వైఎస్ ప్రాణమిత్రుడిని నాకే జగన్ అర్థం కాలేదు!

వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి సాయిప్రతాప్‌ ఎంత ప్రాణమిత్రుడో ఈ సంఘటన చదివితే తెలుస్తుంది. ఒకసారి మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహరావు రాజంపేట ఎంపీ సాయిప్రతాప్‌కి ఫోన్‌ చేసి ఢిల్లీలో తన నివాసానికి అల్పాహార విందుకు పిలిచారు. ప్రధాని నివాసానికి వెళ్లిన సాయి ప్రతాప్‌ పీవీ గారితో టిఫిన్‌ చేస్తుండగా. ‘ఆ మీసాల వాడిని వదిలెయ్యి (వైఎస్‌). నిన్ను కేంద్ర కేబినెట్‌లోకి తీసుకుంటా’ అని పీవీ నరసింహరావు గారు సాయి ప్రతాప్‌తో అన్నారు.

‘‘ఐదు నిమిషాల ముందు ఈ మాట అని ఉంటే, ఈ పదార్థాలను ముట్టేవాడిని కాదు’’ అని సాయిప్రతాప్‌ బయటకు వచ్చేశారు. అది వైఎస్‌తో ఆయనకి ఉన్న స్నేహం . టీడీపీలో చేరకుండా తన మిత్రుడి పుత్రుడు పెట్టిన పార్టీ వైపు వెళ్లటం కోసం వాళ్లు రమ్మనకపోయినా వైఎస్‌పై ప్రేమతో ఆయన చాలా ప్రయత్నం చేశారు. ‘‘నేనంటే నీకు అయిష్టత ఉండొచ్చు. కానీ నా అల్లుడు నీ వెంట నడుస్తాడు’’ అన్నా జగన్‌ స్పందించలేదని సాయిప్రతాప్‌ ఆవేదన చెందారు అప్పట్లో. రాజశేఖరరెడ్డితో సన్నిహితంగా ఉన్న వారందరినీ దూరం పెట్టినట్లు భావించారు. కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నప్పుడు జగన్‌ని విమర్శించనిదే డయాస్‌ మీదకి రావద్దని బొత్స చాలా కఠినంగా అన్నారు. సోనియా గాంధీకీ ఫిర్యాదు చేశారు. సాయి ప్రతాప్‌ శాఖను స్టీల్‌ నుంచి హెవీ ఇండస్ట్రీస్‌కు కూడా మార్చారు. ఆ ఎలక్షన్స్‌ తర్వాత ఆ పదవీ ఊడపీకారు. అయినా జగన్‌కి కృతజ్ఞత లేదు.

కులగజ్జితోనో, మరే ఇతర ఇన్‌ఫెక్షన్‌తోనో జగన్‌కి సపోర్టు చేసే వాళ్లు ఇది చదవండి. మాజీ కేంద్రమంత్రి, కడప జిల్లా రాజంపేట వాసి సాయిప్రతాప్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి ఎంత ప్రాణమిత్రుడు అంటే ఈ ఉదాహరణ చదవితే తెలుస్తుంది. వైఎస్‌ ఫ్యామిలీ అంటే జీవితాన్ని పెట్టే వాడు. అలాంటి వ్యక్తి కూడా జగన్‌కి దూరంగా టీడీపీలో చేరాడు అంటే అర్థం చేసుకోండి జగన్‌ మెంటాలిటీ ఏమిటో? ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని.. ఆయన తండ్రి, దివంగత వైఎస్ రాజశేఖర్‌ రెడ్డికి సన్నిహితంగా ఉన్న వారే ఎక్కువగా ముంచుతున్నారని చెప్పవచ్చు. ఇందుకు జగన్ వైఖరి కూడా కారణమనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. టిడిపి చేతిలో ఓడిపోయిన పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా జగన్ అహంకార ధోరణి వల్లే ఓటమి చెందామని అంటున్నారు. ఇప్పుడు టీడీపీలోకి వెళ్తున్న నేతలంతా ఒకప్పుడు జగన్ కు సన్నిహితంగా మెలిగినవారే. కాకపోతే జగన్ ధోరణివల్లే వారంతా పార్టీలు మారుతున్నారు. ఇంకా ఆ పార్టీలో కొనసాగుతున్న నేతల్లో కూడా అసంతృప్తి ఉన్నా గత్యంత్రం లేక పార్టీలో కొనసాగుతున్నారు.

Copy Protected by Chetan's WP-Copyprotect.