కాంగ్రెస్‌కు శుభ శకునాలు జగన్‌కు అశుభ శకునాలు

‘చావు దెబ్బ తిన్నాం! కోలుకోవడానికి పది పదిహేనేళ్లకుపైగా పడుతుందేమో’ అనే తీవ్ర నిరాశలో కూరుకుపోయిన కాంగ్రెస్ లోనూ ఆశలు చిగురిస్తున్నాయి. విభజన సమయంలో వీపుపై కొట్టిన కాంగ్రెస్ కంటే, ఆ తర్వాత కడుపు కొడుతున్న బీజేపీపై నవ్యాంధ్రులు మండిపడుతున్నారని… ఇది తమకు కలిసొస్తుందని హస్తం నేతలు గట్టిగా భావిస్తున్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రధాని హోదాలో ఏపీకి ప్రత్యేక హోదాను ఇస్తామని అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఇచ్చిన హామీ తమపట్ల సానుకూలత పెంచిందని చెబుతున్నారు.

‘ఇంటింటికీ కాంగ్రె్‌స’కు తాము ఊహించినదానికంటే మంచి స్పందన వస్తోందంటూ… అక్టోబరు 31తో ముగించాలనుకున్న ఈ కార్యక్రమాన్ని ఈ నెల 19 వరకూ పొడిగించారు.
ఇటీవల మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి, రాయలసీమ హక్కుల వేదిక నేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి కాంగ్రె్‌సలో చేరారు. పీసీసీ అధ్యక్ష పదవిని ఆశించిన కోండ్రు మురళీ మోహన్‌ టీడీపీలో, మాజీ స్పీకర్‌ జనసేనలో చేరినా పెద్దగా పట్టించుకోలేదు. ఇక అనూహ్యంగా జాతీయ స్థాయిలో మోదీ వ్యతిరేక శక్తులను కూడగట్టడంలో భాగంగా చంద్రబాబు కాంగ్రె్‌సతో దోస్తీకి సిద్ధమయ్యారు. దీనిని నిరసిస్తూ వట్టి, సీఆర్‌లు కాంగ్రె్‌సను వీడారు. కాంగ్రె్‌సను విభేదించిన టీడీపీతో జత కట్టడమేమిటని రాజీనామా లేఖల్లో అసంతృప్తిని వ్యక్తం చేశారు. రామచంద్రయ్య రాజకీయ ప్రస్థానం టీడీపీతో మొదలై.. ప్రజారాజ్యం వరకూ నడిచి… తర్వాత కాంగ్రె్‌సను చేరిందని పీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి గుర్తు చేశారు.

జగన్ పార్టీకి ప్రత్యేకంగా బేస్ లేదు. కాంగ్రెస్ చచ్చిపోయింది కాబట్టి వైసీపీకి ఓట్లు పడ్డాయ్ గత ఎన్నికల్లో ! విభజన చేసిన కసి కాంగ్రెస్ మీద పచ్చిగా ఉంది అప్పుడు. అందుకే వలతో సహా పావురాలు ఎగిరిపోయినట్టు ఓట్లతో సహా పార్టీ మారిపోయారు కాంగ్రెస్ విధేయులు. ఇప్పుడు పరిస్థితి అలా కాదు. బీజేపీ చేసిన ద్రోహం కాంగ్రెస్ ని సెకండ్ ప్లేస్ లోకి నెట్టింది. వీళ్ల కంటే వాళ్లే నయం అనిపించింది. అన్నిటికీ మించి రాహుల్ గాంధీ ప్రత్యేక హోదా ఇస్తా ఏపీకి, ఇవ్వకపోతే నేను మళ్లీ రాను అటు వైపు అని తెగేసి చెప్పాడు. పైగా రెడ్లు అంతా గెలిచే పార్టీ వైపు ఉండాలన్న నిర్ణయానికి వస్తున్నారు. ఎనిమిదేళ్లుగా జగన్ ను చూసి చూసి విసుగెత్తి పోయారు. అందుకే టీడీపీతో కలిస్తే కుక కాంగ్రెస్ కి ఓట్లు పెరుగుతాయ్. గెలుస్తుందో లేదో తెలీదు కానీ వైసీపీ ఓట్లు చీలిపోయి చతికిలపడి విలవిల్లాడుతుంది. ఖాయంగా !

Copy Protected by Chetan's WP-Copyprotect.