టీడీపీ “స్టార్‌ క్యాంపెయినర్‌”గా ఆయన పేరు ఈసీకి ఇస్తున్నారు! అదీ సీఎం ఆయనకు ఇచ్చిన గౌరవం!

తెలుగుదేశం స్టార్ క్యాంపెయినర్‌గా ఆయన పేరును సీఎం చంద్రబాబు ఎన్నికల సంఘానికి సిఫార్సు చేస్తున్నారు. విజయవాడ సభలో ఇటీవల పార్టీలో చేరిన సంచలన నేత వంగవీటి రాధాను పలు విధాలుగా సీఎం ప్రస్తుతించారు. ఆయన రాష్ట్రం అంతటా తెలుగుదేశం తరపున ప్రచారం చేస్తారని, ఆయన టీడీపీ స్టార్ క్యాంపెయినర్‌ అని సీఎం నిండు సభలో ప్రకటించారు. వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీలో చేరడంతో.. మరింత బలం పెరిగిందని చంద్రబాబు పేర్కొన్నారు.

రాధాకృష్ణ నిస్వార్థంగా ముందుకొచ్ఛి. పేదలకు ఇళ్లపట్టాలను ఇవ్వాలని కోరారన్నారు. ఆయన అడిగినట్టు చేస్తున్నామన్నారు. రాష్ట్రమంతా పర్యటించి.. తెదేపా తరఫున రాధా ప్రచారం చేయనున్నారని, పార్టీకి ఆయనో స్టార్‌ ప్రచారకులన్నారు. రాధా లాంటి మంచి వాళ్లంతా తెదేపా వైపు వస్తున్నారని, దొంగలంతా వైకాపా వైపు వెళుతున్నారంటూ చంద్రబాబు ఎద్దేవా చేశారు. విలువలు లేని.. ఆ పార్టీకి ఎక్కువ కాలం మనుగడ లేదన్నారు. వంగవీటి కుటుంబానికి రాష్ట్ర రాజకీయాల్లో ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ స్టార్‌ క్యాంపెయినర్లలో వంగవీటి రాధా పేరు కూడా ఎన్నికల సంఘానికి ఇవ్వబోతున్నట్టు తెలిసింది. నిజానికి వంగవీటి ఫ్యామిలీ ఇప్పటి వరకూ బెజవాడ దాటి ప్రచారం చేసిన సందర్భం లేదు. వాళ్ల ఇన్ఫ్లూయెన్స్ మాత్రం రాష్ట్రం మొత్తం మ్మీద ఉంటుంది. సాదాసీదాగా కనిపించే ఆ నాయకుణ్ని స్టార్ గా ప్రమోట్ చేస్తారా ? చంద్రబాబు వ్యూహం ఎలా ఉండబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది. బాబు ఎప్పుడూ అన్ని అస్త్రాలు ఒకే సారి వాడేయడు.

వన్‌ బై వన్ సంధిస్తూంటాడు. అందాకా అవతలి వాడికి సందు ఇస్తూంటాడు. తన ట్రాప్‌లోకి రావటానికి. వైసీపీ వంగవీటిని వంచించింది. మోసం చేసింది. పక్కన పెట్టింది. గౌతం రెడ్డి లాంటి వాళ్లు నోరు పారేసుకున్నా, జగన్ చూస్తుండిపోయాడు. అవమానించాడు. కాపు వర్గానికి ఐకాన్ లాంటి కుటుంబానికి జరిగిన అవమానం ఇది. ఆల్రెడీ ప్రజారాజ్యంలో పరాభవ అనుభవాలు ఉన్నాయ్ కాబట్టి రాధా అటు వైపు చూడటం లేదు. టీడీపీలోకి రావడం ఖాయం అయిపోయింది. ప్రచారానికి విస్తృతంగా అందుబాటులో ఉంటానని కూడా ఆయన హామీ ఇచ్చాడని అంటున్నారు. నిజానికి రాథా మృదు స్వభావి. ఆయన స్థానంలో మరొకరు ఉండి ఉంటే విజయవాడలో వేడి మరోలా ఉండేది. ఎప్పుడో జరిగిన పరిణామాలని ఇప్పుడు రాజకీయానికి సంబంధం లేదు అంటూ హుందాగా మాట్లాడ్డంలోనే ఆయన నైజం అర్థం అవుతుంది. పై పెచ్చు అన్యాయం చేసింది, వంచన చేసింది జగన్ కాబట్టి ఆ అడ్వాంటేజ్ కూడా టీడీపీకి రానే వస్తుంది. ఇలాంటి సమయంలో వైసీపీపై ఎదురు దాడి చేసేందుకు అవకాశం ఉంటుందని టీడీపీ వ్యూహ బృందం అంచనా వేస్తోంది.

Copy Protected by Chetan's WP-Copyprotect.