హైదరాబాద్‌కి మెట్రో తేవటం చంద్రబాబు తెలంగాణకి చేసిన ద్రోహమా?

వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పడు ఎన్‌డీఏలో భాగస్వామిగ తెలుగుదేశం పార్టీ. పార్లమెంటులో అత్యధిక సీట్లు ఉన్న మూడో పార్టీ. చంద్రబాబు ముఖ్యమంత్రిగా హైదరాబాదులో సాఫ్ట్‌వేర్‌ రంగాన్ని విశ్వవ్యాప్తం చేశారు. చంద్రబాబు హైటెక్‌సిటీ నిర్మించటం, బిల్‌క్లింటన్‌ వంటి ప్రముఖులు హైదరాబాద్‌ రావటం, ఐటీ కంపెనీలు తరలిరావటంతో హైదరాబాద్‌ను మెట్రో నగరంగా తీర్చిదిద్దాలి అని చంద్రబాబు భావించారు. చంద్రబాబు కొందరిలాగా మరుగుజ్జు మనిషి కాదు. ముందుచూపు ఉన్న విజనరీ లీడర్‌. రాబోయే 20 ఏళ్లలో నగర ట్రాఫిక్‌ ఎలా ఉండబోతోంది అనేది అంచనా వేసి విజన్‌ 2020 డాక్యుమెంటు రూపొందించారు.

అందులో ప్రజారవాణ అనే ఛాప్టర్‌ కింద హైదరాబాద్ రద్దీని తట్టుకోవటం కోసం నగరంలో ఫ్లయిఓవర్ల నిర్మాణం అవసరం అని పలు ప్రాంతాల్లో సిటీలో ఫ్లయి ఓవర్లు నిర్మించారు. రోడ్లు విస్తరించారు. ఫ్లైఓవర్లు నిర్మించాలంటే అక్కడ రోడ్లు వెడల్పు చేయాలి. అలాగే సిటీ రోడ్స్ ట్రాఫిక్‌ను తట్టుకునేలా రహదారులు విస్తరించాలి అంటే ఆరోజు ప్రతిపక్ష కాంగ్రెస్‌ నేత పీజేఆర్‌, బలహీనంగా ఉన్న కమ్యునిస్టులు కలిసి నానా రచ్చ చేశారు. రోడ్లు వెడల్పు చేస్తే వ్యాపారులు దెబ్బతింటారు అని కోర్టుకు కూడా వెళ్లారు. ఫ్లో ఓవర్లు కడితే ప్రజాధనం గోడకి వేసిన సున్నం లాంటిదే అని ధర్నాలు చేశారు. అలా చేయకుండా ఉండి ఉంటే ఈరోజు హైదరాబాద్‌ను ఊహించగలమా? అందులో భాగంగానే హైదరాబాద్‌ నగరానికి 2020 నాటికి నగర జనాభా కొటి దాటిపోతుందని అంచనా వేసి వెంటనే మెట్రోరైలు కూడా ఈ నగరానికి అవసరం. ఎప్పుడైతే ప్రజారవాణ బాగుంటుందో, అప్పుడు మానవ వనరులు, మొబిలిటీ బాగుంటాయి. పరిశ్రమలు పెట్టడానికి ఇన్వెస్టర్లు ముందుకు వస్తారని సీఎం చంద్రబాబు తలిచారు. ఐటీ రంగం హైదరాబాద్‌ కేంద్రంగా వర్థిల్లుతున్న రోజుల్లో పరిశ్రమ పెరుగుతున్న నేపథ్యంలో టెక్కీలు వేగంగా తమ కార్యాలయాలకు నగరంలోని ఏ వైపు నుంచైనా చేరుకోవడానికి వీలవుతుందని భావించారు. ఆలోచన వచ్చిందే తడవుగా అసలు టోటల్‌ హైదరాబాద్‌ ట్రాఫిక్‌, వాహనాల సంఖ్య 2003లో ఎంత ఉంది. 2005 కి ఎంత పెరిగే అవకాశం ఉంది? 2010 కి ఎంత పెరుగుతుంది 2015కి, 2020 నాటికి ఎంతలా ట్రాఫిక్‌ పెరుగుతుంది? పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టు ఉండటం వలన వ్యక్తిగత వాహనాల రద్దీని రోడ్లపై ఎలా నివారించవచ్చు అనే అంశాలతో ఒక ప్రజెంటేషన్‌ తయారు చేసి ప్రధాని వాజ్‌పేయిని కలిసారు. వాజ్‌పేయి చంద్రబాబు ప్రతిపాదనకు అంగీకరించారు. నేను కూడా ఒక మాట చెబుతాను వెళ్లి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అనంత్‌కుమార్‌ను కలవాల్సింది సూచించారు. బాబు వెళ్లి అనంతకుమార్‌ను కలిసి మాట్లాడి ఒప్పించారు చంద్రబాబు. 2003 అక్టోబర్‌లో హైదరాబాద్‌లో మెట్రోకి కేంద్రం అంగీకరించింది. డీపీఆర్‌ (డిటెయిల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు) తయారు చేయాల్సిందిగా చంద్రబాబు ప్రభుత్వాన్ని కోరింది.

