బాబుకు కర్నాటక సీఎం కాంప్లిమెంట్!

ఏపీ సీఎం చంద్రబాబుకు కర్నాటక సీఎం కుమారస్వామి కాంప్లిమెంటు ఇచ్చారు. చంద్రబాబు మంచి స్ట్రాటజిస్టు అని కొనియాడారు. అందుకే అంటారు పనిమంతుడు పంతం పట్టకపోయినా పనులు అవుతాయ్ ! పనికిమాలినోడు పడీపడీ దొర్లినా పకోడీగానే మిగులుతాడు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కర్నాటక చెప్పిన నీతి ఇదే ‍! కర్ణాటక ఎన్నికల్లో గెలిపిస్తా, బలుపు చూపిస్తా అంటూ సాయిరెడ్డి లాంటోళ్లు ఒళ్లు విరుచుకొని తిరిగినా కమలం కమిలింది. వైసీపీ చిప్పే మిగిలింది. మరి అదే కమలాన్ని ఓడించాలని చెప్పిన బాబుకు బ్రహ్మరథం పడుతోంది కన్నడ సీమ.

మోదీ ప్రభుత్వంపై తీవ్రంగా పోరాడుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు గురువారం జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాన మంత్రి దేవె గౌడ, కర్ణాటక ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామిలతో చర్చలు జరిపారు. అనంతరం వీరు ముగ్గురూ మీడియాతో మాట్లాడారు. దేవె గౌడ మాట్లాడుతూ నాలుగేళ్ళ ఎన్డీయే పాలన పెద్ద నోట్ల రద్దు వంటి చాలా సమస్యలను సృష్టించిందన్నారు. మోదీ ప్రభుత్వం వ్యవస్థలపై గురిపెట్టిందన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ సహా లౌకికవాద పార్టీల నేతలను కలిశారన్నారు. ఈ నేపథ్యంలో తమపై ఓ బాధ్యత ఉందన్నారు. లౌకికవాద పార్టీలన్నీ ఏకతాటిపైకి రావలసిన అవసరం ఉందని తెలిపారు. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ దేవె గౌడ ఆశీర్వాదాలు, మద్దతు కోసం తాను ఇక్కడికి వచ్చానన్నారు. ఆయన ప్రధాన మంత్రిగా దేశానికి సేవలందించారన్నారు. తనకు ఆయన ఎంతో గౌరవం ఇచ్చారని, తాను దానిని మర్చిపోలేనని తెలిపారు. దేశాన్ని కాపాడటానికి కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ముందుకు వచ్చారన్నారు. రెగ్యులేటరీ బాడీ అయిన ఆర్బీఐ ప్రస్తుతం మోదీ ప్రభుత్వ ఒత్తిడిలో ఉందన్నారు. ఈడీ, ఆదాయపు పన్ను శాఖలను దుర్వినియోగం చేస్తున్నారని, ఈ వ్యవస్థలను ఉపయోగిస్తూ గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో వేధింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. పెట్రోలు, డీజిల్ ధరలు రోజు రోజుకూ పెరుగుతున్నాయని, ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందని అన్నారు. రూపాయి విలువ డాలర్‌తో పోల్చినపుడు దారుణంగా పడిపోయిందన్నారు. వ్యవసాయం సంక్షోభంలో పడిందని, మైనారిటీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని, వ్యవస్థలను, దేశాన్ని కాపాడాలన్న లక్ష్యంతో బెంగళూరు వచ్చానని చంద్రబాబు తెలిపారు. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడటం గురించి కుమారస్వామి, దేవె గౌడలతో చర్చించినట్లు తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని తప్పకుండా కాపాడవలసి ఉందన్నారు. తన లక్ష్యం రాజకీయాలు కాదని స్పష్టం చేశారు. ఢిల్లీలో మీడియా తమ కార్యకలాపాలను ప్రసారం చేయడం లేదని ఆరోపించారు. ఇప్పుడిప్పుడే మీడియా ముందుకు వస్తోందని తెలిపారు.

