ఈసారి రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ వచ్చే అసెంబ్లీ సీటు ఏది? ఎవరికి? సర్వేలు ఏం చెబుతున్నాయి?

ఒకప్పుడు పులివెందులలో వైఎస్‌ ఫ్యామిలీకి ఏపీలో అత్యధిక మెజార్టీ వచ్చేది. కానీ ఈసారి కుప్పంలో సీఎం చంద్రబాబు ఏపీలో అన్ని రికార్డులు బ్రేక్ చేస్తారని కుప్పం నియోజకవర్గంలో తిరిగిన సమయంలో పలువురికి కలిగిన అనుభవం, అనుభూతి. రాష్ట్రంలో వీస్తున్న చంద్రబాబు వేవ్‌ ఒక కారణం, వైసీపీలో బలమైన నేతలు అందరూ అక్కడ టీడీపీలో చేరటం రెండో కారణం, కనీవిని ఎరుగని విధంగా ప్రతి విలేజ్‌ను అభివృద్ధి చేయటం మూడో కారణం. ఇవన్నీ రికార్డు స్థాయిలో మెజార్టీని ఇస్తాయని సర్వేలు చెబుతున్నాయి.

కుప్పం నియోజకవర్గంలో ఎవరూ ఊహించని స్థాయిలో అభివృద్ధి జరిగింది. వివిధ అభివృద్ధ్ది, సంక్షేమ పథకాలు పతాక స్థాయిలో ప్రారంభమై కొనసాగాయి. ఏకంగా రూ.2500 కోట్ల విలువ కలిగిన అభివృద్ధి పనులు జరిగాయంటే అతిశయోక్తి కానేకాదు.. పచ్చి నిజం. వివిధ ప్రభుత్వ శాఖల వారీగా ఆ వివరాలు. వ్యవసాయశాఖ, ఇతర అనుబంధ శాఖలు: చిన్న, సన్నకారు రైతులకోసం ప్రవేవపెట్టిన రైతు రథం పథకం కింద నియోజకవర్గంలో రూ.2.78 కోట్లు వ్యయం చేశారు. మొత్తం 139 మంది రైతులకు సబ్సిడీతో ట్రాక్టర్లు అందించారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద రూ.1,23,90,000లతో ఓసీ, బీసీలకు 50 శాతం సబ్సిడీతో, ఎస్సీ, ఎస్టీలకు 70 శాతం సబ్సిడీతో వ్యవసాయ పనిముట్లు అందించారు. రైతు రుణమాఫీకోసం రూ.56.41 కోట్లు విడుదలయ్యాయి. ఉదాయన శాఖ ద్వారా రూ.3,15,50,000 నిధులతో హరిత గృహాల నిర్మాణం జరిగింది. పట్టుపరిశ్రమ శాఖ ద్వారా ఉద్దీపనాభివృద్ధి పథకం కింద రైతులకు రూ.3,46,66,000 నిధులు విడుదలయ్యాయి.పశు సంవర్థక శాఖ ద్వారా 24,800ల మంది రైతులకు పాడి ఆవులను పంపిణీ చేశారు. ఇవిగాక చూడి తరుపులను మరో 250 మందికి పంపిణీ చేశారు. 5,032 మంది రైతులకు గొర్రెల పంపిణీ జరిగింది. మనకోడి పథకం కింద 3,650 మంది రైతులు లబ్ధి పొందారు. సూక్ష్మనీటి పారుదల శాఖ పథకం ద్వారా రూ.83.35 కోట్లతో డ్రిప్‌, స్ర్పింకర్లను సబ్సిడీ కింద పంపిణీ చేసి 32,260 హెక్టార్లను సాగులోకి తెచ్చారు. ఉపాధి హామీ పథకం: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రూ.169.12 కోట్ల నిధులు వ్యయం చేశారు. 2018-2019లో 20115 మంది కుటుంబాలకు 55,633 ఉపాధి కార్డుల ద్రాఆ 11,42,327 పనిదినాలు కల్పించారు. మొత్తం 12.05 లక్షల ఘనపు మీటర్ల భూమిలో 16,051 పంట సంజీవిని కుంటలు మంజూరై, అందులో 11,831 పనులు పూర్తయ్యాయి. వీటిద్వారా 120.05 కోట్ల లీటర్ల నీటిని నిల్వ చేయగలిగారు. దాదాపు ప్రతి పంచాయతీ కేంద్రంలో ఘన వ్యర్థాల నిర్వహణ ప్లాంటులు మంజూరై, కొన్ని మాత్రం పూర్తయ్యాయి. శ్మశానాలను అభివృద్ధి పరిచారు.

