పోలవరం ప్రాజెక్టు అథారిటీ పర్యవేక్షణలోనే పనులు జరిగినప్పుడు గత ప్రభుత్వాన్ని తప్పు పట్టడం సమంజసమా?

“పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్రాజెక్టు అథారిటీ పర్యవేక్షణలో జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదు. పోలవరంలో ఎటువంటి అవినీతి జరిగినట్లు మా దృష్టికి రాలేదని లోక్‌సభలో కేంద్రమంత్రి వెల్లడించారు. కాంట్రాక్టు దక్కించుకోవడంలో ఏ ఉల్లంఘనలు జరిగింది చెప్పకుండా, తమ సౌకర్యం కోసం నిర్మాణ బాధ్యత నుండి తప్పుకోవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వం నవయుగను కోరింది. కేంద్రానికి చెప్పకుండా ఏక పక్షంగా రద్దు చేసింది. గతంలో కాంట్రాక్టర్‌ను మార్చాల్సి వచ్చినప్పుడు అప్పటి జల వనరుల మంత్రినిసంప్రదించే కొత్త కాంట్రాక్టరుకు పనులు అప్పగించింది టీడీపీ ప్రభుత్వం. నిర్మాణ బాధ్యతను అప్పగించడంలో తప్పు జరిగినా, అవినీతి జరిగినా ప్రాజెక్టు పర్యవేక్షణ నిర్వహిస్తున్న అథారిటీతో పాటు కేంద్ర జలవనరుల శాఖకు బాధ్యత ఉంటుంది. నిజంగా తప్పులు జరిగి ఉంటే వాటిని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళవచ్చు.

అలా చేయకుండా ఏక పక్షంగా కాంట్రాక్టును రద్దు చేశారు. రీటెండర్స్ వల్ల ప్రాజెక్టు వ్యయం పెరిగితే కేంద్రం తప్పకుండా అభ్యంతరం చెప్తుంది. సొంత మనుషులకు కాంట్రాక్టులు ఇచ్చుకునేందుకే ప్రభుత్వం ప్రాజెక్టు పనులను నిలిపి వేసింది. పోలవరం పురోగతిపై కేంద్ర ప్రభుత్వం, గత ప్రభుత్వాన్ని ప్రశంసించి అవార్డు ఇచ్చింది. కేంద్ర జల విద్యుత్ సంస్థ (సెంట్రల్ బోర్డ్‌ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ – సిబిఐపి)ఈ అవార్డును ప్రకటించింది. పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా, చక్కగా సాగుతున్నందుకు అవార్డు ఇస్తున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది.ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామి అయిన నవయుగ సంస్థ 24గంటల్లో 32.215క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పోసి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు సాధించింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ)ఏర్పాటు చేసిన ప్రాజెక్టు పనులు లక్ష్యాల మేరకు పూర్తికావాలంటే రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణ అవసరమని కేంద్ర జలవనరులశాఖ భావించి పనుల పర్యవేక్షణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది . అప్పటి నుంచే వైసీపీ పోలవరంపై విషం కక్కడం మొదలుపెట్టింది. పర్సంటేజీల కోసం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం తలకెత్తుకున్నదని అనేక విమర్శలు చేసింది. పోలవరం ప్రాజెక్టు భవిష్యత్తు ఇప్పుడు ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)చేతుల్లోకి వెళ్లిపోయింది. టెండర్ల రద్దు వల్ల ఆ ప్రభావం ప్రాజెక్టు నిర్మాణంపై పడనుంది.పోలవరం నిర్మాణంలో వాస్తవాలను పరిశీలిస్తే.. 2018 ఫిబ్రవరిలో మొదటిసారి నవయుగ సంస్థకు గత ప్రభుత్వం అప్పగించింది.60సి క్లాస్ ద్వారా LS-కాంట్రాక్టు విధానంలో -14.055శాతం, 2015–-16 రేట్లకు పని విలువ రూ.1244కోట్లతో ఏడాదిన్నరలో పని పూర్తిచేసే విధంగా, తరువాత 2018 మేలో రూ.918.76కోట్లు, మూడవ విడత 2019జనవరిలో రూ.751.55 కోట్ల విలువ చేసే పనిని అప్పజెప్పింది. మొత్తం పని విలువ 2,914.66కోట్లు. రూ.1664.55కోట్ల పనిని ఏప్రిల్ 2019నాటికి 15నెలల కాలంలో పూర్తిచేసింది. ఒరిజినల్ కాంట్రాక్టు ట్రాన్స్ ట్రాయ్‌ సంస్థ రూ.1999.63కోట్ల పనిని 5సంవత్సరాల కాలంలో పనిచేసింది.