ప్రధాన మంత్రి అభ్యర్థి గురించి తప్పకుండా చర్చిస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అని తెలిపారు. దేవె గౌడ ప్రధాన మంత్రిగా పని చేసిన కాలంలో ఒక ప్రయోగం జరిగిందని తెలిపారు. సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ సహా అందరినీ ఏకతాటిపైకి తీసుకొస్తామని చెప్పారు. ప్రస్తుతం ప్రారంభ ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.
మోదీ ప్రభుత్వం తమకు నమ్మక ద్రోహం చేసిందని చంద్రబాబు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి, ఇవ్వలేదన్నారు. ఈ విషయాలన్నిటినీ అర్థం చేసుకోవాలని కోరారు. కర్ణాటకలో ఉప ఎన్నికల ఫలితాలు దేశ ప్రజల మనోభావాలను ప్రతిబింబిస్తున్నాయని వివరించారు. కుమార స్వామి మాట్లాడుతూ లౌకికవాద శక్తులను ఏకం చేయడం కోసం తాము చర్చలు జరిపినట్లు తెలిపారు. చంద్రబాబు, దేవె గౌడ రాజకీయ లెక్కలు చాలా బాగున్నాయన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కూడా 1996 నాటి పరిస్థితులు వస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. 2019లో దేశంలో 1996 రాజకీయాలు మళ్లీ పునరావృతమవుతాయని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి జోస్యం చెప్పారు. చంద్రబాబు రాజకీయ ఎత్తుగడులు వ్యూహాత్మకంగా ఉంటాయని ఆయన ప్రశంసించారు. బీజేపీయేతర కూటమి చర్చల కోసం.. చంద్రబాబు బెంగళూరు వెళ్లారు. చంద్రబాబు ప్రయత్నాలకు వారు సంపూర్ణ మద్దతు తెలిపారు. సెక్యులర్ శక్తులన్నీ ఏకతాటిపైకి రావాల్సి ఉందని.. దేవేగౌడ అభిలాష వ్యక్త చేశారు. దేశంలోని అన్ని రాజ్యాంగబద్ధ సంస్థలను మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నాశనం చేసిందన్నచంద్రబాబు అభిప్రాయంతో దళపతులు ఇద్దరూ ఏకీభవించారు. దేవేగౌడ, కుమారస్వామితో దాదాపుగా 40 నిమిషాల పాటు జాతీయ రాజకీయాలపై చర్చించారు. దేవెగౌడ ఆశీస్సుల కోసమే బెంగళూరు వచ్చానని చంద్రబాబు చెప్పారు. మొదటి నుంచి ఆయనతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని, బీజేపీయేతర కూటమి ఏర్పాటుకు ఆయన మద్దతు కోరామని తెలిపారు.. అందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నానని .. ఇప్పటికే బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌తో చర్చలు జరిపినట్లు చంద్రబాబు వివరించారు.

శుక్రవారం డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో సమావేశం కానున్నట్లు ప్రకటించారు. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరం ఉందని జేడీఎస్‌ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ అన్నారు. దీనికోసం దేశంలోని లౌకికవాద పార్టీలన్నీ ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. బీజేపీయేతర కూటమిపై చంద్రబాబుతో చర్చలు జరిపామని.. కూటమి ఏర్పాటులో కాంగ్రెస్‌ కూడా తమతో కలిసివస్తోందని దేవెగౌడ అన్నారు. కూటమి బలోపేతం కోసం మిగతా పార్టీలతో చర్చలు జరపాలని చంద్రబాబుని కోరినట్లు ఆయన వివరించారు. టీడీపీ – జేడీఎస్‌ పాతమిత్రులేనని కుమారస్వామి వ్యాఖ్యానించారు. లౌకికవాద శక్తులను ఏకం చేసే విషయంపై చర్చించినట్లు ఆయన తెలిపారు. కూటమి ఏర్పాటులో దేవెగౌడ, చంద్రబాబు వ్యూహాలు బాగున్నాయని కుమారస్వామి ప్రశంసించారు. ఇప్పటికే కాంగ్రెస్ తో పొత్తులో ఉన్న జేడీఎస్… ఇంత కన్నభిన్నమైన స్పందన వ్యక్తం చేస్తుందని ఎవరూ ఊహించలేదు. దానికి తగ్గట్లుగానే.. వారు కూడా.. కూటమిలో భాగస్వాములవుతామని ప్రకటించారు.

Copy Protected by Chetan's WP-Copyprotect.