వెలుగు: నియోజకవర్గంలోని అర్హులైన 300077 మందికి పింఛన్లు మంజూరు చేశారు. 4578 మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా రూ.461.81 కోట్లు పంపిణీ చేశారు. పసుపు-కుంకుమ పథకం కింద 45,226 మంది సభ్యులకు రూ.45.22 కోట్ల నిధులను చెక్కుల రూపంలో అందించారు. చంద్రన్న బీమా, పెళ్లికానుక పథకాలు ఉండనే ఉన్నాయి. జలవనరుల శాఖ: ఈ శాఖ ద్వారా రూ.129,57,00,000 నిధుల వ్యయంతో నీరు – చెట్టు పథకం కింద చెరువుల్లో పూడిక తీయడమే కాక, పటిష్ఠం చేశారు. పంట కాలువల పనులు చేపట్టారు. మరో రూ.11.50 కోట్లతో వాటర్‌షెడ్లను నిర్మించారు. గ్రామీణ నీటి సరఫరా శాఖ: ఈ శాఖ ద్వారా రూ.1595.77 లక్షలతో ఎన్టీఆర్‌ సుజల పథకాన్ని అమలు చేస్తున్నారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాలలోగల 533 ఆవాసాలకు క్లస్టర్‌ ఆధారిత విధానంలో 15 నీటిశుద్ధి ప్టాంట్లు ఏర్పాటు చేసి ప్రజలకు రూ.2 లకే ఒక లీటరు వంతున శుద్ధ జలాన్ని అందిస్తున్నారు.హంద్రీ-నీవా: హంద్రీ-నీవా కుప్పం ఉపకాలువ తవ్వకం పనుల ద్వారా కృష్ణా జలాలను నియోజకవర్గానికి తీసుకొచ్చే పనులు శరవేగంగా జరుగుతున్నాయి.మరో నెల రోజుల్లో ఈ జలాలు కుప్పం చేరుకోనున్నాయి. దీనికోసం ఏకంగా రూ.500 కోట్లు వ్యయం చేస్తున్నారు. ఈ జలాలు కుప్పం వస్తే సాగు, తాగునీటి అవసరాలు పూర్తిగా తీరుతాయి.సీసీరోడ్లు: పంచాయతీరాజ్‌ శాఖ ద్వారా కుప్పం నియోజకవర్గంలో సిమెంటు రోడ్ల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఒక్క సీసీ రోడ్లకోసమే వివిధ మార్గాల ద్వారా ఏకంగా రూ.450 కోట్లనుచి రూ.500ల కోట్ల దాకా వ్యయం చేశారు. పౌర సరఫాల శాఖ: ఈ శాఖ ద్వారా అర్హులైనవారికి సుమారు 15 వేల రేషన్‌కార్డులు పంపిణీ చేశారు. రోడ్లు, భవనాల శాఖ: నియోజకవర్గంలో పెద్దయెత్తున నూతన భవన నిర్మాణాలు, రోడ్ల నిర్మాణాలు జరిగాయి. రూ.17.60 కోట్ల న్యాక్‌ భవనాన్ని నిర్మించారు. కుప్పం నుంచి విజలాపురం వెళ్లే మార్గంలో పాలారు నదిపై రూ.4.20 కోట్లతో హైలెవల్‌ బ్రిడ్జి నిర్మించారు. రూ.7 కోట్ల వ్యయంతో పట్టణం నడిబొడ్డున గల ప్రధానమైన నేతాజీరోడ్డును కొంతమేర విస్తరించారు. మరో రూ.406.52 కోట్లతో నియోజకవర్గంలోని మరికొన్ని ప్రధాన రహదారుల విస్తరణ జరిగింది.నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ప్రభుత్వ కళాశాలలు, అదనపు గదులు, అంగన్వాడీ భవనాలు, పీహెచ్‌సీ, కుప్పం వ్యవసాయ మార్కెట్టు యార్డు లు తదితర భవనాల నిర్మాణం జోరుగా రూ.కోట్ల వ్యయంతో సాగింది. హార్ట్టికల్చర్‌ హబ్‌: ఉద్యాన పంటల ఉత్పత్తిలో అత్యాధునిక సాంకేతిక పద్ధతుల అమలు, మేలైన నూతన వంగడాల సృష్టికోసం కుప్పం మండలం పెద్దబంగారునత్తం పంచాయతీ పరిధిలో రూ.9.37 కోట్ల వ్యయంతో హార్టీకల్చర్‌ హబ్‌ను నిర్మించారు. ఇక్కడ 10 ఎకరాల విస్తీర్ణంలో పాలి హౌస్‌లు, శీతలీకరణ గిడ్డంగులు, ప్యాకింగ్‌ హౌస్‌ వంటి వాటి ద్వారా రైతులు తమ పంట ఉత్పత్తులను ప్రభుత్వం, ప్రైవేటు ఆధ్వర్యంలో నిర్వహించుకునే వెసలుబాటు లభిస్తుంది. రైతులకు నిరంతర శిక్షణ ఇవ్వడం ద్వారా వారిని ఆర్థికంగా ఉన్నతికి చేర్చడానికి ఈ హబ్‌ దోహదపడుతుంది. ఎయిర్‌ స్ట్రిప్‌: నియోజకవర్గంలోని రామకుప్పం, శాతిపురం మండలాల సరిహద్దుల్లో ఎయిర్‌ స్ట్రిప్‌ నిర్మాణానికి 635.35 ఎకరాల భూమిని సేకరించారు.

