88 శాతం ముస్లిం మైనార్టీలు ఈసారి టీడీపీ వైపు ఓటు! ఏపీలో “పబ్లిక్ పల్స్‌”

“పబ్లిక్ పల్స్‌” అంచనా ప్రకారం ఏపీలో ఉన్న ప్రతి వంద ముస్లిం ఓట్లలో 88 శాతం ఓట్లు తెలుగుదేశంకు పడే అవకాశాలు కనిపిస్తాయి అని తెలుస్తోంది. ఏపీలో చంద్రబాబుకు సమాన నాయకుడు లేకపోవటం, ముస్లింలకు ఈ ఐదేళ్లలో అనేక ప్రయోజనాలు కలిపించటం, ముస్లింల హక్కులకు భంగం కలిగించేదిగా భావిస్తున్న త్రిపుల్ తలాక్‌లోని న్యాయపరమైన అంశాల విషయంలో వైసీపీ మెదలకుండా ఉంటే టీడీపీ పార్లమెంటులో గట్టిగా పోరాడిందని ముస్లింలు భావిస్తున్నట్టు తేలింది.

కొన్ని నియోజకవర్గాల్లో 90 శాతం ముస్లింలు, కొన్ని చోట్ల 75 శాతం ఇంకొన్ని అసెంబ్లీ స్థానాల్లో 69 శాతం ఇలా మొత్తం మీద సగటున 88 శాతం ముస్లింల ఓట్లు టీడీపీకి అనుకూలంగా పోల్ అయ్యే అవకాశం ఉందని సర్వే సంస్థల అంచనా. 2004, 2009ల్లో కాంగ్రెస్‌ పార్టీకి, 2014 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న కారణంగా టీడీపీకి దూరం జరిగిన ముస్లింలు ‘జగన్‌’ పార్టీకి మద్దతు ఇచ్చారు. ఈసారి ముస్లిం ఓటర్లు 2019 ఎన్నికల్లో గత మద్దతుకు భిన్నంగా టిడిపి వైపు మొగ్గు చూపుతున్నట్లు ఆయా వర్గాల తీరును బట్టి అర్థం అవుతోంది. ముస్లిం మైనార్టీలు టిడిపి వైపు మొగ్గుచూపితే కర్నూలు, కడప, నంద్యాల, అనంతపురం, రాజంపేట, గుంటూరు, విజయవాడ లోక్‌సభ నియోజకవర్గాల్లో, వాటికి కింద ఉన్న 49 అసెంబ్లీ సీట్లలో వారి ప్రభావం బాగా పనిచేసే అవకాశం ఉంది. ఫలితంగా టిడిపి అభ్యర్థులకు మెజార్టీ పెరగడం ఖాయం అంటున్నారు.

ఇటీవల గుంటూరు నగరంలో కొంత మంది నిర్వహించిన సర్వేలో ముస్లిం మహిళా ఓటర్లు మీరు ఎవరికి ఓటువేస్తారని ప్రశ్నిస్తే..గతంలో ‘జగన్‌’కు వేశాం..ఈసారి తమ ఓటు ‘చంద్రన్న’కే అని తేల్చి చెబుతున్నారు. మహిళా ముస్లిం ఓటర్లు బహిరంగంగా చెబుతుంటే..మిగతా కుటుంబ సభ్యుల ఓట్లు టిడిపికి పడడం ఖాయమని స్పష్టం అవుతోంది. ముస్లిం సామాజికవర్గంలో మగవాళ్లు ఏ పార్టీకి ఓటు వేస్తే..మహిళలు కూడా అదే పార్టీకి ఓటు వేస్తారని రాజకీయ నాయకులందరికీ తెలుసు. గతంలో మూడుసార్లు జరిగిన ఎన్నికల్లో ఈ విషయం స్పష్టమైంది. ‘జగన్‌’కు ఓటు వేస్తే ‘మోడీ’కి వేసినట్లే…అని ఎన్నికల ప్రచారంలో ‘చంద్రబాబు’ దాడిని ప్రారంభించారు. అదే దాడిని గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయికి తీసుకెళ్లితే…90శాతం మైనార్టీ ఓటర్లు టిడిపికి ఓటు వేయడం ఖాయం. మోడీతో తమ నేత సఖ్యతగా ఉంటున్నారని, ఓటర్లు నమ్ముతున్నారు..దీనిని ఎలా ‘జగన్‌’ ఎదుర్కొంటారో తమకు అర్థం కావడంలేదని వైకాపా నేతలు చెబుతున్నారు.

Copy Protected by Chetan's WP-Copyprotect.