష్‌ చెంచురాంకు పర్చూరు టికెట్ ఇవ్వడం తగదని నేతలు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. పార్టీని నమ్ముకున్నవారికి అన్యాయం చేస్తే సహించబోమని వైసీపీ నేతలు అల్టీమేటం జారీ చేశారు. అధికారంలోకి వచ్చే పార్టీలో చేరడం దగ్గుబాటి వెంకటేశ్వరరావు నైజమని దుయ్యబట్టారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టించే తత్వం దగ్గుబాటిదని వైసీపీ నేతలు ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లోని లోటస్‌ పాండ్‌లో వైసీపీ అధినేత జగన్‌ను దగ్గుబాటి ఆదివారం కలిసిన విషయం తెలిసిందే.

తొలుత తన కుమారుడు హితేష్‌ను ఆయనకు పరిచయం చేశారు. అనంతరం గతంలో తాను రాసిన మూడు పుస్తకాలను దగ్గుబాటి జగన్‌కి అందజేశారు. పర్చూరు అసెంబ్లీ స్థానం నుంచి హితేష్‌ను రంగంలోకి దించుతానని ఆయన మరోసారి చెప్పగా అందుకు జగన్‌ అంగీకారం తెలిపినట్లు తెలిసింది. అయితే లోకల్ పార్టీ మాత్రం దగ్గుపాటిపై పరుచూరు తిరుగుబాటు బావుటా ఎగరేసింది. నీవు కాలు పెడితే పరుచూరులో ఓడగొడతాము అని వార్నింగ్ ఇచ్చింది. వైసీపీలో వలస జీవులను రానివ్వం అని నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు ఏ మండలానికి ఆ మండలంలో అసమ్మతి సమావేశాలు పెట్టి హెచ్చరించారు. బీజేపీతో సంబంధాలు ఉన్న ఆ కుటుంబం వస్తే పార్టీకి పుట్టగతులు ఉండవని తీర్మానాలు చేశారు.

Copy Protected by Chetan's WP-Copyprotect.