6600 మందితో సర్వే అంట 3 వేలమంది టీఆర్ఎస్ అన్నారట! సిల్లీగా లేదూ?

మొత్తం 17 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో 6877 మందిని టెలిఫోన్‌ ద్వారా ప్రశ్నించి ఈ సర్వే చేశారట. అందులొ 44 శాతం అంటే సుమారు 3000 చిల్లర మంది టీఆర్ఎస్ గెలుస్తదని అందులో చెప్పిన్రట. సిల్లీగా లేదూ? ఈరోజు తెరాస అధికార పత్రికలో వచ్చిన సర్వే చూడండి. ఇంతోటి 6000 మంది సర్వేతో వీళ్లు ఐన్‌స్టీన్‌ లాగా ఇయన్నీ కనుక్కున్నరట. “తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వానికి అనుకూల పవనాలు బలంగా వీస్తున్నాయని.. ఇండియా టుడే’కు చెందిన ‘పొలిటికల్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ (పీఎస్‌ఈ)’ సర్వే తేల్చింద అంట.

అన్ని వర్గాల ప్రజాభిమానాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చూరగొన్నారని.. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ఆయనకు బోనస్‌లా కలిసొస్తాయని పీఎస్‌ఈ తేల్చిచెప్పింది. సర్వేలో పాల్గొన్నవారిలో 44% మంది కేసీఆర్‌ ప్రభుత్వమే రావాలని కోరుకోగా.. ప్రభుత్వం మారాలని 34% మంది అభిప్రాయపడ్డారు. 22 శాతం మంది తెలియదని సమాధానమిచ్చారు.
ఈ గణాంకాల ప్రకారం.. మళ్లీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే ఏర్పడే అవకాశం 75% ఉన్నదని ప్రముఖ సెఫాలజిస్టు రాజీవ్‌ కరాండికర్‌ (చెన్నై మేథమేటికల్‌ ఇన్‌స్టిట్యూట్‌) అంచనా వేశారు.
అవును. పెయిడ్ సర్వేలు అంటే పైకం చెల్లించి వేయించే సర్వేల్లో అధికార పార్టీకి అనుకూలంగా ఫలితాలు వస్తాయి. నిజమైన ఎన్నికల ప్రజా క్షేత్రంలో కూటమి విజయం ఖాయం అంటున్నారు ప్రజలు. తెలంగాణ వస్తే.. మొత్తం మారిపోతుందని… అద్భుతం జరిగిపోతుందని… ఆశించారు. కానీ.. అలాంటి పరిస్థితులేమీ కనిపించడం లేదు. అంచనాలు ఎక్కువగా ఉన్నప్పుడు… అందుకోవడం సాధ్యం కాదు. తెలంగాణ వస్తే.. ఏదో అద్భుతం జరిగిపోతుందని.. ప్రజలు భావించినా ..

అలాంటివేమీ లేదు. అదీ కాక… కొన్ని హామీలు కూడా అమలు కాలేదు. ఉదాహరణకు.. డబుల్ బెడ్ రూం ఇళ్లు, కేజీ టు పీజీ, దళితులకు మూడెకరాల భూమి, ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లు ఇంకా పూర్తి కాలేదు. అలాగే.. రైతు బంధు పథకం అందని వారు… కాక మీద ఉన్నారు. పోయి వాళ్లను అడగండి ప్రభుత్వంపై అభిప్రాయాలను. యువత, నిరుద్యోగులలో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఎందుకంటే.. తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగాలొస్తాయని వారంతా ఆశ పడ్డారు. కానీ ఎలాంటి ఉద్యోగాలు రాలేదు. అందుకే వారిలో వ్యతిరేకత వస్తోంది. ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టినా.. వాటిని లాభం కలిగించే.. రాజకీయ వాతావరణం ఏర్పడకపోతే.. ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. కర్ణాటకలో.. చాలా సర్వేలు చేశారు. అన్ని సర్వేల్లోనూ.. సిద్ధరామయ్యకు పరిస్థితి అనుకూలంగా ఉంది. ఆయన సంక్షేమ పథకాల్లో దూసుకెళ్తున్నారని చెప్పుకున్నారు. కానీ ఫలితాలు సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా వచ్చినట్టే ఇక్కడా వస్తాయని మెజార్టీ ప్రజలు అభిప్రాయం.

Copy Protected by Chetan's WP-Copyprotect.