జగన్ పిటిషన్‌పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

తన హత్యకు కుట్ర జరిగిందని, కేంద్ర దర్యాప్తు సంస్థతో ఈ ఘటనపై విచారణ చేయించాలని జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందిస్తూ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఏపీ పోలీసుల దర్యాప్తు మీద నమ్మకం లేదనడంపై కోర్టు స్పందిస్తూ.. దర్యాప్తు అధికారులకు వాంగ్మూలం ఇవ్వకుండా ఘటన జరిగిన వెంటనే విశాఖ నుంచి హైదరాబాద్ ఎందుకు వెళ్లారని జగన్ తరపు లాయర్‌ను హైకోర్టు ప్రశ్నించింది.

పోలీసులకు వాంగ్మూలం ఇవ్వకుండా దర్యాప్తు తీరును ఆక్షేపించడం సమంజసం కాదని హైకోర్టు అభిప్రాయపడింది. అయితే.. ఈ వ్యాఖ్యలపై స్పందించిన జగన్ తరపు లాయర్ మాట్లాడుతూ.. ప్రాణాపాయం ఉన్నందునే స్టేట్‌మెంట్ ఇవ్వలేదని చెప్పారు.

Copy Protected by Chetan's WP-Copyprotect.