రఘువీరాతో జగన్‌ గురించి రాహుల్ కామెంట్ అదిరింది!

ఏపీ కాంగ్రెస్ లీడర్లు ఢిల్లీకి పోయినప్పుడు తమ పార్టీ మాజీ సీఎం కుమారుడు జగన్‌ గురించి టాపిక్ వచ్చింది. బీజేపీతో జగన్ ఫ్రెండ్ షిప్‌ గురించి రఘువీరా రాహుల్‌కి వివరించారట. దానిపై రాహూల్‌ మాట్లాడుతూ తాను అసలు జగన్‌ అంత తెలివి తక్కువ నిర్ణయం తీసుకుంటాడు అని ఊహించలేదని అన్నారట. వైఎస్ జగన్ చేజేతులారా.. టీడీపీకి మరల సులువుగా గెలిచే అవకాశం ఇస్తున్నారు అని కామెంట్ చేశారని ఆ మీటింగ్‌లో పాల్గొన్న వారి ద్వారా తెలిసింది.

వైసీపీ – బీజేపీ ఒక్కటేనని… ఏపీలో మెజార్టీ ప్రజలు నమ్ముతున్నారు. ఇదంతా జగన్ చేసుకున్న స్వయంకృతమే అని రఘువీరా కొన్ని ఉదాహరణలు చెప్పారట. తనపై ఉన్న ఈడీ, సీబీఐ కేసులు బీజేపీని కాదంటే.. మళ్లీ ఊపందుకునే అవకాశం ఉంది. అదే భయంతో జగన్ ఉన్నాడని తనకి కొంతమంది వైసీపీ లీడర్లు చెప్పారని రఘువీరా రాహుల్ వద్ద ప్రస్తావన చేసినట్టు సమాచారం. లక్ష కోట్ల రూపాయాలు అప్పట్లోనే సంపాదించాడనేది అందరికీ తెలిసిందే. లక్ష కోట్లు అనగానే జగనే గుర్తొస్తాడు. కాసులకు, కేసులకు జగన్ బ్రాండ్ అంబాసీడర్. ఏపీకి మోడీ ఇంత అన్యాయం చేస్తున్నా సరే జగన్ బీజేపీకి వ్యతిరేకంగా స్టాండ్ తీసుకోకపోవడానికి కారణం అదే అనుకోవచ్చు. అందుకే వైసీపీ అధినేత.. చంద్రబాబును విమర్శిస్తున్నారు కానీ..నరేంద్ర మోదీని ఒక్క మాట కూడా అనడం లేదు. మిత్రపక్ష పార్టీగా, ముఖ్యమంత్రి హోదాలో ప్రధానమంత్రి అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించినా నెలల తరబడి సాధ్యం కాలేదు కానీ.. జగన్, విజయసాయిరెడ్డి… పదే పదే ప్రధాని అపాయింట్‌మెంట్లు పొందగలిగారు.

అంటే కచ్చితంగా రెండు పార్టీల మధ్య సంబంధం ఉన్నట్లే. అయితే వచ్చే ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంటాయనే వాతావరణమే ఇప్పుడు కనిపిస్తోంది. ఢిల్లీ వర్గాలు కూడా అవే చెబుతున్నాయి. నేరుగా సహకరించుకుంటాయా… పరోక్షంగా సహకరించుకుంటాయా అన్నది.. ఎన్నికల సమయంలో తేలొచ్చు. జగన్‌ బలహీనతలు అయిన కాసులు, కేసులు వలనే మోడీకి సరెండర్ అయిపోయాడు జగన్‌. ఇప్పుడు జగన్ కు మోడీ భయం వెంటాడుతోంది. గాలి జనార్ధన్ రెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నం చేయడంతో పాటు.. ఇష్టం లేని లాలూను జైలుకు పంపుతోంది. చిదంబరం కుటుంబాన్ని వేధించడం అన్నీ సీబీఐ చేస్దోంది. కానీ అంతా బీజేపీ డైరక్షన్ లోనే. టీడీపీతో కలసి పోటీ చేసినప్పుడు బీజేపీ… జగన్ లక్ష కోట్లు దోచుకున్నాడని ప్రచారం చేసింది. కానీ ఇప్పుడు అదే జగన్‌తో సంబంధాలు కొనసాగిస్తోంది. వైసీపీ బీజేపీకి వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేకపోతూండటంతో.. టీడీపీ దీన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటోంది. వైసీపీకి బలమైన ఓటు బ్యాంక్ దళితులు, మైనార్టీలు. జగన్ బీజేపీకి దగ్గరైతే.. ఆ ఓటు బ్యాంక్‌లో చీలిక తీసుకురావొచ్చని టీడీపీ బావిస్తోంది.

Copy Protected by Chetan's WP-Copyprotect.