అమరావతి పరిధిలో 33 సీట్లు! టీడీపీకి జనం ఇచ్చింది 4 సీట్లే! అయినా బాబు అమరావతి కోసం పోరాడతానని అంటున్నారు!

అమరావతి పరిధిలో 33 అసెంబ్లీ సీట్లు ఉండగా టీడీపీకి జనం ఇచ్చింది కేవలం 4 సీట్లే. అయినా కూడా మనసులో ఏమీ పెట్టుకోకుండా చంద్రబాబు అమరావతి కోసం పోరాడతానని అంటున్నారు! ప్రపంచంలో ఐదు అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా అమరావతిని నిర్మిద్దాం అనుకుంటే.. పనులు నిలిపేసి తాను పడ్డకష్టమంతా బూడిదలో పోసిన పన్నీరు చేశారన్నారు మాజీ సీఎం చంద్రబాబు. “ఏ ముఖ్యమంత్రి అయినా తన రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకుంటాడు. కానీ ఇక్కడ అంతా రివర్స్‌లో ఉంది.హైదరాబాద్‌లో ఈ మధ్య భూముల విలువ 35 శాతం వరకు పెరిగింది. మనకు రాజధాని ఉంటే దాని నుంచి ఆదాయం వస్తుంది. ఉపాధి అవకాశాలు కల్పించుకోవచ్చు. డబ్బు ఖర్చు అవుతుందనే నెపంతో ఇప్పుడు రాజధానిని మార్చడం సరికాదు” అని చంద్రబాబు అన్నారు.

బందరు పోర్టుపై ఓ రైతు అడిగిన ప్రశ్నకు సమాధానిమిస్తూ.. బందరు పోర్టు తెచ్చింది నేను కాదు. వాళ్ల నాన్న వైఎస్‌ఆరే. నేను వచ్చాక దానికున్న అడ్డంకులన్నీ తొలగించి ఓ రూపు తీసుకొచ్చాను. కానీ ఇప్పుడు దాన్ని అడ్డుకుంటున్నారు. మౌలిక సదుపాయాల కోసం పోను..ఇంకా 8 వేల ఎకరాలు మిగులుతాయని అన్నారు. ఈ 8 వేల ఎకరాలు అమ్ముకున్నా..ఖర్చు లేకుండా రాజధాని నిర్మాణం పూర్తి చేయవచ్చని..నిర్మాణాన్ని వదిలేసి దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు బాబు. అమరావతి కోసం ఎంతకైనా పోరాడుతానని..స్పష్టం చేశారు.మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో రాజధాని అమరావతి అంత సేఫ్ ప్లేస్ కాదని మంత్రి బోత్స వెల్లడించారు. తాజాగా మంత్రి బోత్స చేసిన కామెంట్స్‌తో రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయి. అమరావతిలో పలు అక్రమాలు, అవకతవకలు చోటు చేసుకున్నాయని విపక్షంలో ఉన్నప్పటి నుంచీ వైసీపీ ఆరోపిస్తోంది. తాము అధికారంలోకి వస్తే రాజధాని వ్యవహారాలపై సమగ్ర విచారణ చేయిస్తామని కూడా జగన్‌ ప్రకటించారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 1వ తేదీ నాటికి అసలు పనులు మొదలే కాని, ఒకవేళ మొదలైనా 25 శాతం కంటే తక్కువ మాత్రమే జరిగిన రాజధానిలోని ప్రాజెక్టులన్నింటినీ ఆపేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఫలితంగా అమరావతిలోని ప్రాజెక్టుల్లో 80 శాతానికిపైగా అర్ధంతరంగా నిలిచిపోయాయి. పైగా… రాజధానికి ఇవ్వాల్సిన రూ.వెయ్యి కోట్లు ఇప్పుడు అక్కర్లేదని, విచారణ పూర్తయ్యాక శాస్త్రీయంగా ఎంత అడగాలో అంతే అడుగుతామని ఇటీవల ప్రధానికి ఇచ్చిన వినతిపత్రంలో ప్రభుత్వం స్పష్టం చేసింది.ఈలోపే అమరావతి ప్రాజెక్టు నుంచి ప్రపంచబ్యాంకు తప్పుకుంది. ఏఐఐబీ కూడా తన రుణ ప్రతిపాదనను ఉపసంహరించుకుంది.

రాజధానికి భూములిచ్చిన రైతులకు వార్షిక కౌలును గడువు దాటి రెండు నెలలు దాటినా చెల్లించకపోవడం, ఇతర శాఖల నుంచి వచ్చిన అధికారులకు ఇస్తున్న 30 శాతం స్పెషల్‌ అలవెన్స్‌ రద్దు, అమరావతి నిర్మాణంలో పని చేస్తున్న పలు కన్సల్టెంట్‌ సంస్థలకు మంగళం, పెద్దసంఖ్యలో అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ఉద్వాసన, సీఆర్డీయే-ఏడీసీ కార్యాలయాల కుదింపు…వంటి చర్యలతో అమరావతిపై జగన్‌ సర్కారు వైఖరి భిన్నంగా ఉన్నట్లు స్పష్టమైంది. అమరావతిలో ప్లాట్ల ధరలు సుమారు 40 శాతం వరకూ పడిపోయాయి. మదుపుదారులు, రియల్టర్లు అటువైపు చూడడమే మానేశారు. ఇదే సమయంలో… అమరావతి భవిష్యత్తుపై మరిన్ని అనుమానాలు నెలకొనేలా బొత్స ప్రకటన వెలువడటం గమనార్హం.

Copy Protected by Chetan's WP-Copyprotect.