వైసీపీలోకి అవంతి…కౌంటర్ గా ఆయన రంగంలోకి

అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ అధిష్ఠానంపై అసంతృప్తితో వున్నట్టు తెలిసింది. ఆయన పార్టీని వీడనున్నారని సమాచారం. ముత్తంశెట్టి వచ్చే ఎన్నికలో అసెంబ్లీకి.. అదీ భీమునిపట్నం నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇదే విషయాన్ని కొంతకాలం కిందట పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వద్ద ప్రస్తావించారు. ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని ముత్తంశెట్టి వర్గీయులు అప్పట్లో ప్రచారం చేశారు. అయితే భీమిలి నుంచి ప్రస్తుతం రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆయన మరోమారు తాను భీమిలి నుంచే పోటీ చేస్తానని స్పష్టంగా ప్రకటించారు.

ఈ నేపథ్యం లో ముత్తంశెట్టి విశాఖ నార్త్‌ లేదా చోడవరం నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు కొద్దికాలంగా వినిపిస్తున్నాయి. కానీ అధిష్ఠానం ఏ విషయం తేల్చకపోవడం, ఇదే సమయంలో వైసీపీ భీమిలి సీటు ఆఫర్‌ చేయడంతో ముత్తంశెట్టి పార్టీ మారనున్నారనే ప్రచారం మొదలైంది. దీనిపై వివరణకు యత్నించగా ఆయన అందుబాటులో లేరు. వాస్తవానికి బాబు ఆ సీటు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. హామీ ఇవ్వనని తేల్చి చెప్పేయటంతో వైసీపీని ఆయన ఆశ్రయంచినట్టు తెలిసింది. అసలే అబ్యర్థుల్లేక ఏడుస్తున్న వైసీపీ అవంతి అడగగానే భీమిలీ సీటు ఇస్తానని ఆఫర్ ఇవ్వటంతో ఆయన లగేజి సర్దుకుని జగన్ గడప తొక్కుతారని తెలుస్తున్నది. మరోపక్క నష్ట నివారణ చర్యల్లో భాగంగా సీఎం చంద్రబాబు ఆయనని రంగంలోకి దిగాలని చెప్పినట్టు సమాచారం. అవంతి ప్లేసులో అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయటానికి సిద్దంగా ఉండాలని ఆ సీటు నుంచే ఎంపీగా గతంలో పనిచేసిన సబ్బంహరికి సీఎం కబురు పంపారట. విశాఖపట్నం మాజీ మేయర్‌, అనకాపల్లి మాజీ ఎంపీ సబ్బం హరి తెలుగుదేశం పార్టీలో చేరే సూచనలు కనిపిస్తున్నాయి. నవ్యాంధ్ర అభివృద్ధికి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తూ, ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్న చంద్రబాబే రాష్ట్రానికి పెద్ద దిక్కని ఆయన ఇటీవల పలుసార్లు తన అభిప్రాయం వ్యక్తంచేశారు. ప్రస్తుతం ఆయన ఏ పార్టీలోను లేరు. ఎన్డీఏతో తెలుగుదేశం తెగదెంపులు, కేంద్ర మంత్రి పదవులకు రాజీనామాలు, ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో, రాష్ట్రంలో టీడీపీ ఉద్యమాల నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మారిపోయింది. సమీకరణలూ మారుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలాకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న హరి తెలుగుదేశంలో చేరడానికి ఆసక్తి చూపగా.. ఆ పార్టీ నాయకత్వం ప్రాథమికంగా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్టు పార్టీ వర్గాల సమాచారం. వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంటు స్థానానికి గానీ, విశాఖ ఉత్తరం అసెంబ్లీ స్థానానికి గానీ పోటీ చేసే అవకాశం కల్పించాలని హరి కోరినట్లు ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు మాత్రం అనకాపల్లి నుంచి పోటీకి రెడీ అవ్వాలని చెప్పారట. సబ్బం హరిది ప్రత్యేక శైలి. వైఎస్‌ రాజశేఖరరెడ్డికి అభిమాని. విశాఖ మేయర్‌గా చేశారు. తర్వాత అనూహ్యంగా కొన్నాళ్లు కాంగ్రెస్‌ పార్టీకి దూరంగా ఉన్నారు. 2009 ఎన్నికల్లో అంతే అనూహ్యంగా అనకాపల్లి లోక్‌సభ టికెట్‌ సాధించి, ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి అల్లు అరవింద్‌ను ఓడించి ఎంపీగా ఎన్నికయ్యారు. వైఎస్‌ మరణానంతరం ఆయన తనయుడు జగన్‌కు మద్దతుగా నిలిచారు.

2014 ఎన్నికల్లో గెలిస్తే జగన్‌ యూపీఏకే మద్దతిస్తారని ఆయన చేసిన వ్యాఖ్యలతో వైసీపీ ఆత్మరక్షణలో పడింది. దరిమిలా ఆయనతో తమకు సంబంధం లేదని ఆ పార్టీ ప్రకటించింది. రాష్ట్ర విభజన సమయంలో నాటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి మద్దతుగా నిలిచారు. ఏకంగా పార్టీప్రభుత్వంపైనే అవిశ్వాస తీర్మానానికి నోటీసిచ్చారు. కాంగ్రెస్‌ బహిష్కరించిన ఆరుగురు ఎంపీల్లో ఆయన కూడా ఉన్నారు. 2014 ఎన్నికల్లో కిరణ్‌కుమార్‌రెడ్డి పెట్టిన జై సమైక్యాంధ్ర పార్టీలో చేరారు. ఆ పార్టీ తరపున విశాఖపట్నం ఎంపీగా పోటీ చేయడానికి నామినేషన్‌ వేశారు. ఆఖరి నిమిషంలో మనసు మార్చుకొని టీడీపీ-బీజేపీ ఉమ్మడి అభ్యర్థి హరిబాబుకు మద్దతు ప్రకటించారు.

Copy Protected by Chetan's WP-Copyprotect.