2018లో నవయుగ సంస్థ ముందుకు వచ్చి 2015-–16 SSR పై -14.055శాతానికే పనిచేపట్టి 15నెలల కాలంలో రూ.1665కోట్ల విలువ చేసే పనిని పూర్తిచేసింది. కానీ అప్పటి ప్రభుత్వాలకు 2004 నుంచి 2013 మద్య పోలవరం హెడ్ వర్క్స్ టెండర్ల ప్రక్రియను పూర్తిచేయడానికే దాదాపు 9 సంవత్సరాలు పట్టింది. ప్రస్తుత ప్రభుత్వం తక్కువ రేట్లకు పనిచేస్తున్న కాంట్రాక్టర్‌ను కారణం లేకుండా, కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం క్లాస్ -89.3 అగ్రిమెంట్ కాంట్రాక్టును ఫ్రీ క్లోజర్ చేయడానికి అనుమతి అడిగారు.ఇది ఎవరి ప్రయోజనాల కోసమో ప్రభుత్వం చెప్పాల్సి ఉంది. అసలు పోలవరం డ్యామ్ నిర్మాణ అంచనాలు పరిశీలిస్తే… పరిపాలనా ఆమోదం రూ.4040 కోట్లు కాగా తరువాత జీఓ ఎం.ఎస్‌. నెంబర్ 82, 2008..మే 8న, 2005 మార్చి 24న జీఓ ఎం.ఎస్‌. నెంబర్ 54 ప్రకారం పోలవరం ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యాం సవరించిన అంచనా ప్రతి పాదనలు ఆమోదం రూ.73,72,220 కోట్లు అంటే పెరిగిన అంచనా మొత్తం రూ. 3331.285 కోట్లు, ఆంటే నాలుగేళ్లలో 82.44 శాతం పెరిగింది. ఈ విధంగా అంచనాలు పెంచుతూ ప్రజాధనం దోపిడీ చేసినవారు ఈ రోజు పోలవరంలో అంచనాలు పెరిగాయని పెడ బొబ్బలు పెడుతున్నారు. జాతీయ ప్రాజెక్టులో కీలక నిర్ణయాలు తీసుకోవాలంటే పోలవరం అథారిటీ పీపీఏతో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు ఎవరిని అడిగి కాంట్రాక్ట్‌ను రద్దు చేశారు. ఇప్పుడు గోదావరి వరద ఉధృతంగా ఉంది.కాఫర్ డ్యాం, స్పిల్ వే, స్పిల్ చానెల్ అన్నీ నీట మునిగాయి. ఈ పరిస్థితుల్లో 15 రోజుల్లో వర్క్ క్లోజ్ చేయడం ఎలా సాధ్యం? రాష్ట్రంలో ఇంతవరకు అమలులో లేని రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలుచేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధపడింది. దేశంలో ఇది ఎక్కడా అమలులో లేదు. 2015-–16 SSR రేట్లు -14.055శాతం రేటుతో మిగిలిన పనిని అంచనా వేసి రివర్స్ టెండరింగ్ కు వెళ్తారా? 2019–-20 SSR రేట్లకు సవరించి మిగిలిన పనిని అంచనా వేసి రివర్స్ టెండరింగ్ విధానం అమలుచేస్తారా? అనే విషయం ప్రభుత్వం వెల్లడించాల్సి ఉంది.

పూర్తి కావొచ్చిన ప్రాజెక్టును నిలిపివేయడం అంటే ఐదు కోట్ల ఆంధ్రుల నోట్లో మట్టి కొట్టడమేనని పాలకులు గుర్తించాలి. అవినీతికి చిరునామా జగన్ జమానా.. ఈ రోజు ఆయన నీతులు చెప్పడం చూసి జనం నవ్వుకుంటున్నారు. అధికారంలోకి వచ్చిన దగ్గరనుండి చంద్రబాబుపై వ్యతిరేకతను నూరిపోయడమే సరిపోతుంది. ఆయన కట్టిన కట్టడాలు కూల్చడం, ఆయన తలపెట్టిన నిర్మాణాలు నిలిపివేయడం, ఆయన చేపట్టిన పథకాలు రద్దుచేయడం, అభివృద్ది కార్యక్రమాలపై ఎంక్వైరీలు వేయడం తప్ప పాలనలో రాష్ట్రాభివృద్ది, ప్రజా ప్రయోజనాలు కనపడటం లేదు”. – దేవినేని ఉమా మహేశ్వరరావు

Copy Protected by Chetan's WP-Copyprotect.