పదవులకు ఆశపడే నేత కాదు…మాటకు విలువిచ్చే నాయకుడు… శిద్ధా ఏంటో ఈ ఒక్క మాట చాలు

ఈ రోజుల్లో పదవులకి ఆశ పడని నేత ఉండరు…అలాగే పార్టీ ఒక మాట చెబితే దానికి కట్టుబడి ఉండకుండా…పార్టీని నాశనం చేసి అవతలి పార్టీల్లోకి జంప్ చేస్తారు. ఇలాంటి రాజకీయాలకి ఉదాహరణలు తెలుగు రాష్ట్రాల్లో చాలానే చూశాం. ఇక తాజాగా ఇలాంటి వాటికి ఉదాహరణలుగా ఆదాల ప్రభాకర్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డిలు నిలుస్తారు. ఆదాల టీడీపీలో తనకి కావల్సిన సీటు దక్కించుకుని కూడా… పార్టీతో పనులు చేయించుకుని అవసరం తీరిపోయాక వైసీపీలోకి జంప్ అయ్యాడు. అటు మాగుంట కూడా పార్టీలో పదవులు అనుభవించి…పార్టీకి అవసరమైనప్పుడు అండగా నిలవకుండా తన స్వార్ధం కోసం పార్టీ మారారు. ఇక ఇలాంటి నాయకులకు టైమ్ వచ్చినప్పుడు ప్రజలే బుద్ధి చెబుతారు.

అయితే ఇలాంటి స్వార్ధ రాజకీయాలు చేసే నేతలు ఉన్న చోటే…పదవులకు ఆశ పడకుండా…ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండే నేతలు కూడా ఉన్నారు. అలాంటి వారిలో మంత్రి శిద్ధా రాఘవరావు ముందు వరుసలో ఉంటారు. కొన్ని రోజులు క్రితం తాను గతంలో పోటీ చేసే దర్శి అసెంబ్లీ నుండి మళ్ళీ పోటీ చేయాలని శిద్ధాకి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ హఠాత్తుగా పార్టీలో జరిగిన ఓ పరిణామం ఒంగోలు జిల్లా రాజకీయాలని మార్చేసింది. టీడీపీలో సీనియర్ నేతగా మాగుంటని ఒంగోలు లోక్‌సభకి పోటీ చేయించాలని చంద్రబాబు అనుకున్నారు. కానీ ఆయన నీచ రాజకీయాలు చేస్తూ పోటీకి దూరంగా ఉంటానని కొన్ని రోజులు డ్రామాలు ఆడారు. అయిన అధిష్టానం మాగుంట కోసం గట్టిగా ప్రయత్నించింది.

ఆయనకి టీడీపీ ఎంతో విలువ ఇచ్చి గౌరవంగా ఉన్న..ఆయన మాత్రం ఆ గౌరవాన్ని పోగొట్టుకుంటూ వైసీపీలో చేరి అక్కడ నుండి ఒంగోలు ఎంపీ అభ్యర్ధిగా నిలబడ్డారు. దీంతో అధినేత ఒక్కసారిగా వ్యూహం మార్చి….జిల్లాలో సీనియర్ నేత…మంచి వ్యక్తి అయిన శిద్ధాని ఎంపీగా పోటీ చేయమని అడిగారు. అలాగే ‘ఆ వ్యక్తి మోసం చేశాడు… మీరు ఢీ కొట్టడానికి రెడీగా ఉన్నారా అని శిద్ధాని అడుగగానే…శిద్ధా కూడా అధినేత చెప్పిన వెంటనే ఒప్పుకుని…ఢీ అంటే ఢీ అన్నారు. తన సొంత బిడ్డలాంటి దర్శిని వదులుకుని ఒంగోలు లోక్‌సభ బరిలో నిలిచేందుకు సిద్ధమయ్యారు. అలా ఇచ్చిన మాటకి కట్టుబడి శిద్ధా ఒంగోలు బరిలో మాగుంటని ఓడించేందుకు సిద్ధమయ్యారు. ఎప్పుడైనా రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తులే ఉండాలని ప్రజలు కూడా కోరుకుంటారు. ఇచ్చిన మాట కోసం ప్రజలకు మేలు చేస్తారు అని నమ్ముతారు. ఇక నమ్మించి మోసం చేసిన వారిని అసహ్యించుకుని వారిని చిత్తుగా ఒడిస్తారు.

Copy Protected by Chetan's WP-Copyprotect.