విజయసాయి వ్యాఖ్యలపై బీజేపీ వర్గాల ఆగ్రహం! ప్రధాని, అమిత్‌షా దృష్టికి తీసుకువెళ్తామంటున్న నేతలు!

ఏపీ రాజధాని మార్చే యోచన ఉందని ప్రభుత్వం ఎక్కడా ప్రకటించ లేదని వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అక్కడ ముంపు ప్రాంతం ఉంది అనేది మాత్రం నిజమని అన్నారు. పోలవరం రివర్స్ టెండరింగ్ పీపీఏల పున:పరిశీలన అంశాల్లో నరేంద్ర మోదీ, అమిత్ షాను సంప్రదించే నిర్ణయం తీసుకున్నామని విజయ సాయి రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వంతో ఎక్కడా తగాదా పెట్టుకునే పరిస్థితి లేదన్నారు.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా.. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, హో మంత్రి అమిత్ షా‌ను సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు.

పోలవరం రివర్స్ టెండరింగ్ పీపీఏల పున:పరిశీలన తదితర అన్ని అంశాలపై ప్రదాన మంత్రితో కూలంకషంగా చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. దీంతో తెలుగు దేశం పార్టీ చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన మీడియాకు తెలిపారు. దీనిపై కొద్ది సేపటికి బీజేపీ నేతలు ఢిల్లీ వేదికగా ఖంఢించారు. పోలవరం రీ టెండరింగ్‌, పీపీఏల విషయంలోనే కాక, గత ప్రభుత్వ పాలనలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించే విషయంలో కూడా ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షాల ఆశీస్సులతోనే తమ ప్రభుత్వం విధాన నిర్ణయాలు తీసుకుంటోందని వైసీపీ నేత విజయ సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి తీవ్ర అభ్యంతరం చెప్పారు.విజయ సాయిరెడ్డి చెప్పే దాంట్లో నిజం లేదని స్పష్టం చేశారు. ప్రధాని, షా ఆశీస్సులుంటే.. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రీ టెండర్‌కు వెళ్లొద్దని కేంద్రం పరిధిలో పని చేసే పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) లేఖ ఎలా రాస్తుందని ప్రశ్నించారు. పీపీఏల రద్దుపై కేంద్రం ఎందుకు తీవ్రంగా ఆక్షేపిస్తుందని నిలదీశారు. ‘పోలవరం ఏపీకి జీవ నాడి.

అలాంటి ప్రాజెక్టు పనులు జరగకుండా ఏవో కుంటి సాకులతో అడ్డంకులు సృష్టించడం ఎంత వరకు సమంజసం? విజయ సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రధాని, అమిత్‌ షాల దృష్టికి తీసుకెళ్తా’ అని తెలిపారు. మరో పక్క ఏపీలోనూ బీజేపీ నేతలు తీవ్రంగా తప్పు పడుతున్నారు. విజయసాయి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మొత్తం మీద వైకాపా నేతలు చేస్తున్న వ్యాఖ్యలు అన్నీ కలవరం పుట్టిస్తున్నాయి.

Copy Protected by Chetan's WP-Copyprotect.