మహా కూటమికి గ్రాఫ్ రోజురోజుకు పెరుగుతోంది!

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్)లో టెన్షన్ పెరుగు తుందా? అంటే ఔననే సమాధానం వస్తోంది. దీనికి ప్రధాన కారణం మహా కూటమికి ప్రజలలో రోజురోజుకు మద్దతు పెరగడం, టీఆర్‌ఎస్‌కుకు పాజిటివ్ ఓటు దక్కే అవకాశం లేకపోవదమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. 119 స్థానాలు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో 12 నుంచి 15 సీట్లలో పోటీ చేసే తెలు గుదేశం పార్టీ మహాకూటమి అధికారంలోకి వస్తే హోం, నీటి పారుదల శాఖ అడుగుతుందని ఆపద్ధర్మ ప్రభుత్వంలోని మంత్రి హరీష్ రావు ప్రకటించటం వెనక ఇదే కోణం కన్పి స్తోంది.

అసలు ఇంత వరకూ టీడీపీ కానీ, టీజెఎస్ కు కానీ, సీపీఐ కి గాని, ఇచ్చే సీట్ల సంఖ్య ఎంతో కూడా తేలలేదు. మహా కూటమి అధికారంలోకి వస్తే టీడీపీ జాతీయ నాయకులు, ఆం ధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు చక్రం తిప్పు తాడని, ప్రతి దానికి ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొ ట్టాలని ప్రచారం చేయడం ద్వారా టీఆర్‌ఎస్ నేతలే పరోక్షంగా కూటమికే ఛాన్స్ ఉందనే సంకేతాలు ఇస్తున్నారని ఈ విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికి తోడు, దాదాపు ప్రతి నియోజక వర్గంలో నూ, ప్రతి రోజు టీఆర్‌ఎస్ అభ్యర్థులకు ప్రజలనుండి ప్రతిఘటనలే ఎదురౌతున్నాయి. ఎన్నికల ప్రచారానికి వెళ్లాలంటేనే కొందరు టీఆ ర్‌ఎస్ అభ్యర్థులు భయ పడుతున్నారనే వాదనలు కూడా కొన్ని చోట్ల వినబడడం గమనార్హం. ఇక టీఆర్‌ఎస్ పార్టీ లో కూడా లుకలుకలు మొదలయ్యాయని మంత్రి కేటీఆర్‌కు, పార్టీ లోని మరికొందరు అతి ముఖ్య నాయకులకు ఇటీవల గ్యాప్ బాగా పెరిగిందని, ఇది కూడా పార్టీ గెలుపోటములపై ప్రభా వం చూపనుందని కూడా వార్తలు వస్తున్నాయి. అధికారంలో ఉన్న నాలుగున్నర సంవత్స రాల్లో ఏ రోజూ ప్రతిపక్షాలు చెప్పిన మాటలను ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రస్తుతం ఉన్న సచివాలయం పడగొట్టి, దానిని వేరే ప్రదేశానికి మారుస్తామని టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రకటించి నప్పుడు, ప్రతిపక్షాలు ఎందుకని నిలదీస్తే ప్రజలు మాకు తీర్పిచ్చారు మా ఇష్టం అని ప్రస్తుత ఆపద్ధర్మ ముఖ్య మంత్రి కెసీఆర్ అసెంబ్లీ సాక్షిగా సమాధానం ఇచ్చారు.

కానీ ఇప్పుడు ప్రతిపక్షాలు అనుక్షణం పాలనకు అడ్డుపడటం వల్లే ముం దస్తుకు వెళుతున్నామని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. సాగునీటి శాఖలో అవినీతిపై తీవ్ర విమర్శలు వచ్చినా సర్కారు ఏకపక్ష పవర్ పాయింట్ ప్రజంటేషన్ తో సమాధానం ఇచ్చిందే కానీ, అదే అవకాశం విపక్షాలు కోరితే నో ఛాన్స్ అని తేల్చేసింది. ఈ విషయాలను ప్రజలు అంతగా నమ్మే పరిస్థితి కూడా కనబడం లేదు. ప్రతి అంశంలోనూ ప్రతిపక్షా లను బుల్డోజ్ చేసిన టీఆర్‌ఎస్ నేతలు ఇఫ్పుడు ఎన్నికలకు ప్రతిపక్షాలే కారణం అన్నట్లు వ్యాఖ్యానిం చటం చూస్తుంటే ఆ పార్టీ నేతల్లో రోజురోజుకు టెన్షన్ పెరిగి పోతున్నట్లు కన్పిస్తోందనే వ్యాఖ్యలు అంతటా విన్పిస్తున్నాయి. కొద్దీ రోజుల క్రితమే వంద సీట్ల జపం చేసిన టీఆర్‌ఎస్ నాయ కులు, ప్రస్తుత పరి స్థితులు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా వున్నాయని అదే పార్టీ నేతలే అంగీకరించడం గమనార్హం. అధికార పార్టీ నుంచి సాగుతున్న వలసలు, ఇతర పార్టీలనుండి టీఆర్‌ఎస్ లోకి వస్తారన్న వారు ఎక్కడి వారు అక్కడే ఆగిపోవడం లాంటి విషయాలు కూడా ఆ పార్టీ నేతలను ఆత్మరక్షణలో పడేస్తు న్నా యని, మహా కూటమి అధికారంలోకి రావడం తధ్యమనే విషయం టీఆర్‌ఎస్ నాయ కులకు కూడా అర్ధమ యిందని విశ్లేషకుల వాదన.

Copy Protected by Chetan's WP-Copyprotect.