అమరావతిని ఆదుకోండి! నేడు ఏపీకి రాబోతున్న 15వ ఆర్థికసంఘం!

‘ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణానికి కనీసం 1.09 లక్షల కోట్లు ఖర్చు కానున్నాయి. ఈ మొత్లంలో కనీసం 37వేల కోట్లయినా ఇవ్వండి’ అని 15వ ఆర్థిక సంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరనుంది. రాష్ట్ర అవసరాలను తెలుసుకునేందుకు 15వ ఆర్ధిక సంఘ బృందం మరోసారి అమరావతికి రానుంది. సంఘం సభ్య కార్యదర్శి అనిల్‌ ఝాతో పాటు మరికొందరు సభ్యులు సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వి సుబ్రహ్మణ్యంతో పాటు మరికొందరితో సమావేశం కానున్నారు.

ఈ భేటీకోసం ఆర్థికశాఖ రూపొందించిన వినతిపత్రంలో రాజధానిలో ఏ నిర్మాణానికి ఎంత ఖర్చవుతుందన్న విషయాన్ని వివరంగా పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు 11,260 కోట్లు, సామాజిక మౌళిక నిర్మాణాలకు 7,300 కోట్లు, తొలి దశ ట్రంక్‌ నిర్మాణాలకు 70,700 కోట్లు, రెరడో దశ నిర్మాణాలు, భూ సమీకరణకు 19,800 కోట్ల రూపాయలు అవసరమవు తాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం 2,500 కోట్ల రూపాయలు చెల్లించడానికి గతంలో ఒప్పుకుందని. అయితే ఇప్పటి వరకు 1,500 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయని పేర్కొన్న అధికారులు కనీసం 15వ ఆర్థికసంఘం అమరావతి నగర నిర్మాణానికి కనీసం 37 వేల కోట్ల రూపాయలు కేటాయించాలని ప్రతిపాదించారు. అదేవిధంగా ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో సమానస్థాయిలో నిలిచేందుకు ప్రత్యేకహోదా ప్రకటించాలని కోరనున్నారు. ’14వ ఫైనాన్స్‌ కమిషన్‌ నివేదికను సాకుగాచూపిస్తూ రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేకహోదా ఇవ్వలేదు. అదే సమయంలో కొన్ని ఈశాన్య రాష్ట్రాలకు హోదాను కొనసాగిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని 15వ ఆర్థికసంఘం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదాను సిఫార్సు చేయాలి.’

అని విజ్ఞాపన పత్రంలో పేర్కొన్నట్లు సమాచారం, ఇదేసమయంలో ఏడు వెనుక బడిన జిల్లాలకు 22,250 కోట్లు, ఓడరేవులు, విమానాశ్రయాలకు రహదారి అనుసంధానం కోసం పది వేల కోట్లు అవసరమని చెప్పనున్నారు. ఇతర అవసరాలకు మరో ఐదు వేల కోట్లు కావాలని అడగనున్నారు. మొత్తం ఏడు అరశాలపై తాము ఆర్ధిక సంఘం ప్రతినిధికి నివేదిక ఇవ్వనున్నట్లు సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. రాష్ట్రానికి ప్రత్యేక హౌదా ఇవ్వాలన్నది తొలి డిమాండ్‌ కాగా, ఆదాయ లోటును మరికొరతకాలం కొనసాగిరచాలని, ప్రకృతి వైపరీత్యాల సాయం పెరచాలని, స్థానిక సంస్థలకు నిధులు ఎక్కువ ఇవ్వాలని, రాజధాని, వెనుకబడిన జిల్లాలకు విరివిగా నిధులు సమకూర్చాలని కోరనున్నారు. అలాగే జిఎస్‌టికి సంబంధిరచిన అరశాలు, ప్రగతి ఆధారిత ప్రోత్సాహకాలపైనా ఆర్ధికసంఘానికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయించారు.నిధుల పంపకాల్లో 1971 సంవత్సర జనాభా గణారకాలను ఆధారంగా తీసుకోవాలని విజ్ఞప్తి చేయనున్నారు. ఆదాయ లోటుగా ఐదేళ్లలో నాలుగున్నర లక్షల కోట్లను కేటాయిరచాలని ఆర్ధిక సంఘాన్ని కోరనున్నట్లు తెలిసిరది. స్థానిక సంస్థలకు ఇచ్చే నిధులను తలసరి వెయ్యి రూపాయలను చెల్లించాలని కోరనున్నారు.

Copy Protected by Chetan's WP-Copyprotect.