ఆపిల్‌ కంపెనీలో పనిచేసే తెలుగువాడు ఏపీకి వచ్చి ఏం పోస్టు పెట్టాడో చూడండి!

ఆపిల్ కంపెనీ నుంచిలో పని చేసే ఎన్‌ఆర్‌ఐ స్వానుభవం ఇది. నా పేరు మురళీ. మాది విజయవాడ. నేను అమెరికాలోని ఆపిల్ కంపెనీలో పని చేస్తాను. యూఎస్‌ లోనే ఉంటాను, వారం కిందట ఇండియాకి వచ్చాను. పని మీద బెంగుళూరు వచ్చాను. ఆంధ్రని చూడాలని ఎందుకో బాగా కోరిక కలిగింది. అందులోనూ..రాయలసీమలో ప్రయాణించాలని అనిపించింది. బెంగుళూరు నుండి విజయవాడకి ట్రైన్లో స్లీపర్‌ క్లాస్ రిజర్వేషన్‌ తీసుకుని జనం మధ్యలో కూర్చుని జనం మనస్సులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేశాను.

అలా బయలుదేరి వెళ్తున్నాను. ఎందుకంటె అసలైన ఆంధ్రా ప్రజలు ఎలావుంటారు? వాళ్ల కష్టాలు, బాధలు, జీవన శైలి తెలియాలంటే జనరల్ లో వెళ్లాలని అనుకున్నాను. కానీ రష్ ఉండటం తో సెకండ్ క్లాస్ లో వెళ్ళాను. కొంచం సేపటికే నిద్రపట్టింది. రెండు గంటలు బాగా నిద్రపోయాను. ఇంతలో గట్టిగా చాయ్ చాయ్ అంటూ ఉంటే మెలకువ వచ్చింది కిందకు దిగి చాయ్ తాగుతూ కిటికీ పక్కన కూర్చోవాలని అక్కడ కుర్చుని వున్న పెద్దాయన్ని అడిగాను. పెద్దాయన నేను ఇక్కడ కూర్చోవచ్చా అని వినమ్రంగా అడిగాను. రా రా నాయనా.. కూచుంటా కూచో, యా వూరికి పోతావుండవు? విజయవాడ వెళ్ళాలి. ఏడ నుండి వస్తా వున్నావ్? ఏమి పని చేస్తావ్‌? ప్రశ్నలు అడుగుతూ వుంటే చాలా రోజులు తరువాత మన తెలుగు భాషని విన్నకొద్దీ వినాలని అనిపించింది. అబ్బీ ఏమి గమ్మునే వున్నావే? అహా ఏమీ లేదు మీ మాటలు వింటుంటే చాలా రోజుల తరువాత రాయలసీమ యాసను విన్నాను. అందుకు. ఇంతకీ నువ్వు యాడ వుంటావు? అమెరికాలో. ఏమి సేస్తావు? ఆపిల్ కంపెనీలో వర్క్ చేస్తాను అని చెప్పి. కిటికీ పక్కన కూర్చుని ఆలా బయటికి చూస్తూ వున్నాను. కర్ణాటక దాటుకుని ఆంధ్రాలోకి ఎంటర్ అయినాను. అక్కడక్కడా చెరువులో నీళ్లు వున్నాయి. చూసే అంత దూరం పచ్చగా కనిపిస్తూ వుంది. ఇంతలో హిందూపురం వచ్చింది. మళ్లీ ఒకసారి టీ తాగాను. పక్కనేవున్న పెద్దాయానికి టీ ఇచ్చాను. అయన వద్దు బాబు నువ్వు తాగు. లేదు తీసుకోండి అని బలవంతంగా ఇచ్చాను. ఆలా మా ఇద్దరికి మాటలు కలిసాయి. కొంచం సేపటికే పెనుకొండ దాటి పుట్టపర్తికి ట్రైన్ చాల స్పీడుగా వెళుతోంది. కానీ ఎక్కడ చూసినా పచ్చగా వుంది. చిన్న చిన్న కాల్వలలో కూడా నీళ్లు నిండుగా వున్నాయి. ఇంక ఆశ్చర్యం ఆపుకోలేక పోయాను. అయ్యా.. ఇక్కడ బాగా వర్షాలు పడినట్లు వున్నాయి? లేదు అబ్బి..! మరి ఈ నీళ్లు ఎక్కడివి, పొలాలు ఇంతా పచ్చగా వున్నాయి? హోహో అదా..!

