ఎన్నికల తర్వాత బీజేపీ ప్రధాని అభ్యర్థి గడ్కరీ?

అన్ని దశలలో పోలింగ్ ముగిశాకా, ఫలితాలు వెలువడ్డాకా బీజేపీ జాతీయ నాయకత్వంలో మార్పులు భారీగా ఉంటాయని అంటున్నారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా సహా మోడీని పక్కన పెట్టినా ఆశ్చర్యం లేదని టాక్. కారణం బీజేపీ ఎలాగూ 200 లోపే ఆగిపోతుందని వారి ఇద్దరూ ఉంటే ఎవరూ తమతో జత కట్టడానికి రారని పార్టీలో కీలక నేతలు భావిస్తున్నారు. సంఘ్‌ కూడా అదే భావిస్తోంది. అందుకే ఇటీవల నితిన్ గడ్కరీ దూకుడు బాగా పెరిగిందని నాగపూర్ వర్గాలు అంటున్నాయి.

తిరగేసి బోర్లేసి మడతేసి కొట్టేశాడు మళ్లీ ! గడ్కరీనే ! మోడీనే ! ఆడుకున్నాడు ఇంకోసారి. సంసారాన్ని నడపలేనోడికి దేశాన్ని నడిపే హక్కులేదు అనేశాడు. కుటుంబాన్ని నడపడం చేతగానోడికి సగటు మనిషి కష్టాలు ఏం తెలుస్తాడ్ అన్నాడు. ఏబీవీపీ మీటింగ్ లో గడ్కరీ చేసిన కామెంట్లు రాజకీయ సెన్సేషన్ అవుతున్నాయ్. ఇంతకీ ఏపీకి ఇందులో కిక్కే ముంది?
చాలానే ఉంది. గడ్కరీ మోడీని టార్గెట్ చేయడం ఇది మూడోసారి ! నియంతలా వ్యవహరించకూడదు అని చెప్పాడు. వ్యక్తులు స్వయంగా బీజేపీని అధికారంలోకి తీసుకొస్తారనుకోవడం భ్రమే అని చెప్పాడు. ఆ తర్వాత మోడీ పాలసీల మీద కూడా గట్టిగానే మేకులు కొట్టాడు. ఇప్పుడు మరోసారి సంసారం, బాదర బందీ తెలియనోడికి పరిపాలన ఏం చేతనవుతుంది అనేశాడు. నిజానికి గడ్కరీ చెప్పింది దేశంలో మెజారిటీ జనం అభిప్రాయం. నోట్లను అమాంతం రద్దు చేసినప్పుడు, జీఎస్టీ తెచ్చి చిన్న వ్యపారులను దెబ్బ తీసినప్పుడు దేశం మొత్తం ఇలాగే అనుకుంది.

కుటుంబం ఉండి ఉంటే కష్టాలు తెలిసేవి మోడీకి అని మాట్లాడుకుంది. ఇప్పుడు నేరుగా అదే మాట అనేశాడు గడ్కరీ. ఇక మరో సంగతి కచ్చితంగా చెప్పుకోవాలి. ఏపీ సంతోషించే సంగతి ఏముంది ఇందులో అంటారా ? చాలానే ఉంది. మోడీ ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ ప్రధాని కాబోడు, కాలేడు అనేందుకు ఇదే సంకేతం. సగటు జనం కష్టాలు తెలియక కొంప ముంచాడు, సుఖాన ఉన్న పార్టీని తీసుకెళ్లి ఇక ఏడ్చేలా చేశాడు. జనం ఉసురు కొట్టుకున్నాడు అని ఆరెస్సెస్ కూడా బలంగా భావిస్తోంది. గడ్కరీ మాటలకి అర్థం అదే. నాగ్ పూర్ సంఘ్ పరివారం హెడ్ క్వార్టర్స్. గడ్కరీ స్వస్థలం అదే. అటు నుంచి సంకేతాలు రాకుండా మోడీ మాట్లాడే అవకాశమే ఉండదని బీజేపీలోనే చర్చ సాగుతోంది. ఇప్పుడు ఇక దేశం ఊపిరి పీల్చుకోవచ్చు. బీజేపీలో గడ్కరీ రూపంలో మోడీకి సబ్ స్టిట్యూట్ తయారు అయ్యాడు. ఇక ఓడిపోవడం, పక్కన పెట్టడమే తరువాయి. ఖాయంగా ! దాదాపు నేరుగా గడ్కరీ కామెంట్ చేసేసిన తర్వాత ఇక ఆలోచించడానికి ఏం లేదు. కచ్చితంగా ఇదే !

Copy Protected by Chetan's WP-Copyprotect.