బాబు అంబులపొదిలో అస్త్రం ఉత్తరాంధ్ర ఆశాకిరణం

మూడు పదుల కుర్రవాడు. ముచ్చటైన మాటతీరుతో మురిపించు వాడు. ఉత్తరాంధ్రకు ఎర్రన్న అందించి వెళ్లిన ఘటికుడు. ముమ్మూర్తులా తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న వాడు. పేరులో నాయుడు తీరులో నాయకుడు. అతనే వర్తమాన ఉత్తరాంధ్ర రాజకీయాలలో ఉత్త నాయుడుగా కాక ఉత్తమ నాయకుడిగా ప్రజల మన్ననలు పొందుతున్న కింజారపు రామ్మెహన్‌నాయుడు. తొలిసారి పార్లమెంటు గడప తొక్కిన ఈ యువ ఎంపీ ప్రసంగాలకు సీనియర్‌ ఎంపీలు కూడా కరతాళధ్వనులు చేయటం ఇతని ప్రతిభకు తార్కణం.

ఇటీవలే ఐక్యరాజ్యస‌మితి సమావేశాలకు భారత ప్రతినిధి బృందం నుంచి వెళ్లిన రామ్మోహన్‌ నాయుడు ఐ.రా.సలోనూ అద్భుతంగా మాట్లాడారు. తండ్రికి తగిన తనయుడిగా అద్భుత వాగ్దాటితో అంతర్జాతీయ వేదికపైనా అందరి మన్ననలు అందుకున్నారు. సుష్మా స్వరాజ్‌ సహా పలువురు భారత ప్రతినిధులు రామ్మోహన్‌ నాయుడి ప్రసంగాన్ని మెచ్చుకున్నారు. లోక్‌సభలో ప్రసంగాలతో, ప్రవర్తనతో తనకుంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న యువ ఎంపీ కింజారపు రామ్మెహన్‌నాయుడు తెలుగుదేశంలో రోజురోజుకీ బలమైన నాయకుడిగా అవతరిస్తున్నాడు. రామ్మెహన్‌నాయుడి పనితీరును ఏపీ సీఎం చంద్రబాబు నలుగురిలోనూ చాలా సార్లు ప్రశంసించారు. ప్రజల నేతగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని ప్రశంసించారు. వివాదాలకు తావులేకుండా చిన్న వయసులోనే పెద్ద బాధ్యతలు మోస్తున్నారని అన్నారు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్న రామ్మోహనుడిని ఓడించటం మాట అటుంచి కాస్త పోటీ ఇవ్వగలిగే నేత అయినా దొరికితే చాలని వైసీపీ సీరియస్‌గా ప్రయత్నాలు చేస్తోంది. పార్లమెంటులో కూడా అతన్ని తట్టుకోవటం వైసీపీ ఎంపీల తరం కావట్లేదు.

తెలుగు ఎంపీలు అనగానే ఇతర రాష్ట్రాల వాళ్లు రామ్మోహన్‌నాయుడి ప్రస్తావన తెస్తున్నారని వైసీపీ ఎంపీలు కూడా జెలసీ ఫీలవుతున్నారు. లోక్ సభలో రామ్మోహన్ ప్రసంగాలు, ప్రశ్నలు మిగిలిన సభ్యుల ప్రశంసలు చూరగొంటున్నాయి. అందుకే ఆయన్ని ఉత్తరాంధ్రలో తిరుగులేని అస్త్రంగా వాడుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. లోకేష్ టీం లో కూడా రామ్మోహన్ కి ప్రత్యేక గుర్తింపు వుంది . అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టటంలో ఈ యంగ్ ఎంపీ దూసుకుపోతున్నారు. శ్రీకాకుళం ఎంపీ నియోజకవర్గం పరిధిలో నాలుగు చోట్ల రైల్వే ఓవర్ బ్రిడ్జిలు ఒక్కరోజులోనే నిర్మించి జిల్లా ప్రజలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. వంశధార ప్రాజెక్టు ద్వారా 2018 జనవరి నాటికి మరో 50వేల ఎకరాలకు పైగా కొత్త ఆయకట్టుకు నీరివ్వబోతున్నారు. వంశధార-నాగావళి అనుసంధానం చేసి ఇచ్ఛాపురం వరకు రాష్ట్ర సరిహద్దుల వరకు నీళ్లు తీసుకువెళ్లాలని రామ్మోహన్‌నాయుడు ఆలోచన. మొత్తంగా రాజకీయంగా ఇప్పుడు జిల్లాలో తెలుగుదేశంకు తిరుగులేదనేది వాస్తవం. అందుకు కారణం తెలుగుదేశం పార్టీకి రామ్మెహన్‌నాయుడి పెద్ద అసెట్‌ అని అందరూ భావిస్తున్నారు. తండ్రి పేరుని నిలబెట్టేలా ఇప్పటిలాగే కష్టపడి పనిచేస్తే ఉజ్వల భవిష్యత్తు అతనికి ఉంటుంది అనటంలో సందేహం లేదు.

Copy Protected by Chetan's WP-Copyprotect.