ఈ నీళ్లు మొన్న ఈ మధ్యనే యాదేదో నదిలోనుంచి నీళ్లు ఇక్కడకి తెచ్చి పోస్తావుంటారంటాగా…అందుకే మా అనంతపురం అంత నీళ్లు వచ్చినాయని మా కూతురు ఫోన్ చేసి చెప్పింది. అందుకే నేను ఇంటికి పోతా వున్నా. అవునా? మరి ఇన్ని దినాలు బెంగళూరులో ఏమి చేస్తున్నావు? నేను ఏమి చేయను అబ్బి…నా కొడుకు యాదో కంపెనీలో పని చేస్తా వున్నాడు. నన్ను కూడా ఆడికి రమ్మని చెపితే సంవత్సరం కింద పోయినాను. ఏమి పని చేస్తాడు నీ కొడుకు? తెలీదు నాయనా.. ఏదో చేస్తా వున్నాడు. మరి ఇప్పుడు ఎక్కడకి వెళుతున్నావు? మా చెరువులోకి నీళ్లు వచ్చినయంట అందుకే మళ్లీ ఊరికి పోతావున్నా..! అవునా! ఎన్ని ఎకరాలు వున్నాయి నీకు? రెండు ఎకరాలు వున్నాయి. వానలు లేక, నీళ్లు లేక ఎండి పోయినాయి. ఇప్పుడు చెరువులో నీళ్లు వచ్చాయి. నిజంగానే వచ్చాయా అని తెలుసుకోవాలని ఊరికి వెళ్తా వుండాను. అవును నా! ఏమి పంటలు పండుతాయి? నీళ్లు ఉంటే అరటి, సెనగ, బొప్పాయి, చీనా..బాగా పండితే నా కొడుకు కంటే నేనే ఎక్కువ సంపాదిస్తా. వ్యవసాయం లేదు కదా డబ్బు లేదు. వాడి దగ్గర ఉంటే బాగానే చూసుకుంటాడు. కానీ వాడిపెళ్ళాం. మా ఇంట్లో పడి తింటావున్నారు అని సూటి పోటి మాటలు అంటా వుంటుంది. అందుకే మావూరు వెళుతున్నాను. ఇంకా మీదట వాడినే రమ్మని బియ్యం, కూరగాయలు అన్ని ఇచ్చి పంపిస్తా. ఇది అంతా ఎలా పెద్దాయన, ఈ నీళ్లు ఎవరు ఇస్తున్నారు? ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే ఇస్తా ఉన్నాడు. చెరువుకాడికి వచ్చి గంగమ్మ హారతి కూడా ఇచ్చి పోయినాడని మా యమ్మి చెప్పింది ఫోన్‌లో. ఇలా మా మాటలోనే అనంతపురం రావడంతో ఆయన దిగి వెళ్లి పోయినాడు. నేను మొబైల్ లో ఆంధ్ర ప్రదేశ్ గురించి, నదులు అనుసంధానం గురించి చూసి ఆశ్చర్య పోయాను.

నాలుగు సంవత్సరాలలో ఇంత అభివృది జరిగితే ఇంకొక సంవత్సర కాలం. తరువాత కూడా ఈ ప్రభుత్వం వస్తే ఇంకెంత అభివృది జరుగుతుంది అని ఆలోచించుకుంటా నిద్రలోకి జారు కున్నాను. ఇలా స్వదేశానికి, స్వరాష్ట్రానికి వచ్చిన నాకు నా వాళ్లు అందరూ పచ్చగా ఉన్నారు అనే తృప్తితో మరల అమెరికా వెళ్లిపోయాను. అమెరికా వెళ్లిపోయినా నా అనుభవం నా మనసును తొలి చేస్తోంది. నలుగురితో పంచుకోవాలని ఇలా మీ ద్వారా పంచుకుంటున్నాను. మురళీ, ఎన్‌ఆర్‌ఐ. రాజకీయ పార్టీని నడపడం అంటే సొంత వెహికిల్ ను డ్రైవ్ చేసినట్టు కాదు. ఇష్టమొచ్చినట్టు స్టీరింగ్ తిప్పడానికి లేదు. జనాభిప్రాయం అనే పట్టాల మీద రైలును నడపటం. అవును. రైలు జనం అభిప్రాయానికి తగ్గట్టుగానే వెళ్లాలి. అడ్డగోలు టర్నింగులు తిప్పుతానంటే తిరగబడుతుంది యవ్వారం. అందుకే చంద్రబాబు పదే పదే జనం అభిప్రాయం కోరతారు. కాల్ సెంటర్లు పెట్టి ప్రజల మనసులో భారం దింపుకునేలా చేస్తారు. ఇదిగో మురళీ లాగా చాలామంది ఒపీనియన్ అడిగితే ఏపీ అభివృద్ధిని కొనియాడుతూ బదులిస్తున్నారు.

Copy Protected by Chetan's WP-Copyprotect.