అసెంబ్లీ తిరస్కరించినా ఏపీని ఎలా విభజించారు..? లోక్‌సభలో హాట్‌ టాపిక్‌!

జమ్మూకశ్మీరు వ్యవహారంపై మంగళవారం లోక్‌సభలో జరిగిన చర్చ సందర్భంగా.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజనపైనా వాడీవేడి చర్చ జరిగింది. కాంగ్రెస్‌ ఎంపీ మనీశ్‌ తివారీ, వైసీపీ ఎంపీల మధ్య సంవాదం నడిచింది. తర్వాత ఈ అంశంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా మాట్లాడుతూ ఏపీ విభజన తీరును ఆక్షేపించారు. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం, అసెంబ్లీ, శాసన మండలి వ్యతిరేకించినా ఎలా విభజించారని కాంగ్రెస్‌ను నిలదీశారు. తొలుత తివారీ మాట్లాడుతూ.. జమ్మూకశ్మీరుఅసెంబ్లీ హక్కులను కేంద్రం లాగేసుకుందని.. అసెంబ్లీ సలహా, సంప్రదింపులు లేకుండానే రాష్ట్ర విభజన చేయడం రాజ్యాంగ ఉల్లంఘనేనని పేర్కొన్నారు. వెంటనే వైసీపీ ఎంపీ వంగా గీత ఆయన ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ‘ఆంధ్రప్రదేశ్‌ను విభజించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన సమయంలో ఆ రాష్ట్ర అసెంబ్లీ అనుమతి ఉందా’ అని ప్రశ్నించారు.

వైసీపీ ఎంపీలు ఆమెకు మద్దతుగా తమ తమ స్థానాల్లో నిలబడి తివారీ ని ప్రశ్నించే ప్రయత్నించారు. బీజేపీ ఎం పలు సైతం వారికి మద్దతుగా బల్లలు చరిచారు. తివారీ వారికి కౌంటర్‌ ఇస్తూ.. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీ, మండలి సలహా మేరకు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 3 ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని విభజించి యూపీఏ ప్రభుత్వం తెలంగాణను ఏర్పాటు చేసిందన్నారు. ఈ విషయం సభ రికార్డులోనూ ఉందని చెప్పా రు. ఇది పూర్తిగా అసత్యమని రఘురామ కృష్ణంరాజు స్పష్టం చేశారు. ‘మూడింట రెం డొంతుల మెజారిటీతో రాష్ట్ర విభజన బిల్లు ను అసెంబ్లీ తిరస్కరించి కేంద్రానికి, పార్లమెంటుకు పంపించింది.విభజనకు నిరసనగా అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి పదవికి రాజీనామా చేశారు’ అని వ్యాఖ్యానించారు. విభజన జరిగిన తీరుపై తాను సుప్రీంను కూడా ఆశ్రయించానని గుర్తుచేశారు. రాష్ట్ర విభజన పూర్తయిన నేపథ్యంలో ఇప్పుడు ఏం చేయగలమని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించిందని, కానీ ఇంకా కేసు పెండింగ్‌లోనే ఉందని చెప్పారు. ఆ తర్వాత బిల్లుపై జరిగిన చర్చకు సమాధానమిచ్చేటప్పుడు అమిత్‌ షా.. తివారీ వ్యాఖ్యలను ప్ర స్తావించారు. ‘ఆంధ్రప్రదేశ్‌ విభజనపై ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీతో చర్చించామని తివారీ పదేపదే అన్నారు. ఏం చర్చించారు..? రాష్ట్ర విభజనను ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం, అసెం బ్లీ, శాసన మండలి తిరస్కరించాయి. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీఎం రాజీనామా కూడా చేశారు.

అయినా మీరు విభజించా రు’ అని ఆక్షేపించారు. రాష్ట్ర విభజన ప్రక్రియ గురించే మాట్లాడుతున్నానని అమిత్‌ షా అన్నారు. ‘రాష్ట్రప్రభుత్వం, అసెంబ్లీ, శాసన మండలి తిరస్కరించినా ఎందుకు రాష్ట్ర విభజన చేశారు..? మీరు చేసినప్పుడు మేమెందుకు చేయకూడదు..? పార్లమెంటు తలుపులు మూసేసి.. మార్షల్స్‌ చేత ఎంపీలను బయటకు పంపించారు. మేమిప్పుడు అలా చేయలేదు. ఈ రోజు చీకటి రోజు కాదు.. ఆ రోజే చీకటి రోజు’ అని ధ్వజమెత్తారు.

Copy Protected by Chetan's WP-Copyprotect.