మరీ నన్ను అలా కామెంట్‌ చేస్తారా అని నిత్యా ఆవేదన!

కొంతమంది నెటిజన్లలో సంస్కారం లోపిస్తోంది. నటీమణులపై వారి వికృత వ్యాఖ్యలు పెచ్చు మీరుతున్నాయి. చాలామంది నాయకులపై కూడా విమర్శలు శృతి మించుతున్నాయి. సినిమా వాళ్లను వారి నటనలో లోపాలు చెప్పవచ్చు కానీ వ్యక్తిగతంగా శరీరాకృతిపై విమర్శలు చేయటం కుసంస్కారానికి నిదర్శనం. అలాగే నాయకుల తీరు, వారి అవకాశవాదాన్ని ఎత్తి చూపవచ్చు కానీ వారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయటం నూటికి నూరు శాతం తప్పు. అది ఏ పార్టీ అభిమానులు చేసినా కూడా క్షమార్హం కాదు.తాజాగా మరో నటి తన బాధను పంచుకున్నారు. ఒకప్పుడు జర్నలిస్టు కూడా అయిన ఆమె తన ఆవేదనను అక్షర రూపంలోనే వ్యక్తం చేసింది. ప్రతిభావంతమైన నటిగా గుర్తింపు తెచ్చుకున్న మలయాళ భామ నిత్యా మీనన్ ఇటీవల బాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది.

అక్షయ్ కుమార్ హీరోగా నటించిన `మిషన్ మంగళ్` సినిమాలో నిత్య నటించింది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా తన శరీరాకృతి గురించి, సోషల్ మీడియాలో తనపై వస్తున్న ట్రోలింగ్ గురించి స్పందించింది. `లావుగా కనిపించే వారి గురించి చాలా మంది చులకనగా మాట్లాడుతుంటారు. బద్ధకం వల్ల, తిని కూర్చోవడం వల్ల లావైపోయారని అనుకుంటారు. అది పూర్తి నిజం కాదు. తిని కూర్చుని లావయ్యే వారు కూడా ఉంటారు. కానీ, నటుల విషయంలో అలా అనుకోవడం కరెక్ట్ కాదు. హార్మోన్ల ప్రభావం వల్ల కూడా బరువు పెరుగుతుంది. నా శరీర ఆకృతి గురించి సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లు నన్ను చాలా బాధ పెడతాయ`ని నిత్య చెప్పింది.నిత్యా మేనన్‌ ఒక భారతీయ సినీ నటి మరియు గాయని. పలు విజయవంతమైన తెలుగు చిత్రాలతో బాటు కన్నడ, తమిళ మరియు మలయాళ భాషలలో నటించింది. ఈమె మంచి గాయని కూడా. పలు చిత్రాలలో పాటలు కూడా పాడింది. ఈమె బెంగుళూరు స్థిరపడిన మలయాళ కుటుంబంలో 1988, ఏప్రిల్ 8 న జన్మించింది. మణిపాల్ విద్యాసంస్థలలో పాత్రికేయ విద్యను అభ్యసించింది. నటిని అవుతానని ఆమె ఎప్పుడూ ఊహించలేదు. మంచి పాత్రికేయురాలు కావాలనుకునేది. ఆమెకు వన్యప్రాణి ఫొటోగ్రఫీ అంటే కూడా ఆసక్తి. అలా మొదలైంది సినిమా ద్వారా కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది. అంతకు మునుపే బాలనటిగా ఓ ఇంగ్లిష్ సినిమాలో టబుకు చెల్లిగా నటించింది. మోహన్‌లాల్‌తో కూడా ఒక సినిమాలో నటించింది. మాతృభాష మలయాళం. కానీ, వేరే భాషలు నేర్చుకోవాలన్న ఆసక్తి, ఇష్టం ఈమెకి కాస్త ఎక్కువే. అందుకే తొలి సినిమా అలా మొదలైందిలోనే నటనతో పాటుతన గాత్రాన్ని కూడా వినిపించింది. ఏదో అనుకుంటే.. ఇంకేదో అయ్యిందే.., అబ్బబ్బో.. అబ్బో.. అంటూ పాడిన రెండు పాటలు విజయవంతం అయ్యాయి. తెలుగు సినిమాలతో పాటు, అటు మలయాళ సినిమాల్లోనూ నటిస్తోంది నిత్య. అక్కడ కూడా పాటలు పాడుతూ ఒక పాటకు నృత్యదర్శకత్వం కూడా చేసింది. అలా మొదలైంది తర్వాత సెగ, 180 వంటి చిత్రాలు చేసినా అవి బాక్సాఫీసు వద్ద వూహించినంతగా ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి.

కానీ తర్వాత వచ్చిన ఇష్క్ మాత్రం మంచి హిట్‌గా నిలిచింది. మళ్లీ నితిన్‌తో జతకట్టిన గుండెజారి గల్లంతయ్యిందే సినిమాకి కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో ఈ జంట విజయవంతమైన హిట్ పెయిర్ గా నిలిచింది. జబర్దస్త్, ఒక్కడినే చిత్రాల్లో నటనకుగాను మంచి మార్కులే సొంతం చేసుకుంది నిత్య. ఏమిటో ఈ మాయ, మాలిని 22 అనే తెలుగు చిత్రాలతో పాటు, రెండు తమిళ సినిమాల్లో కూడా నటించింది.

Copy Protected by Chetan's WP-Copyprotect.