ఇది చదివితే జగన్‌ కంటే లోకేష్‌ గ్రేట్ అనాల్సిందే!

చంద్రబాబు, వైఎస్‌ లాగే వారి కుమారులు లోకేష్‌, జగన్‌ కూడా దాదాపు ఒకేసారి రాజకీయ ప్రవేశం చేశారు. తండ్రి అధికారం వడ్డించిన విస్తరిలా చూసిన జగన్‌ రాజకీయాల్లోకి వచ్చాడు. నేరుగా ఎంపీ టిక్కెట్‌ కొట్టాడు. తండ్రి ప్రతిపక్షంలో ఉండటం, పార్టీ కష్టాల్లో ఉండటం చూసి లోకేష్‌ బాధ్యత తీసుకున్నాడు. పదవులు లేకున్నా పార్టీ కార్యకర్తలను కాపాడుకోవటం అనే బాధ్యతను భుజాలపై మోసాడు. అక్కడ జగన్‌ అందినకాడికి మేసాడు. ముందు సుఖపడ్డవాడు తర్వాత కష్టపడతాడు. ముందు కష్టపడిన వాడు తర్వాత సుఖపడతాడు అనేది చరిత్ర ప్రతిసారీ నిరూపిస్తూనే ఉంటుంది.

వైఎస్‌ 2004లో అయినా జగన్‌ పార్టీలో ఏ బాధ్యతా మోయలేదు. 2009లో కడప టిక్కెట్టు తీసుకుని నేరుగా ఎంపీ అయిపోయాడు. అది జగన్‌ ఎంట్రీ. వెనుక ముఖ్యమంత్రి, అధికారబలం, అన్ని అనువైన పరిస్థితుల్లో ఆయన రాజకీయ ఆరంగేట్రం చేశాడు. జగన్‌కి కాంగ్రెస్‌ పార్టీలో ఏ పదవీ లేదు. పార్టీకి అతను చేసిందేమీ లేదు. సొంత వ్యాపారాలు చూసుకోవటం తప్ప. పార్టీలో కొద్దిరోజులు కార్యకర్తగా పనిచేయకుండా సీఎం కొడుకు అనే అర‌్హతతో నేరుగా ఎంపీ టిక్కెట్‌ తెచ్చుకుని పోటీ చేసి గెలిచాడు. చంద్రబాబు సీఎం అవగానే వైఎస్‌లాగా లోకేష్‌ను వారుసుడిని చేసేయలేదు. రెండుసార్లు సీఎంగా ఉన్నా ఎప్పుడు సచివాలయంలోకి కూడా రానివ్వలేదు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, వైఎస్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌కి నేతలంతా వెళ్లిపోతున్నప్పుడు లోకేష్‌కి పార్టీలో కార్యకర్తలాగా పనిచేయమని బాధ్యతలు ఇచ్చారు. పార్టీ నడపటంలో కష్టనష్టాలు, కార్యకర్తలను కాపాడుకోవడంలో ఉండే సమస్యలు, ఎన్నికలను ఎదుర్కోవడంలో, ఆర్థికంగా నిలదొక్కుకోవడంలో ఉండే చిక్కులు అని అనుభవపూర్వకంగా నేర్పించాడు. ఢక్కామొక్కీలు తినిపించాడు. అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో చదువుకుని వచ్చినా నేరుగా సింహాసనంపై కూర్చో పెట్టలేదు.

కూలీలాగా పార్టీకి పనిచేయించాడు. అధికూడా అధికారంలో లేనిరోజుల్లో. కమ్యునిస్టుపార్టీల్లో కూడా కనుమరుగైపోయిన కేడర్ పాలసీ అనే దాన్ని లోకేష్ తెలుగుదేశంలో ప్రవేశపెట్టాడు. దానికి వ్యవస్థీకృతం చేసి, కార్యకర్తలకు గుర్తింపు కార్డులు, జీవితభీమా ఇచ్చి శ్రేణుల మనస్సు చూరగొన్నాడు. కార్యకర్తల కష్టనష్టాల్లో అండగా ఉంటున్నాడు. కార్యకర్తల బిడ్డలను ఎన్టీఆర్‌ మోడల్‌ స్కూలులో చదవిస్తున్నాడు. వేలమందికి ఆర్థికసాయం చేశాడు. అలా ఒక్కోమెట్టు ఎక్కుతూ, తనను తాను నిరూపించుకుంటూ ఈరోజు మంత్రి అయ్యాడు. తన ఎంట్రీ కోసం పినతండ్రినే అడ్డు తొలగించుకోవాలని అని జగన్‌లా ఆలోచించలేదు. తన కోసం వేరొకరితో రాజీనామాలు చేయించి అవతలవారి కలలు చేరిపేయటం ఇష్టం లేక ఎమ్మెల్సీగా ఎంటరయ్యాడు. తొలిసారి మంత్రి అయినా తానేంటో నిరూపించుకుంటున్నాడు. కేంద్ర ప్రభుత్వంతో నుంచి, పలు ప్రతిష్ఠాత్మక సంస్థల నుంచి అనేక అవార్డులు అందుకున్నాడు. గూగుల్‌ ఎక్స్‌, హెచ్‌సీఎల్‌ వంటి గొప్ప సంస్థలను పట్టుదలగా రాష్ట్రానికి రప్పించాడు. మంగళగిరిని ఐటీ హబ్‌గా చేశాడు. రాష్ట్రంలో డ్రోన్‌ల తయారీ పరిశ్రమను తెచ్చాడు. ఇంకా అనేక ఘనతలు ఉన్నాయి. మొదట్లో చెప్పుకున్నట్టు ముందు సుఖపడ్డవాడు తర్వాత కష్టపడతాడు. ముందు కష్టపడిన వాడు తర్వాత సుఖపడతాడు అనేది లోకేష్‌, జగన్‌లో ఎవరికి వర్తిస్తుందో భగవంతుడు నిరూపించాడుగా.

Copy Protected by Chetan's WP-Copyprotect.