హైదరాబాద్‌ నుంచి ఏపీ ఎలక్షన్‌ న్యూస్ కవర్ చేయటానికి వెళ్లిన విలేఖరికి షాక్‌ ఇచ్చిన ఉత్తరాంధ్ర మహిళ! అన్ని గ్రామాల్లో ఇదే తంతు!

హైదరాబాద్‌ నుంచి ఆంధ్రా ఎలక్షన్ న్యూస్ కవర్ చేయటానికి ఆంధ్రజ్యోతి విలేఖరి ఉత్తరాంధ్ర జిల్లాలకు వెళ్లారు. చంద్రబాబు ఇస్తున్న ఫింఛన్ ప్రభావం ఎలా ఉందో అని పలు రకాల ప్రశ్నలు అడిగారు. కావాలని కొంత నెగిటీవ్ ప్రశ్నలు కూడా అడిగారు. కానీ మహిళలు, వృద్ధుల నుంచి చంద్రబాబుపై వస్తున్న ఆదరణ చూసి షాక్ అయ్యాడు. చంద్రబాబు ఈసారి గెలవడు అంటే జనం తన్నేలా ఉన్నారని ఆ విలేఖరి తన సహచరులతో చెప్పాడట.

మహిళల నుంచి ఎలాంటి టీడీపీకి ఆదరణ ఉందో అతను రాసిన ఈ న్యూస్‌ చూస్తే తెలుస్తుంది. ‘ఓటెవరికి వేస్తావు అవ్వా’.. అని అడిగితే.. ‘సంపినా చేసినా చంద్రబాబుకే నా ఓటు’ అని తేల్చి చెప్పిందీ అవ్వ. ఈమె పేరు.. చింతపల్లి పైడమ్మ. విశాఖ జాలారిపేటకు చెందిన వృద్ధురాలు. పెద్దకొడుకులా నెలనెలా డబ్బులిస్తున్న చంద్రబాబును కాదని ఓటెవరికి వేస్తామంటుందామె. ‘‘పిల్ల, జెల్ల, పెనిమిటి ఎవరూ లేని వంటరిదానిని. ఏళ్ల కిందట పెబుత్వం ఇచ్చిన పాకలోనే సిన్న దుకాణమెట్టుకుని బతుకుతన్నాను. ఐదేళ్ల కిందట చంద్రబాబు ముక్యమంత్రి అయి పించనీ సొమ్మును వేయి చేసి ఇచ్చాక చానా వరకు కట్టాలు తప్పాయి. పించనీ డబ్బులో కొంత పెట్టి సరుకులు తెచ్చి అమ్ముకుంటా. వచ్చిన రూపాయి, పించనీలో మిగిలిన సొమ్మే నాకు జీవనాధారం. పించనీ రెండొందులు ఇచ్చినప్పుడు బాగా కష్టాలుపడినాను. వేయి అయిన తరువాత ఇబ్బందులు చాలా వరకూ తీరాయి. పైగా అంతకుముందు ఉన్న కొసింత అప్పు తీర్చినాను. ఇప్పుడు కొసింత ఉంది.

రెండు వేలు అయినాక చాలా బాగుంది. కడుపు నిండా కూడు తింటన్నాను. ఇంకా గుడ్డ కొనుకుంతన్నాను. దేముడికి కోక చూపుతన్నాను. చంద్రబాబునాయుడు డబ్బులు ఇచ్చినోడు. ఆ బాబే మాలోటోళ్లకి ఎంతో చేసినాడు. ఆ బాబే వస్తే ఎంతో బాగుంటాది. మా మత్స్యకారుకులం ఆయనే గెలవాలని గానం సేసుకుంటున్నాం. ఆ దేముడిని అదే పార్దిస్తన్నాం. అనాథలు, పిల్లలను తినమని చెప్పి నెలనెలా పెద్ద కొడుకునెక్క డబ్బులు ఇత్తన్నాడు. నను చంపినా, చేసినా ఆయనకే వోటు వేత్తా. బొట్టులు ఉన్నోళ్లు, లేనోళ్లు అందరికీ పించనీ ఇత్తన్నారు. అన్నం ఏ బాబు పెడితే ఆ బాబు పేరు చెబుతాం అంతే. అన్నం పెట్టిన బాబుని మరిస్తే దేముడు చెమించడు. రాట్రం కోసమూ ఆ బాబూ ఎంతో కట్టపడతన్నాడని అందరూ చెపతన్నారు. అలాటి బాబుకు మనమంతా తోడుగా నిలబడితే రాట్రం బాగుంటాది. పించనీలు తీసుకుంతన్న మేమంతా ఆ బాబు ఎంటే వుంతామని చెపుతున్నా. మా ముసలవ్వలమంతా అందరికీ ఇదేమాట చెపతన్నాము.’’ అని పైడమ్మ తేల్చిచెబుతోంది.

Copy Protected by Chetan's WP-Copyprotect.