సీఎం ఇంటి వద్ద గంటాతో పాటు ఆయన! ముందు నుంచి అనుకున్నది నిజమే అవుతోందా?

గంటాతో పాటు సీఎం చంద్రబాబు ఇంటికి వెళ్లిన మాజీ మంత్రి శైలజానాథ్. సీఎం చంద్రబాబు ఇప్పటికే సేకరించిన సమాచారంతోపాటు తాజాగా కూడా ఐవీఆర్‌ ద్వారా అభిప్రాయాలు సేకరించారు. నేరుగా నియోజకవర్గాల ఓటర్లకు ఫోన్లు చేసి అభిప్రాయాలు తీసుకున్నారు. పబ్లిక్ మాత్రం అనంతపురం జిల్లా సింగనమల టికెట్ శైలజానాథ్ కి ఇస్తే బాగుంటుంది అనే అభిప్రాయం రావటంతో సీఎం ఆయనకు కబురు పంపారని భావిస్తున్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావుతో మాజీ మంత్రి శైలజానాథ్‌ కలిసి సీఎం ఇంటి వద్ద కనిపించడం జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయింది.

అనంతపురం జిల్లాకు చెందని శమంతక మణికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించటం వెనుక ఆ జిల్లా రాజకీయం ఇమిడి ఉందని తెలుస్తోంది. ఆల్‌ రెడీ ఎస్సీ వర్గం నుంచి శమంతక మణి ఎమ్మెల్సీగా ఉన్నారు. మరోమారు కొనసాగింపు ఇవ్వడం వెనుక.. ఆమె నియోజకవర్గం శింగనమల రాజకీయ సమీకరణాలు ఉన్నాయని పార్టీ వర్గాల సమాచారం. అక్కడ శమంతక మణి కుమార్తె యామిని బాల టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. సర్వేలు అన్నీ ఆమె ఈసారి గెలవదని చెప్పాయి. సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఆమె పనితీరుపై జనంలో అసంతృప్తి బాగా ఉంది. దానికి తోడు ఆ సీటు ఇస్తాం అంటే వంద శాతం గెలిచే నాయకుడు టీడీపీలోకి వస్తాడు. ఆయనే సమైక్యాంధ్ర పోరాటంలో ముందు భాగాన నిలిచిన మాజీ మంత్రి శైలజానాథ్‌. ఆయన టీడీపీలోకి రావటానికి సిద్ధంగా ఉన్నారు. గత ఎన్నికల సమయంలోనే శైలజానాథ్‌ టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. శింగనమల నియోజకవర్గం నుంచి..తెలుగుదేశం పార్టీ తరపున.. పోటీ చేసేందుకు పత్రాలు రెడీ చేసుకున్నారు. కానీ చివరి క్షణంలో వెనుకడుగు వేశారు. దాంతో.. తెలుగుదేశం పార్టీ అప్పటికప్పుడు యామినిబాలను రంగంలోకి దించింది. తెలుగుదేశం పార్టీ సునాయస విజయం సాధించింది. దీంతో శైలజానాథ్ పశ్చాతాప పడ్డారు. అప్పట్నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో అంటీముట్టనట్లు ఉన్నారు.

కొద్ది రోజుల కింట మీడియాతో మాట్లాడిన… ఆయన… వైఎస్ జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. బతుకునిచ్చిన కాంగ్రెస్ పార్టీని ముంచేసి.. సొంత పార్టీ పెట్టుకున్నారని మండిపడ్డారు. వైసీపీ నుంచి ఎన్ని ఆఫర్లు వచ్చినా ఆయన అటు వైపు తొంగి చూడలేదు. చాలా కాలం తర్వాత ఇటీవల సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. దాదాపుగా పది నిమిషాలు చంద్రబాబుతో శైలజనాథ్ చర్చించారు. ప్రధానంగా అనంతపురం రాజకీయాలు… తాను టీడీపీలో చేరితే లభించే అవకాశాలు ఎలా ఉంటాయన్నదానిపై మాట్లాడినట్లు తెలుస్తోంది.

Copy Protected by Chetan's WP-Copyprotect.