బిగ్ బ్రేకింగ్ న్యూస్‌! వైసీపీని భయపెట్టే పరిణామం!

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీకే కాదు ఆ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కూడా ఇది నిజంగానే బిగ్ బ్రేకింగ్ న్యూస్‌! ప్రకాశం జిల్లాలో వైసీపీని భయపెట్టే పరిణామం ఇది. వైకాపా అభ్యర్థుల జాబితా ఆదివారం విడుదలయ్యింది. ఒంగోలు ఎంపీగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి పోటీలో ఉంటారని జాబితాలో ప్రకటించారు. అయితే వైసీపీ ఒంగోలు సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న జగన్‌ బాబాయ్, ప్రకాశం జిల్లా రాజకీయ దిగ్గజాల్లో ఒకరైన వైవీ సుబ్బారెడ్డి గత రెండు రోజులుగా వైసీపీ శ్రేణులకు అందుబాటులోకి రాకపోవడం సంచలనంగా మారింది.

ప్రకాశం జిల్లాలో మాత్రమే కాదు. యావత్ రాష్ట్రంలోనే కాదు. ఢిల్లీలో కూడా పార్టీ కోసం పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. రేయింబవళ్లు పనిచేశారు. ఎన్ని కీలక పరిణామాల్లో భుజాలు వాచేలా బాధ్యతలు మోసారు. కానీ అవమానకరంగా పక్కన పెట్టేయటం ఆయన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. తన చేతిలో గత ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తిని తెచ్చి గెలిచిన తనను పక్కన పెట్టేయటం ఏంటనే ప్రశ్నకు జగన్ వద్ద సమాధానం లేదు. దాంతో ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని అంటున్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ టికెట్‌ ఇవ్వకపోయినా పోటీ చేయటమా? లేక ఎన్నికలకు దూరంగా ఉంటూ తన వర్గీయులతో పరోక్షంగా వైసీపీ అభ్యర్థి ఓటమికి కృషి చేయటమా అనేది ఆయన వర్గీయులు పరిశీలిస్తున్నట్టు తెలిసింది. వైవీ సుబ్బారెడ్డి అంటే వైసీపీకి ఆత్మ – సోల్ వంటి వాడు. త‌న‌కు ఎక్క‌డ పోటీకి వ‌స్తారో అన్న భ‌యంతో రాష్ట్రంలో ఎంద‌రో నియోజ‌వ‌ర్గాల ఇన్‌ఛార్జ్‌ల‌ను ప‌క్క‌న పెట్టేస్తున్న వైఎస్ జ‌గ‌న్ సొంత బాబాయ్ వైవీ సుబ్బారెడ్డికి ఈ సారి మొండి చేయి చూపించిన విష‌యం విదిత‌మే.

ఒంగోలు ఎంపీ స్థానం నుంచి ఈ సారి ఆయ‌న పోటీ చేయ‌బోర‌ని కొన్నాళ్ల క్రితం వైఎస్ జ‌గ‌న్ ఏకపక్షంగా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. కనీసం తనతో మాట అయినా మాట్లాడకుండా మీడియా వద్ద అలా జగన్ ప్రకటన చేయటం నొప్పించింది అని చెబుతున్నారు. జగన్‌కు ఇప్పటికే తన రాజీనామా లేఖను పంపినా జగన్ ఆమోదించలేదని సమాచారం. మొన్న‌టి వ‌ర‌కు వైవీ సుబ్బారెడ్డి ఎంపీగా ఉన్న ఒంగోలు పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలోని ఎమ్మెల్యే స్థానాల స‌మీక్ష‌కు ఆయ‌న‌కే ఆహ్వానం లేకుండా చేశారు. జిల్లాల్లో జ‌గ‌న్ త‌రువాత నేనే అని చెప్పుకునే వైవీకి ఈ ప‌రిణామం ఊహించ‌ని షాక్ ఇచ్చింది. అయితే, త‌న‌నే అంటి పెట్టుకుని.. కోట్ల‌కు కోట్లు పార్టీ కోసం ఖర్చు పెట్టి ప‌ని చేసిన ఎంతోమంది నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌ఛార్జ్‌ల‌ను ప‌క్క‌న పెట్టేశారు మ‌న జ‌గ‌న్‌ మోహ‌న్‌ రెడ్డి గారు. మ‌రి అలాంటి ఆయ‌న‌కు బాబాయ్ ఒక లెక్క‌నా అంటూ వైసీపీ శ్రేణులు గుస‌గుస‌లు ఆడుకుంటున్నారు. వైవీ సుబ్బారెడ్డి వైసీకి వ్యతిరేకంగా పనిచేస్తే జిల్లాలో వైసీపీకి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని విశ్లేషకుల అంచనా.

Copy Protected by Chetan's WP-Copyprotect.