షడన్‌గా బాబు నుంచి కాల్! మీ రిపోర్టు ఏంటని అడిగారు! షాక్‌ తిన్న అభ్యర్థి ఏం చెప్పారంటే?

షడన్‌గా సీఎం చంద్రబాబు నుంచి ఓ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి ఫోన్ వచ్చింది. మీరు చాలా రోజులుగా గ్రామాల్లోనే మకాం వేసి తిరుగుతున్నారని నాకు రిపోర్టు వచ్చింది. రూరల్‌ ఏరియాలో పబ్లిక్‌ పల్స్‌ ఎలా ఉంది? సంక్షేమ పథకాల గురించి జనం స్పందన ఏంటి? లేడీస్ ఏమంటున్నారు ? మీ మీ అబ్జర్వేషన్స్ చెప్పండి అన్నాడు చంద్రబాబు. ఊహించని రీతిలో సీఎం ఫోన్‌లోకి రాగానే ఆ అభ్యర్థికి ఎలా చెప్పాలో తెలియడం లేదు సంతోషంలో !

మామూలుగానే ఆయన భోళా మనిషి. జనం నుంచి వస్తున్న ఆదరణ చూసి అసలకే ఉబ్బితబ్బిబ్బు అవుతున్నాడు. “ఊరిలోకి వెళ్లటంతోనే ఆడోళ్లు, ముసలి ముతక అందరూ వెనకాలే వస్తున్నారు సార్ అభిమానంతో. మనం డోర్‌ టూ డోర్ క్యాంపెయిన్ చేస్తున్నాము సార్. వాళ్ల ఇంటికి వెళ్లి కరపత్రం ఇచ్చి ఇంకో వీధిలోకి పోతా ఉంటే మన వెనకంబడే వస్తున్నారు. చంద్రబాబుకు కాకపోతే ఇంకెవరకి వేస్తామయ్య ఓటు” అంటూ గట్టిగా నిలబడ్డారు సార్ మనతో వాళ్లంతా. మొన్నటి వరకూ మా జిల్లాలో 3 సీట్లలో కనీసం 15 వేలు వెనకబడ్డారు అని మీరు మొన్న సమన్వయ కమిటీలో రిపోర్టు ఇచ్చారు. ఇప్పుడు ఆ మూడు చోట్ల మన వాళ్లు కనీసం 20 వేల మెజార్టీతో గెలుస్తారు సార్. వ్యతిరేకత ఉంది అనుకున్నవాళ్లు కూడా గెలుస్తారు సార్, నా ఒక్కడిదే కాదు, 13 జిల్లాలూ ఇంతే, ఇది నా ఫీడ్ బ్యాక్ అని అతను చెప్పాడు. అంతేకాదు. సార్, ఇప్పుడు గ్రామాల్లోకి పోతా ఉంటే టీడీపీకి ఓటు వేయను అనటానికి ఎవరైనా ఇప్పుడు కారణం వెదుక్కోవాలి సార్, ఇక మీరు ఏ మాత్రం తగ్గమోకండి అనేశాడు.

అనే సరికి చంద్రబాబు వైపు నుంచి కూడా అవును నాకు కూడా సేమ్ రిపోర్ట్స్ వచ్చాయి క్రాస్ చెక్ చేసుకోవటం కోసమే మీకు చేశానని చెప్పారట. చెప్పాలంటే లైన్ ఈజ్ వెరీ సింపుల్. కడప స్టీలు ప్లాంటు, రామాయపట్నం పోర్టుకు శంకుస్థాపన, కియా కారు మార్కెట్‌లోకి విడుదల, సంక్షేమ పథకాల అమలు ఇవన్నీ చూస్తుంటే ఎలా ఉందంటే ఫామ్లో ఉన్న బ్యాట్స్ మన్ వరసగా సెంచరీలు కొట్టుకుంటూ పోతున్నట్టుగా ఉంది చంద్రబాబు బ్యాటింగ్. డ్వాక్రా, ఫించన్లు, నిరుద్యోగ భృతి, ఫ్యాక్టరీలు, వరాలు ఒకటా రెండా ! ఏపీలో సంక్షేమ కుంభ వృష్టి. ఇచ్చాడన్న మాట కన్నా, కష్టకాలంలో కూడా, చేతిలో డబ్బుల్లేకపోయినా కూడా చంద్రబాబు ఇలా చేస్తున్నాడు. ఇన్ని ఇస్తున్నాడు అనే ఫీలింగ్ జనంలోకి వెళ్లింది. కేవలం ఇచ్చాడు అనుకుంటే కొంతమంది మర్చిపోయేవారేమో ! కానీ కష్టాల్లో ఉన్నా ఇస్తున్నాడు అని మాట్లాడుతున్నారంటే అది కృతజ్ఞత. మర్చిపోరు. మనసుల్లో చెరిగిపోదు. అందుకే ఆ ఎమ్మెల్యే అలా చెప్పాడు.

Copy Protected by Chetan's WP-Copyprotect.