టీడీపీలోకి నేడు సంచలన నేత! ఆ టికెట్ ఆయనకే ఇస్తారట?

ఏపీలో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. ఆ గట్టు నుంచి ఈ గట్టుకు.. ఈ గట్టు నుంచి ఆ గట్టుకు నేతలు జంపైపోతున్నారు. ఇటీవల కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి మళ్లీ సొంత గూటికి వెళ్లేందుకు అడుగులు పడుతున్నాయి. తెలుగుదేశంలో చేరాలంటూ కార్యకర్తలు ఒత్తిడి చేస్తున్నారు. ఇదిలా ఉంటే శ్రీశైలం బరి నుంచి టీడీపీ అభ్యర్థి బుడ్డా రాజశేఖర్‌రెడ్డి తప్పుకోవడంతో ఆయన స్థానంలో బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డిని దింపాలని టీడీపీ అధిష్టానం భావిస్తోంది. టికెట్ హామీ దొరికితే ఇవాళే సీఎం చంద్రబాబు సమక్షంలో బైరెడ్డి టీడీపీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రత్యేక రాయలసీమ వాదాన్ని భుజానికెత్తుకున్న మాజీమంత్రి, రాయలసీమ పరిరక్షణ సమితి నాయకుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి… టీడీపీలోకి చేరడం దాదాపు ఖాయమైంది. ఆయన టీడీపీలో చేరతారని…ఆయనతో పాటు మరికొందరు ద్వితీయ శ్రేణి నాయకులు కూడా టీడీపీ కండువా కప్పుకోనున్నారని సమాచారం. ఇదిలా ఉంటే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి టీడీపీలో చేరాలని నిర్ణయించుకోవడానికి ముందు చాలా కథ జరిగిందని ఆయనకు సన్నిహితంగా ఉండే కొందరు చర్చించుకుంటున్నారు.టీడీపీలోకి వెళితేనే గౌరవం ఉంటుందని… ఎవరికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వాలో అనుభవజ్ఞుడైన చంద్రబాబుకు బాగా తెలుసని పలువురు చెప్పడంతో… బైరెడ్డి చివరకు సైకిల్ ఎక్కాలని నిర్ణయించుకున్నారు. ప్రత్యేక రాయలసీమ నినాదాన్ని అందుకున్న సీనియర్ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు టీడీపీ నుంచి సంకేతాలు కూడా వెలువడుతున్నాయి. తాను పార్టీలో చేరడమే కాకుండా ప్రత్యేక రాయలసీమ నినాదాన్ని భుజానకెత్తుకుని స్థాపించిన రాయలసీమ పరిరక్షణ సమితిని కూడా టీడీపీీలో విలీనం చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

వాస్తవానికి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి చెందిన నేతే. అయితే రాష్ట్ర విభజన తర్వాత రాయలసీమకు అన్యాయం జరుగుతుందని భావించి ప్రత్యేక జెండాను, ఎజెండాను బైరెడ్డి ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో నంద్యాల ఉప ఎన్నికల్లోనూ బైరెడ్డి తన పార్టీ తరుపున అభ్యర్థిని కూడా దించారు. కాని కనీస ఓట్లు కూడా బైరెడ్డి పార్టీకి రాలేదు. దీంతో ఆయన కొంత అయోమయానికి గురవుతున్నట్లు తెలుస్తోంది.

Copy Protected by Chetan's WP-Copyprotect.