బలరాం అంటే…ఓ భరోసా…ఓ నమ్మకం….ఓ ధైర్యం… చీరాల తీర్పు మారుతోందా…!

2014 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా గెలిచి ఆ తర్వాత టీడీపీలో చేరి…ఐదేళ్లు అధికారాన్ని పూర్తిగా అనుభవించి…తన స్వార్ధం కోసం మళ్ళీ వైసీపీలో చేరారు చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్…ఇక చేరడమే వైసీపీ టికెట్ ఫిక్స్ చేయించుకుని…మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. ఇంత జరుగుతుంటే టీడీపీ ఊరుకునే ఉంటుందా….ఆమంచి అటు వెళ్లింది తరువాయి అధినేత చంద్రబాబు….రాజకీయాల్లో తలపండిన సీనియర్ నేత…ప్రకాశం రాజకీయాల్లో పెద్దన్న పాత్ర పోషిస్తున్న కరణం బలరాంని చీరాలకి పంపించారు. ఎమ్మెల్యే వెళ్లడమే బలరాం అక్కడ ల్యాండ్ అయ్యి పరిస్తితులు చక్కబెట్టేశారు. ఇక ఎన్నికల బరిలో కూడా బలరాంనే పోటీలోకి దించారు. ఎప్పుడైతే బలరాం చీరాల బరిలోకి దిగారు.

అప్పటి నుండి ప్రతిరోజూ వందలమంది వైసీపీ నేతలు టీడీపీలో చేరిపోతున్నారు. అలాగే టికెట్ ఆశించి భంగపడ్డ చీరాల వైసీపీ సమన్వయకర్త యడం బాలాజి కూడా టీడీపీలో చేరారు. దీంతో ఆమంచి వర్గం పెద్ద షాక్‌కి గురైంది. ఇక ఈ షాకులు రేంజ్ ఇంకా పెరుగుతూనే ఉంది. తాజాగా ఆమంచి సహచరుడిగా ఉంటున్న వేటపాలెం మాజీ ఎంపీపీ చల్లా జనార్థన్‌రావు తన స్నేహితులు, శ్రేయోభిలాషులతో బలరాం సమక్షంలో టీడీపీలో చేరారు. ఇలా వైసీపీకి షాకులు మీద షాకులు తగులుతూ కోలుకోలేని స్థితికి వెళ్లిపోయింది.

జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న బలరాం అంటే ఓ భరోసా…ఓ నమ్మకం…ఓ ధైర్యం అని నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నారు. ఇక ఆమంచి రౌడీయిజం, దందాలు, దౌర్జన్యలతో ప్రజలు విసిగిపోయీ ఉన్నారని…ఇప్పటికీ ఆమంచిని ఢీకొట్టే సరైనా నాయకుడు వచ్చాడని వైసీపీ నేతలు భావిస్తూ వరుసగా టీడీపీలో చేరిపోతున్నారు. ఇంతకాలం ఆమంచికి నమ్మినబంటులుగా, బలవంతంగా ఆమంచి వెనుక ఉన్న నేతలు…అందరికీ ధైర్యం ఇచ్చే బలరాం చెంతకి చేరుతున్నారు. మరికొద్దీరోజుల్లో జరగబోయే ఎన్నికల్లో ఆమంచిని చిత్తుగా ఓడించి..బలరాంని గెలిపించుకుంటామని వారు చెబుతున్నారు. ఓవ‌రాల్‌గా చూస్తే చీరాల తీర్పు మారుతోన్న‌ట్టే క‌నిపిస్తోంది.

Copy Protected by Chetan's WP-Copyprotect.