వైసీపీలో చేరట్లేదన్న టీడీపీ ఎంపీ.. బాబే నా నాయకుడు

వైసీపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను తెలుగు దేశం పార్టీ ఎంపీ పి.రవీంద్రబాబు కొట్టిపారేశారు. ఆ వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పారు. తాను టీడీపీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. చంద్రబాబుపై తనకు పూర్తి విశ్వాసం ఉందని వెల్లడించారు. చంద్రబాబు ఎలా చెబితే అలా నడుచుకుంటానని వ్యాఖ్యానించారు. టిడిపి నుండి 2014 లో అమ‌లా పురం నుండి గెలిచిన రిటైర్డ్ ఐఆర్‌య‌స్ అధికారి పండు ర‌వీంద్రబాబు తాను చంద్రబాబుకు విధేయుడినని ప్రకటించారు.

2014 లో ర‌వీంద్ర‌బాబు వైసిపి అభ్య‌ర్ది పి విశ్వ‌రూప్ పై గెలుపొందారు. ఆ ఎన్నిక‌ల్లో ర‌వీంద్ర బాబుకు 594547 ఓట్లు రాగా, వైసిపి అభ్య‌ర్దికి 473971 ఓట్లు వ‌చ్చాయి. టిడిపి అభ్య‌ర్ది ర‌వీంద్ర‌బాబు 120576 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గతంలో కొంత కాలం కిందట తన కూతురి వివాహానికి తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేకర్ రావు ను ఇన్విటేషన్ ఇవ్వడానికి ఓచిన అమలాపురం ఎంపి రవీంద్రబాబు ను ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది లోనికి వెళ్ళకుండా అడ్డుకొని ఎండలలో నిల్చో బెట్టారని అయన వాపోయారు. కెసిఆర్ గారు అంటే తనకెంతో అభిమానమని అయన అభిప్రాయ పడ్డాడు . తనను గేటు వద్ద ఆపి అవమానించారని రవీంద్ర బాబు ఆరోపించారు. ఐడీ కార్డు చూపినా లోపలకు పోకుండా ఎండలో నిలబెట్టారన్నారు. తాను కేసీఆర్ పైన ప్రేమ, అభిమానంతో వచ్చానని చెప్పారు. సీఎం కార్యాలయ సిబ్బందికి కేసీఆర్ ప్రోటోకాల్ నేర్పించాలన్నారు. పీలో జంపింగ్ రాజకీయాలు ఊపందుకున్నాయి. సీటు దక్కదనో.. ఇంకా మంచి పదవి దక్కుతుందనో నేతలు పార్టీలు మారుతున్నారు. నిన్నటికి నిన్న చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీని వీడి వైసీపీ అధినేత జగన్‌ను కలిశారు. వైసీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. 24గంటలు కూడా గడవక ముందే విశాఖ జిల్లా అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ టీడీపీని వీడి వైసీపీలో చేరడానికి సిద్ధమయ్యారు.

ఈ పరిణామాల నేపథ్యంలో విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు తాజా పరిణామాలపై స్పందించారు. మొన్నే చీరాల ఎమ్మెల్యే ఒకాయన వచ్చి మళ్లీ పోయారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇంకొకాయన ఇక్కడ ఎంపీగా ఉండి ఈరోజు లోటస్ పాండ్‌కు పోయే పరిస్థితికొచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. ‘నేను ఈ నాయకులకు భయపడాలా అని మిమ్మల్ని అడుగుతున్నా’ అని ప్రజలనుద్దేశించి చంద్రబాబు ప్రశ్నించారు. ‘నేను నీ కోసం పనిచేయాలా.. వీళ్ల కోసం పనిచేయాలా అని అడుగుతున్నా’ అని చంద్రబాబు అవంతి శ్రీనివాస్‌ను ఉద్దేశించి మండిపడ్డారు.

Copy Protected by Chetan's WP-Copyprotect.