రూ.1970.12 కోట్ల అంచనా వ్యయంతో ఎయిర్‌ స్ట్రిప్‌ నిర్మాణానికి ఈ ఏడాది ఫిబ్రవరి నెలలోముఖ్యమంత్రి చంద్రబాబు భూమిపూజ చేశారు. నిర్మాణం పూర్తైతే కుప్పం ప్రాంత ప్రజల పంట ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్టులో మెరుగైన ధరలకు విక్రయించడానికి అవకాశం చిక్కుతుంది. ఇదీ ప్రధాన సమస్య: కుప్పం నియోజకవర్గం రహదారులు, భవనాలతోపాటు ఇతర రంగాలలో ఎంతో అభివృద్ది చెందినా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మాత్రం మెరుగు పడడంలేదు. బెంగళూరుకు నిత్యం వేలాదిగా యువతీయువకులు ఉపాదికోసం వలసలు పోవాల్సి వస్తోంది. పారిశ్రామిక వాడ ఉన్నది కానీ.. అక్కడున్నవి అతి కొద్దిమందికి ఉపాధి కల్పించే చిన్నస్థాయి పరిశ్రమలు మాత్రమే. అంతర్జాతీయ స్థాయి లేదా దేశీయ స్థాయి కార్పొరేట్‌ కంపెనీలు, ఇరత్రా పరిశ్రమలు వస్తేనే యువతకు నిజమైన ఉపాధి లభిస్తుంది. ఇక తాగు, సాగునీటి వనరలు కూడా చాలా పరిమితంగానే ఉన్నాయి. హంద్రీ-నీవా కాలువను త్వరితగతిన పూర్తి చేసి కృష్ణాజలాలను తీసుకొచ్చి చెరువులు నింపితే తప్ప ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకదు.

Copy Protected by Chetan's WP-Copyprotect.