జగన్ అక్రమాస్తులు రూ.43వేల కోట్లని కోర్టుకు సీబీఐ చెప్పింది! సీఎం అవకుండానే ఇదంతా? మరి మీరు సీఎంను చేస్తే?

40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాడు. ప్రపంచ దేశాల్లో మంచి గుర్తింపు ఉంది. దేశంలోని అత్యంత ధనవంతులు దగ్గర మంచి పేరు ఉంది. ఆంధ్రప్రదేశ్‌కి అత్యధిక కాలం చీఫ్‌ మినిస్టర్‌. అత్యధిక కాలం ప్రతిపక్షనేత. అయితేనేం. అలాంటి పనులు చేస్తారా ఎవరన్నా? రాజకీయాల్లో ఉంటూ ప్రతి ఏటా తన ఆస్తులను బహిరంగంగా ప్రకటిస్తారా? ప్రకటించింది చాలదన్నట్టు పెద్ద సవాల్‌ కూడానా? నేను ప్రకటించిన ఆస్తులు కాకుండా నాకు వేరే ఆస్తులు ఉన్నట్టు ఎవరన్నా నిరూపిస్తే వాటిని వెంటనే వారికే రాసిచ్చేస్తానని సవాళ్లు కూడా వేశాడు.

ఏం అనుకుంటున్నారు అసలు మీ గురించి మీరు బాబు గారు? మీరు తినరు, ఇంకొకడిని తిననివ్వరు. అంతకన్నా ఘోరం ఇంకోటి ఉంటుందా? మీరు ధైర్యంగా ఏటా మీ ఆస్తులు మీడియాకు ప్రకటిస్తున్నారని పౌరుషం కొద్దీ మీ ప్రతిపక్షనేత ఏమైనా తమ ఆస్తులను బహిరంగంగా ప్రకటిస్తున్నారా? మీరు చేసినట్టుగా నేను చెప్పిన ఆస్తులు కాకుండా ఎక్కువ ఉంటే నేను రాసిచ్చేస్తాను మీరే తీసేసుకోండని ఓపెన్‌ ఛాలెంజ్ చేస్తున్నారా? లేదేం? మరి మీకెందుకంట? అయినా మీకెక్కడివి అండీ ఆస్తులు. అంతా ఆవిడ కష్టార్జితమే కదా? శ్రీమతి భువనేశ్వరి గారు హెరిటేజ్‌ సంస్థల అధినేత. త్రికరణ శుధ్దిగా, వృత్తి విలువలతో వ్యాపారం చేస్తూ గడిచిన దశాబ్దకాలంగా స్టాక్‌ మార్కెట్‌లో నిలకడగా షేర్‌ విలువ పెంచుకుంటూ, మదుపరుల నమ్మకాన్ని పొందిన సంస్థ ఆమెది. పూర్తి కాలం అంకితమై ఆవిడ వ్యాపారాలు చూసుకుంటారు. అలాంటిది ఆవిడ ఆస్తులే 134 కోట్లు.

వాటిని చంద్రబాబు ఎప్పుడో ప్రకటించారు. ఇంక చంద్రబాబు ఆస్తుల విలువ రూ.43 కోట్లు అన్నమాట. ఏంటండీ ఇది మరీ ఇంత దారుణంగా. 40 ఏళ్లు రాజకీయాల్లో ఉండి, అత్యధిక కాలం రాష్ట్ర సీఎంగా ఉండి ఆఫ్టరాల్‌ రూ.43 కోట్లా? అది కూడా అదేదో పెద్ద దేశంలో అత్యధిక ధనవంతుడు ముఖేష్‌ అంబానీలా గొప్పగా ప్రతి ఏటా మీడియాకు మీ అంతట మీరే ఇవిగో నా ఆస్తులు అని ఈ పాటి దానికి ప్రకటించడం కూడానా? జగన్‌ని చూడండి. అతను సీఎం కూడా కాదు. వాళ్ల నాన్న సీఎంగా ఆరేళ్లు ఉన్నందుకే లక్ష కోట్టు కొట్టేశాడు. అబ్బే లక్ష కాదు. రూ.43 వేల కోట్లకే లెక్కలు దొరికాయి అని సీబీఐ కోర్టులో ప్రకటించింది. మీవి ఆఫ్టరాల్‌ రూ.43 కోట్లు ఆస్తి. రాజకీయ నాయకుల పరువు తీసేసారు బాబు గారు. సత్తెకాలపు (సత్యయుగం) మనిషిలా ఉన్నాడు చంద్రబాబు అనుకుంటున్నారు జనం. అదే మీ బలం.

Copy Protected by Chetan's WP-Copyprotect.