మోడీ దగ్గర గాలికి పలుకుబడి ఉంది! అందుకే ఈడీ కేసు మాఫీ చేయిస్తాన్నాడు!

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ కేసుల్లో ఉన్న ఒక నిందితుడిని ఆ కేసుల నుంచి తప్పిస్తానని హామీ ఇచ్చింది ఎవరో తెలుసా? ఆల్‌రెడీ సీబీఐ, ఈడీ కేసుల్లో ఉన్న మరో నిందితుడైన గాలి జనార్థనరెడ్డి ఆ హామీ ఇచ్చాడు. సీబీఐ, ఈడీలు గాలి కేసులను గాలికి వదిలేయబట్టి అతను తన లాగే ఇతరులను కూడా కేసుల నుంచి తప్పిస్తానని హామీ ఇస్తున్నాడు. అసలు సీబీఐ, ఈడీ అనేవి ప్రధాని కార్యాలయం పర్యవేక్షణలో ఉంటాయి.

ప్రధాని మోడీ వద్ద జగన్, విజయసాయికి అత్యంత సన్నిహితుడు అయిన గాలికి ఉన్న పలుకుబడి వలనే ఇంతగా బరి తెగించాడని ప్రజలు భావిస్తున్నారు. ఈడీ అధికారికి కోటి రూపాయలు గాలి జనార్దనరెడ్డి ఇప్పటికే అందచేశాడని ప్రూవ్ అయింది. మోడీ హయాంలో దర్యాప్తు సంస్థలు ఎంతగా బ్రష్టు పట్టాయో ఇది మరో ఉదాహరణ. ఇది బయటకు రావటంతోమైనింగ్ కింగ్ గాలి జనార్ధన్‌రెడ్డి ఉన్నట్టుండి కనిపించకుండా అజ్ఞాతంలోకి పోయాడు. దాదాపు రూ. 600 కోట్ల ‘అంబిడెంట్’ కంపెనీ స్కామ్‌ కేసులో జనార్ధన్‌రెడ్డి పేరు ఉన్నట్లు వార్తలు రావడంతో ఆయన కనిపించకుండా పోయారని అనుకుంటున్నారు. అయితే గాలి జనార్ధన్‌రెడ్డి కనిపించకుండా పోవడం వెనుక ఏం జరిగిందనే విషయంపై ఓ ఆంగ్లమీడియా కథనం ప్రచురించింది. అందులోని ప్రధానాంశాలు..స్కామ్ ఎలా జరిగిందంటే..సయ్యద్ ఫరీద్ అనే వ్యక్తి బెంగళూరులో ‘అంబిడెంట్’ పేరుతో మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని స్థాపించాడు. అధిక లాభాల ఆశ చూపి జనం నుంచి దాదాపు రూ. 600 కోట్ల దాకా వసూలు చేశాడు.

బాధితుల ఫిర్యాదుతో 2017లో అతడి కంపెనీపై సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసు స్టేషన్‌లో 21 కేసులు నమోదయ్యాయి. దీంతో సిటీ పోలీసులు ఫరీద్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రజలను మోసం చేసిన అంబిడెంట్ కంపెనీపై ఐటీ, ఈడీ ఏకకాలంలో దాడులు చేశాయి. ఫరీద్‌కు సంబంధించిన మొత్తం ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఈడీ కేసు నుంచి తప్పించుకునేందుకు…తన కంపెనీపై నమోదైన ఈడీ కేసుల నుంచి బయట పడేందుకు గాలి జనార్ధన్‌రెడ్డి ముఖ్య అనుచరుడైన మెహ్‌పుజ్ అలీఖాన్‌ను ఫరీద్ సంప్రదించాడు. ఈ ఏడాది మార్చిలో తన కుమారుడు అశ్ఫక్‌తో కలిసి బెంగళూరులోని తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్‌లో గాలిజనార్ధన్‌రెడ్డితో ఫరీద్ భేటీ అయ్యాడు. ఈడీ కేసులను సెటిల్ చేయడానికి మొత్తం రూ. 20 కోట్లకు డీల్ కుదుర్చుకున్నాడు. అందులో భాగంగా రూ. 2 కోట్లను నగదు రూపంలో ఇచ్చి, మిగతా రూ. 18 కోట్లను బంగారం రూపంలో ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందం ప్రకారం నగదు, బంగారు కడ్డీలను అలీఖాన్‌కు బళ్లారిలో అప్పగించారు. అదీ గాలి బరితెగింపు. జీవీఎల్ వంటి కుహనా మేథావులు దీనిపై మాట్లాడాలి.

Copy Protected by Chetan's WP-Copyprotect.