బాబు చేసిన పని కేసీఆర్‌ చేయలేకపోయాడు అందుకే జనంలో అంత వ్యతిరేకత!

చంద్రబాబు 7.5 లక్షల ఎన్‌టీఆర్ గృహాలు తాను సీఎం అయ్యాకా కట్టించారు. మరో మూడు లక్షల గృహాలకు పనులు జరుగుతున్నాయి. అంటే మొత్తం పదిలక్షల ఇళ్లు ఏపీలో బాబు ఇచ్చినట్టు. అదే హామీ తెలంగాణలో ఏమాయెనో చూడుర్రి. అందరికీ డబుల్ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్‌ ఏపీలో పది లక్షల ఇళ్లు ఇస్తా ఉంటే ఈడ పదివేల డబుల్ బెడ్‌రూం ఇళ్లు కూడా పూర్తి చేయలేక చతికిలపడ్డారు.

ఫలితంగా ఏ వాగ్దానం పైన అయిన జనం గంపెడాశలు పెట్టుకుని ఓట్లు గుద్దారు అది నెరవేరక పోవటంతో కసిగా ఉన్నారు. పేదల సొంతింటి కల కలగానే మిగిలిపోయింది. గత నాలుగున్నరేళ్లు అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లను కట్టిస్తామని మోసం చేసింది. దీంతో పేదల సొంతింటి కల నెరవేరలేదు. కేసీఆర్ ఇళ్లులేని పేదలందరికి డబుల్ బెడ్‌రూం ఇంటిని కట్టిస్తామని హామీ ఇచ్చి నాలుగున్నరేళ్లు గడిచింది. ఉదాహరణకు రాష్ట్ర రాజధానిలోని రాజేంద్రనగర్ నియోజకవర్గం తీసుకుందాం. అక్కడ ఏ ఒక్కరికి ఇల్లు వచ్చింది లేదు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని రాజేంద్రనగర్ సర్కిల్ డబుల్ బెడ్‌రూమ్ నివాసాలకు కనీసం స్థలాన్ని కూడా గుర్తించ లేదు. ఇక గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కట్టించిన రాజీవ్ గృహకల్ప, పట్టణ పేదల నిర్మూలన పథకం కింద నిర్మించి పూర్తి చేసిన ఇళ్లను సైతం లబ్ధిదారులకు అందించడలేని దుస్థితిలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైంది.

కాంగ్రెస్ హాయాంలో నిర్మించిన ఇళ్లను తాము పేదలకు అప్పగిస్తే టీఆర్‌ఎస్‌కు ప్రభుత్వానికి పేరు రాదని, కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు వస్తుందనే సాకుతో పేదలకు ఇళ్లను అప్పగించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వం కట్టించిన ఇళ్లను అప్పగించలేదని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను ఎప్పుడు కట్టిస్తాడని ప్రజలు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. గత ఎన్నికల్లో కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కట్టించిన డబ్బా ఇళ్లు కాదు, కుటుంబం మొత్తానికి సరిపోయే విధంగా అత్యంత నాణ్యతతో డబుల్‌బెడ్‌రూం ఇళ్లను కట్టిస్తామని ప్రగల్బాలు పలికారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని జనం చెబుతున్నారు. కేసీఆర్ రాజకీయ లబ్ధి కోసమే మళ్లీ ఈ సారి ఎన్నికల్లో అనేక మోసపురిత వాగ్దానాలు చేస్తూ మళ్లీ ఓట్లు దండుకొనేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో రాజీవ్ గృహకల్ప, పట్టణ పేదల నిర్మూలనా పథకం కింద నిర్మించిన ఇళ్లు లబ్ధిదారులకు ఇవ్వక పోవడంతో అవి శిథిలావస్థకు చేరాయి. కొన్ని చోట్ల చివరి దశలో ఉన్నా టీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తి చేయలేదు. లక్ష్మీగూడ, బాలాపూర్ సమీపంలోని కుర్మల్‌గూడలో వేలాది ఇళ్ల నిర్మాణం పూర్తయినా టీఆర్‌ఎస్ ప్రభుత్వం పేదలకు అందించక లేకపోవడం ఏమిటని పేద ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇక స్థానిక ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్ నియోజకవర్గంలో ఏ ఒక్కరికి డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి కృషి చేయలేదనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

Copy Protected by Chetan's WP-Copyprotect.