గుంటూరు ఎంపీగా లగడపాటి? చంద్రగిరి అసెంబ్లీకి జయదేవ్‌!

తెలంగాణ నుంచి ఎందుకు పోటీ చేయాలని ఉంది అన్నాడో ఎన్నికల ఫలితాల తర్వాత లగడపాటి చెబుతారట. అందులో కేసీఆర్‌పై సెటైర్ ఉందని అంటున్నారు. ఆ వ్యాఖ్యల వెనక చాలా మర్మం ఉందని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. నిజానికి రాజగోపాల్ ఏపీ నుంచే పోటీ చేస్తారని చాలా మంది ఆయన మిత్రులు చెబుతున్నారు. రాజకీయాలు అంటే ప్రజాసేవ, అందులో ఒక థ్రిల్‌ ఉంటుందని లగడపాటి గతంలో పదేపదే చెప్పేవారు. ఆయన అనుచరులు ఇప్పుడు అదే ఉటంకిస్తున్నారు.

కార్యకర్తల విజ్ఞప్తి మేరకు గుంటూరు తెలుగుదేశం అభ్యర్థిగా లగడపాటి రాజగోపాల్‌ రంగంలోకి దిగితే ప్రస్తుత ఎంపీ గల్లా జయదేవ్‌ను చంద్రగిరి నుంచి అసెంబ్లీకి పంపే ప్రతిపాదన ఒకటి పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది. చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉన్న చెవిరెడ్డి భాస్కరెడ్డిపై జనం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈసారి గల్లా ఫ్యామిలీకి పక్కా గెలుపు ఖాయంగా చెబుతున్నారు. రాజగోపాల్‌కి గుంటూరు సీటు ఇవ్వడానికి చంద్రబాబు కూడా సుముఖంగానే ఉన్నట్టు తెలుస్తోంది. తన అభిమానులు, కార్యకర్తలు అందరితో సమావేశాలు జరిపి వారందరి అభిప్రాయాల మేరకు మళ్లీ ఎన్నికల్లో పోటీపై త్వరలో లగడపాటి రాజగోపాల్‌ ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాజకీయాల పట్ల ఆసక్తితో వివిధ ఎన్నికలు, ఆయా పార్టీల మ్యానిఫేస్టోలు, అభ్యర్థుల ఎంపిక దగ్గర్నుంచి గెలుపు ఓటములు, ప్రభావితం చేసే అంశాల వరకూ అన్నింటినీ పరిశీలిస్తూ సర్వేలు చేస్తూ రాజకీయాలకు దగ్గరగా ఉంటున్న రాజగోపాల్‌ ఒక్క అడుగు ముందుకు వేసి రాజకీయ బరిలో మళ్లీ కాలు పెడితే తప్పేంటని ఆయన అభిమానులు ఒత్తిడి తెస్తున్నారు.

అలాగే గుంటూరు ఎంపీగా అనుకున్న మేర రాణించలేకపోతున్న ఎంపీ గల్లా జయదేవ్‌ ఈసారి అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తున్నట్టు పొలిటికల్‌ సర్కిల్స్ అంటున్నాయి. పైగా చిత్తూరు జిల్లా నుంచి వలస వచ్చిన నేత కావటంతో తమకు అందుబాటులో ఉండట్లేదనే అసంతృప్తి కొంత నెలకొంది. దానికితోడు గతంలో తమకు నిత్యం అందుబాటులో ఉండే రాయపాటి సాంబశివరావుతో పోలిక పెట్టి చూడటం వలన గల్లా జయదేవ్‌కి పబ్లిక్‌లో అనుకున్న మేరకు మార్కులు పడట్లేదు. ఈ కారణాలతో ఆయన కూడా మార్పు కోరుకుంటున్నారని తెలిసింది. ఆరు నెలల ముందు రంగంలోకి దిగుతా అన్నాడు. అవసరం అనుకుంటే ఎవరి సాయం చేయాలో… తెలుసు అంటూనే జగన్ కి కౌంటర్ వేశారు. లగడపాటి రాజకీయాన్ని కరెక్టుగా అంచనా కట్టడంలో ఆరితేరిపోయారు. ధర్మామీటర్ తో బాడీ టెంపరేచర్ పక్కాగా లెక్కకట్టినట్టు… జనం పల్సును తెలుసుకొని చెప్పడంలోనూ ఆయన తిరుగులేని బెంచ్ మార్క్ అయిపోయారు.

Copy Protected by Chetan's WP-Copyprotect.