ఏపీకి ఇచ్చాకా గుజరాత్‌ ప్రభుత్వం కూడా అడిగింది. అహ్మదాబాద్‌కి కూడా మెట్రో కావాలి అని. ఏపీకి శాంక్షన్‌ చేశాకా గుజరాత్‌కి కూడా ఇచ్చారు. బెంగుళూరు, గుజరాత్‌కి మనతోపాటే మెట్రో వచ్చినా అవి రెండూ పట్టాలు ఎక్కాయి కానీ హైదరాబాద్‌ ఇంతకాలం జాప్యం జరిగింది. అదే చంద్రబాబు సీఎంగా ఉంటే మెట్రో అనేక సంవత్సరాల క్రితమే పట్టాలు ఎక్కేది. కాబట్టి ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా బాబు విజనరీ లీడర్. అందులో డవుటే లేదు. మెట్రో రైలును ప్రధానమంత్రి మోడీ ప్రారంభించారు. మెట్రో రైలు హైదరాబాద్‌లో నడిపితే నడిరోడ్డుపై రక్తం ఏరులై పారుతుంది, ముఖ్యమంత్రి, మంత్రులు నగరంలో గజం కూడా కదలనివ్వం అని ఆనాడు హెచ్చరించిన కేసీఆర్‌ ఓ పక్కన, ఆయన తనయుడు మరో పక్కన కూర్చుని మెట్రోని ప్రారంభించారు. అసలు ఈ మెట్రో కావాలి అని అడిగిన వాళ్లు, అనుమతి తెచ్చిన వాళ్లు ఎవరు దాని వెనుక ఎలాంటి కృషి జరిగిందో ఇప్పుడైనా తెలుసుకోండి. ఇప్పుడు ఇదే చంద్రబాబు ఏపీలో ఏబీసీడీ నుంచి అభివృద్ధి మరల ప్రారంభించారు. ఆంధ్రా నగరాలకు మెట్రో తేవటంపై దృష్టి సారించారు. ప్రపంచ వ్యాప్తంగా నగరీకరణ పెరిగిపోతోంది. నగరాలకు వలసలు విపరీతంగా పెరిగాయి. నగరాలపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ ఒత్తిడి రవాణా వంటి ప్రధాన రంగాలపై తీవ్రంగా ఉంటోంది. అందుకే చంద్రబాబు 2014లోనే 2040 వరకూ ఆలోచిస్తున్నారు. ప్రత్యేకించి రాజధాని నగరం విజయవాడ, ప్యూచర్ సిటీ విశాఖ లపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. మౌలిక సదుపాయల కల్పనపై దృష్టి సారించారు. దాని ఫలితమే ఈ విశాఖమెట్రో, విజయవాడ మెట్రో ప్రాజెక్టుల ఆలోచనలు. విశాఖ మెట్రో కోసం టెండర్లు కూడా పిలిచారు. మొన్న బిడ్ల గడువు కూడా ముగిసింది. అలాగే విజయవాడ కూడా మెట్రో దిశగా అడుగులు వేస్తోంది. విజయవాడలో లైట్ మెట్రోకు ప్రాజెక్టు సవివర నివేదిక తయారు చేసేందుకు శిష్ట్రా కంపెనీ ఎంపికైంది. కేంద్రం నిధులతో సబంధం లేకున్నా వీటిని సకాలంలో పూర్తి చేయాలని చంద్రబాబు పట్టుదలగా ఉన్నారు.

Copy Protected by Chetan's WP-Copyprotect.