జగన్-పవన్ భేటి జరిగింది.. పవన్‌కు ఆఫర్ ఏంటి?

వైసీపీ బాస్ జగన్ – జనసేన చీఫ్‌ పవన్ మధ్య భేటి జరిగిందా? ఎప్పుడు? ఎక్కడ? అసలు లోపలేం జరిగింది? అనే ఆసక్తికరం అయిన విషయాలను ఏపీలో దళితుల్లో ప్రముఖ నాయకుడు ఒకరు బయట పెట్టారు. ప్రతిపక్ష నేత జగన్‌, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఇటీవల విశాఖ పట్నంలో వట్టి రవి ఇంట్లో కలిశారని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ రాష్ట్ర చైర్మన్‌ కారెం శివాజీ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

‘విశాఖపట్నం జిల్లాలో పాదయాత్ర జరిగిన సమయంలో జగన్మోహనరెడ్డి పవన్‌ను కలిసి 40 సీట్లు ఆఫర్‌ చేశారు. అయితే సీఎం సీటుపై పవన్‌ కల్యాణ్‌ దృష్టి పెట్టడం వల్ల సీట్లు సర్దుబాటు కాక బయటకు వచ్చినట్టు తెలిసింది. కులం, మతం పునాదులపై వారు అధికారంలోకి రాలేరు. ప్రధాని మోదీ చెప్పినట్టుగా ఆడుతూ ఆంధ్ర ప్రజలను మోసగించేందుకు ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కేంద్ర ప్రభుత్వం ఏపీని నమ్మించి దగా చేసింది. అధికారంలోకి వస్తే విభజన హామీలను నెరవేర్చి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పడంతో రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు కాంగ్రె్‌సతో కలిసి ఒక బలమైన కూటమి ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చారు. దానిని చూసి ఓర్వలేక కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారు’’ అని కారెం మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం రంగు మారుతోంది. పవన్ కల్యాణ్ ఇటీవలి కాలంలో.. జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు తగ్గించారు. కానీ.. తాము ఎవరితో పొత్తు పెట్టుకోబోమని.. ఒంటరిగా పోటీ చేస్తామని చెబుతున్నారు.

అయితే.. తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం.. జగన్‌తో కలిసి… పవన్ కల్యాణ్ పోటీ చేస్తారని.. వారి వెనుక బీజేపీ ఉందని… ప్రచారం చేస్తున్నారు. ఏపీలో పవన్, జగన్ మధ్య పొత్తు ఉంటుందా లేదా అన్నది .. ఇప్పుడు ఓ పెద్ద హాట్ టాపిక్ అయింది. జగన్, పవన్ ఈ ఇద్దరూ కలవాలని తెర వెనక ఎన్నో శక్తులు గట్టిగానే పనిచేస్తున్నాయి. బీజేపీ ఏపీలో బాబు ఓటమి కోరుకుంటోంది. జగన్, పవన్ వేరుగా పోటీ చేస్తే బాబు మళ్ళీ వచ్చినా రావచ్చును. అందువల్ల ఓట్లు చీలకుండా ఉండేందుకు ఈ ఇద్దరినీ కలిపేందుకు గట్టిగానే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. అటు వైసీపీలోను, ఇటు జనసేనలోనూ కూడా రెండు పార్టీలను కలిపేందుకు కొంతమంది ట్రై చేస్తున్నారట. అంతేనా తెలంగాణా సీఎం కేసీయార్ కూడా రంగంలోకి దిగుతున్నారట. ఇక బీజేపీలోని కొన్ని పెద్ద తలకాయలు జోక్యం చేసుకుంటున్నాయట.పవన్ కళ్యాణ్ జనసేనతో చేతులు కలపాలని వైసీపీకి చెందిన ఓ సినీ నిర్మాత గట్టిగా చెబుతున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం.

Copy Protected by Chetan's WP-Copyprotect.