బాబే మళ్లీ ఎందుకు రావాలి? ఈ జవాబు ప్రతి గడపకి చేరాలి!

‘‘1996లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేనాటికి హైదరాబాద్‌ అంతగా అభివృద్ధి చెందిన నగరం కాదు. ఇతర ముఖ్యమంత్రుల్లా కాకుండా ఆయన దేశంలోని ఇతర ప్రాంతాలు, విదేశాల నుంచి పెట్టుబడులు ఆకర్షించడంపై దృష్టి సారించారు. హైదరాబాద్‌ను అంతర్జాతీయ ఐటీ హబ్‌గా మార్చేందుకు ఆయన చేసిన కృషి నిరుపమానం!’’ అని – డౌన్‌ టు ఎర్త్‌ (ఆంగ్ల పత్రిక) తన కథనంలో పేర్కొంది. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.

హైటెక్‌ సిటీలు, హైటెక్స్‌, ఎంసీహెచ్‌ఆర్డీల సంగతి పక్కనపెడితే… తొలిరోజుల్లో కనీసం కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ నిర్వహించే స్థాయి ఉన్న సమావేశ మందిరం కూడా అందుబాటులో లేదు. దీనిని ప్రైవేటు ఫంక్షన్‌ హాలులో ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ప్రజా వేదికను నిర్మించారు. అమరావతి నిర్మాణం పూర్తయితే… హైదరాబాద్‌కు దీటుగా, ఇంకా చెప్పాలంటే అంతకుమించిన వసతులు అందుబాటులోకి వస్తాయి. అది జరగాలంటే… మళ్లీ ఇదే ప్రభుత్వం రావాలన్నది అభివృద్ధి వాదుల ఆకాంక్ష! రాష్ట్ర విభజన సీమాంధ్రను కొట్టిన దెబ్బ అంతా ఇంతా కాదు! తలసరి ఆదాయంలో దక్షిణాది రాష్ట్రాల్లో అట్టడుగున ఉన్నది మనమే! ఈశాన్య, కొండ రాష్ట్రాలను మినహాయిస్తే… 2019 ఆర్థిక సంవత్సరం కూడా రెవెన్యూ లోటు కొనసాగే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ ఒక్కటే. దీనికి కారణం… రాష్ట్ర ఆదాయాన్ని, అభివృద్ధిని పెంచే వనరులు లేకపోవడమే. అయినా… కుంగిపోలేదు, బెంగపడలేదు! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ‘విజన్‌ 2020’ పేరిట అడుగులు వేసిన చంద్రబాబు… నవ్యాంధ్ర అభివృద్ధికి 30 ఏళ్ల లక్ష్యాన్ని ఏర్పరుచుకున్నారు. ‘‘2022 నాటికి దేశంలోని మూడు అత్యుత్తమ రాష్ట్రాల్లో ఒకటిగా నవ్యాంధ్ర నిలవాలి!

2029 నాటికి దేశంలోనే అగ్రస్థానంలో నిలవాలి. 2050 నాటికి ప్రపంచస్థాయిలో పెట్టుబడులకు ఉత్తమ గమ్యస్థానంలా నిలవాలి’’ అని లక్ష్యంగా పెట్టుకున్నారు. అమరావతి నిర్మాణం, పోలవరం, పరిశ్రమలు, పెట్టుబడుల ఆకర్షణ… ఇవన్నీ ఆ దిశగానే సాగుతున్నాయి. మద్రాసు నుంచి విడిపడినప్పుడు, సొంత రాష్ట్రాన్ని సాధించుకుని కూడా తప్పటడుగులు వేసినప్పుడు, ఉమ్మడిగా నిర్మించుకున్న సౌ‘భాగ్య’నగరాన్ని కోల్పోయి నడిరోడ్డున నిలబడినప్పుడు… ప్రతిసారీ ఇదే ఘోష! గతం గతః ఇప్పుడు సీమాంధ్రకు కావాల్సింది సరికొత్త భవిష్యత్తు! రాష్ట్రాన్ని సరైన దారిలో నడిపించగల విజన్‌! ఢిల్లీ స్థాయిలో తొక్కితే ప్రపంచ స్థాయిలో లేచి నిలబడ్డం ఎక్కడైనా చూశారా ? పైసా కూడా విదల్చం అని సాక్షాత్తూ ప్రధానే ఈసడిస్తే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో నేషనల్ రికార్డ్ సృష్టించే మొనగాడు ఉంటాడని మీకు తెలుసా ? చిన్నా చితక పరిశ్రమ వస్తే చాలని ఎదురు చూస్తున్న విభజిత రాష్ట్రంలో అత్యద్భుత పరిశ్రమలు అనేకం తెచ్చి ఏపీ తలరాతను అమాంతం మారుస్తున్న లీడర్‌ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా ? ఓసారి ఏపీకి రండి. చంద్రబాబు అన్నీ ఒకే చోట చూపిస్తాడు మీకు.

Copy Protected by Chetan's WP-Copyprotect.