బీజేపీకి బిగ్‌ షాక్‌ ఇచ్చే బిగ్ బ్రేకింగ్!

బీజేపీ కర్ణాటక అధ్యక్షుడు బీఎస్‌ యడ్యూరప్ప మెడకు ఉచ్చు బిగుస్తోంది. ‘ఆపరేషన్‌ కమల్‌’కు సంబంధించిన మరికొన్ని ఆడియోలను ముఖ్యమంత్రి కుమారస్వామి బుధవారం విడుదల చేశారు. జేడీఎస్‌ ఎమ్మెల్యే కుమారుడికి రూ.22.5 కోట్లు ఇస్తామని బీజేపీ ఎమ్మెల్యే ఆశపెట్టడం, రెబల్‌ ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్‌ ఆమోదిస్తారని కూడా చెప్పడం తాజా ఆడియోల్లో ఉంది. జేడీఎస్‌ ఎమ్మెల్యే నాగనగౌడ కుమారుడు శరణగౌడతో యడ్యూరప్ప, బీజేపీ ఎమ్మెల్యేలు శివన్‌గౌడ నాయక్‌, ప్రీతం గౌడ సుమారు 80 నిమిషాలు జరిపిన సంభాషణలు తాజా టేపుల్లో ఉన్నాయి.

సంభాషణల్లో ఎంపిక చేసిన భాగాలనే సీఎం విడుదల చేశారని బీజేపీ ఆరోపించిన నేపథ్యంలో కుమారస్వామి తాజా ఆడియోలను విడుదల చేసినట్టు భావిస్తున్నారు. ముందు రూ.20 కోట్లు ఇస్తామని, నాగనగౌడను ముంబై వెళ్లి అధికారపార్టీకి చెందిన ఇతర ఎమ్మెల్యేలతో కలిసేలా, బీజేపీలో చేరేలా ఒప్పిస్తే మరో రూ.2.5 కోట్లు ఇస్తామని శరణగౌడతో నాయక్‌ అనడం ఇందులో వినిపించింది. కాగా.. ‘ఆపరేషన్‌ కమల్‌’ ఆడియో వివాదం హింసాత్మకంగా మారింది. హాసన్‌లో బుధవారం బీజేపీ, జేడీఎస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. హాసన్‌ ఎమ్మెల్యే ప్రీతంగౌడ ఇంటిపై జేడీఎస్‌ కార్యకర్తలు రాళ్ల వర్షం కురిపించారు. ఈ ఘటనలో కొందరు బీజేపీ కార్యకర్తలు గాయపడ్డారు. దాడికి పాల్పడ్డవారిపై చర్యలు తీసుకోకపోతే కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు ఫిర్యాదు చేస్తామని యడ్యూరప్ప చెప్పారు. బీజేపీ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌, పిల్ల కాంగ్రెస్‌ పార్టీలు అప్పడప్పుడు ఓటుకు నోటు కేసు అంటూ మాట్లాడుతూంటాయి.

అసలు ఆ పేరె‌త్తే అర్హత ఎవ్వడికి ఉందో మాట్లాడదాం రండి. ముందు బీజేపీతో బిగిన్‌ చేద్దాం. గుజరాత్‌లో రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అగ్రనేత అహ్మద్‌ పటేల్‌ను ఓడించటానికి రాత్రికి రాత్రి పదిమంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను టోకున కొనటం అబద్ధమా? కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి మరీ మోడీ, అమిత్‌ షా, బీజేపీ అడ్డంగా దొరికి పోలేదా?
బీజేపీ కొన్న ఎమ్మెల్యేల ఓట్లు చెల్లవు అని ఎన్నికల కమిషన్‌ ఛీ కొడితే బీజేపీ రాజ్యసభ అభ్యర్థి ఓడి కాంగ్రెస్‌ ఎంపీగా అహ్మద్ పటేల్ ఎన్నిక అవ్వలేదా? బీజేపీకి అమ్ముడుపోయిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు మొన్న జరిగిన గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సీట్లు కేటాయించగా వాళ్లని జనం ఛీకొట్టి ఓడించటం వాస్తవం కాదా? మీరా ఓటుకు నోటు అని మాట్లాడే వాళ్లు? గోవా అసెంబ్లీలో కాంగ్రెస్‌ కంటే తక్కువ సీట్లు వచ్చిన మీరు కాంగ్రెస్‌ను రానివ్వకుండా ఇతర పార్టీలకు పదవుల ప్రలోభాలు చూపలేదా? మణిపూర్‌లో సాధారణ మెజార్టీకి కేవలం మూడంటే మూడు సీట్ల దూరంలో ఉన్న కాంగ్రెస్‌ను పక్కకు నెట్టేసి ఇతరులను ప్రలోభపెట్టి అధికారంలోకి రాలేదా? మీరా ప్రలోభాల గురించి మాట్లాడేది? మీరు నీతులు చెప్పేది? మీరా ఏపీకి కళంకం అంటించాలని చూసేది?

Copy Protected by Chetan's WP-Copyprotect.